Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సౌరశక్తి, అణువిద్యుత్‌లే ప్రత్యామ్నాయం

$
0
0

విజయనగరం, జనవరి 23: దేశంలో విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సౌరశక్తి, అణువిద్యుత్‌లే ప్రత్యమ్నాయాలని బార్క్ (బాబా ఆటోమిక్ ఎనర్జీ సెంటర్) మాజీ చైర్మన్, డిఎఇ కార్యదర్శి ఎస్.బెనర్జీ అన్నారు. ప్రస్తుతంలో దేశంలో విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉందన్నారు. సరాసరి తలసరి విద్యుత్ వినియోగం 700 యూనిట్లుకాగా, అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి వినియోగం 2800 యూనిట్లు ఉందని వివరించారు. గురువారం ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ‘జాతీయాభివృద్ధిలో అణుశక్తి పాత్ర’ అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సులో భాగంగా తొలిరోజు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్ఛేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా 4780 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతున్నామన్నారు. 2017 నాటికి 10080 మెగావాట్లు, 2021 నాటికి 27080 మెగావాట్లు, 2032 నాటికి 48వేల మెగావాట్ల అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలమని ఆయన వివరించారు. బార్క్ రెండో పరిశోధన కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నట్టు మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్.బెనర్జీ వివరించారు. తూర్పుతీర ప్రాంతంలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల పరిశోధనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఏటా 1.3 మీటర్ల సముద్రమట్టం పెరుగుదల
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ సమతుల్యం దెబ్బతినడం వల్ల సముద్రం ఎత్తు ప్రతి ఏటా 1.30 మీటర్ల ఎత్తు పెరుగుతుందని డాక్టర్ ఎస్.బెనర్జీ చెప్పారు. ఇది ఆందోళన కలిగించే పరిణామమన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న కాలంలో బంగ్లాదేశ్, ఇండోనేషియా, విశాఖపట్నం వంటి ప్రాంతాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ప్రపంచంలో ప్రతి దేశం గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. అణువిద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల వాతావరణానికి ఎటువంటి హాని ఉండదని చైర్మన్ బెనర్జీ వివరించారు. దీనివల్ల ఆందోళన చెందాల్సినంత రేడియేషన్ ఉండదన్నారు. ప్రస్తుతం మన దేశంలో ధర్మల్ విద్యుత్, హైడ్రోఎలక్ట్రిక్ వంటి ఉత్పత్తుల వల్ల ఏర్పడే కాలుష్యం కంటే అణువిద్యుత్ వల్ల కలిగే రేడియేషన్ పది మిల్లీమైక్రాన్ల కంటే తక్కువని వివరించారు.
రేడియేషన్‌పై ప్రజల్లో అపోహలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. కొవ్వాడ, ఇతర ప్రాంతాల్లో న్యూక్లియర్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. అయినప్పటకీ దేశంలో విద్యుత్ అవసరాలను తీర్చాలంటే న్యూక్లియర్ ఎనర్జీ ఒక్కటే పరిష్కారమన్నారు. అణువిద్యుత్ ఉత్పత్తి చౌకగా లభించడంతోపాటు విద్యుత్ పంపిణీలో నష్టాలు ఉండవని వివరించారు. ప్రపంచంలో జర్మనీ అణువిద్యుత్ ఉత్పత్తిలో ముందంజలో ఉందన్నారు. అక్కడ 17 అణురియాక్టర్లతో ఆ దేశానికి అవసరమైన నాల్గో వంతు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతున్నారని చెప్పారు. దేశంలో 1957 నుంచి అణుశక్తి రియాక్టర్లతో పనిచేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా ఎటువంటి చిన్న సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. అణు ప్రమాదం వల్ల చనిపోయిన వారి సంఖ్య పదికి మించలేదన్నారు. అదే సునామీ రావడం వల్ల 25వేల మంది మృతి చెందారని ఆయన వివరించారు.
41 రకాల వంగడాలు రూపకల్పన
బార్క్ ద్వారా వ్యవసాయ రంగంలో 41 రకాల వంగడాలను రూపకల్పన చేయడంతోపాటు వాటివల్ల చీడపీడల నివారణను అరికట్టడం, పంట కాలపరిమితిని తగ్గించడం, అధిక దిగుబడులు సాధించడం వంటి లక్షణాలు గల వంగడాలను రూపొందించామని డాక్టర్ బెనర్జీ చెప్పారు. వాటిలో ఎక్కువగా అపరాలు, పప్పుదినుసులు వంటి వాటిలో ఈ వంగడాలను వినియోగిస్తున్నట్టు చెప్పారు. మహారాష్టల్రో 90 శాతం రైతులు ఈ వంగడాలను వినియోగిస్తున్నట్టు వివరించారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ అణుశక్తి ద్వారా ఆహార భద్రత, దేశ భద్రత, నీటి భద్రత, ఆరోగ్య భద్రత వంటి వాటికి అవకాశం ఏర్పడిందన్నారు. వీటిని సరైన దిశలో వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని వివరించారు. ఈ సదస్సులో ప్రిన్సిపల్ డాక్టర్ కెవిఎల్ రాజు, డైరెక్టర్ ఆర్.కె.సింగ్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీలు
విజయనగరం , జనవరి 23: జిల్లా పోలీస్ శాఖలో వివిధ పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్సైలకు బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ డిఐజి ఉమాపతి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే శిక్షణ పూర్తి చేసుకున్న 38 మంది ఎస్సైలకు జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లలో పనిచేసిన పలువురు ఎస్సైలను జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లనకు బదిలీ చేయడంతోపాటు విశాఖ జిల్లాకు మరికొంతమందిని బదిలీ చేశారు.
* శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైలు : ఎ.నరేష్ (నెల్లిమర్ల), పి.నారాయణరావు (ఆండ్ర), ఎస్.రవి (తెర్లాం), వి.పాపారావు (బాడంగి), ఆర్.వాసుధేవ్ (సీతానగరం), ఎస్.్భస్కరరావు (సాలూరు టౌన్), ఐ.దుర్గాప్రసాద్ (విజయనగరం రూరల్), కె.నీలకంఠం (గుర్ల), డి.సాయికృష్ణ (గజపతినగరం), కె.పి మూర్తి (బుదరాయవలస), జి.కళాధర్ (డెంకాడ), వై.సింహాచలం (బూర్జివలస), డి.ఈశ్వరరావు (గరుగుబిల్లి), ఎస్.కృష్ణ వర్మ (గరివిడి), జె.తారకేశ్వరావు (బొండపల్లి), ఎం.ప్రశాంత్‌కుమార్ (జామి), బి.సురేంద్రనాయుడు (పార్వతీపురం టౌన్), పి.్ధనకర్ (ఎల్.కోట), పి.చంధ్రశేఖర్ (బల్జిపేట), వి.అశోక్‌కుమార్ (పార్వతీపురం టౌన్), యు.మహేష్ (పెదమానాపురం), ఎస్.కృష్ణమూర్తి (ఎస్.కోట), వి.బాలాజీరావు (వల్లంపూడి), ఎస్.్ఫరూకుద్దీన్ (పూసపాటిరేగ), పి.పాపారావు (చినమేరంగి), వి.లోవరాజు (్భగాపురం), బి.రవీంద్రరాజు (మక్కువ), ఐ.గోపి (ఎల్విన్‌పేట), ఎన్.అశోకచక్రవర్తి (కురుపాం), ఎస్.సరీఫ్ (గంట్యాడ), ఎ.హరికృష్ణ (జియ్యమ్మవలస), ఎస్.రామారావు (సాలూరు రూరల్), ఎం.రవికుమార్ (పార్వతీపురం రూరల్), ఎస్.సంతోష్‌కుమార్ (రామభద్రపురం), డి.రవికుమార్ (పాచిపెంట), డి.కాంతారావు (నీలకంఠాపురం), జె.్ధర్మేంధ్ర (కొమరాడ).
* బదిలీ అయిన ఎస్సైలు: కొత్తవలస ఎస్సై బి.రామయ్యకి విజయనగరం ఒన్‌టౌన్, గజపతినగరం ఎస్సై టి.కామేశ్వరావుకి ఒన్‌టౌన్, డెంకాడ ఎస్సైకి సి.హెచ్ శ్రీ్థర్‌కి విజయనగరం టూటౌన్, జామి ఎస్సై బి.లూథర్‌బాబుకి కొత్తవలస, టి.కాంతికుమార్, ఎస్.శ్రీనివాస్, సి.హెచ్ ప్రసాద్, టి.శ్రీనివాసరావు, బి.అప్పలనాయుడు, కె.రామారావులకు విజయనగరం డిఎస్‌బికి, డిసిఆర్‌బికి డి.సుధాకర్ బదిలీ కాగా బొబ్బిలి ఎస్సై ఎం.నాగేశ్వరావుకు చీపురుపల్లి, చీపురుపల్లి ఎస్సైకి షేక్‌అబ్ధుల్ మారూఫ్‌కి సాలూరు టౌన్‌కి, ఎస్.కోట ఎస్సై ఎ.సంతోష్‌కుమార్‌కు విజయనగరం సిసిఎస్‌కి, బొండపల్లి ఎస్సై డి.దేవుడు నాయుడుకి కొత్తవలస, పార్వతీపురం టౌన్ ఎస్సై బి.లక్ష్మణరావుకి విజయనగరం సిసిఎస్‌కి, పాచిపెంట ఎస్సై సి.హెచ్ స్వామినాయుడికి విజయనగరం ట్రాఫిక్, నీలకంఠాపురం ఎస్సై కె.ఎస్.కె.ఎన్.జి.ఎ నాయుడకి బొబ్బిలి, కురుపాం ఎస్సైకి ఆర్.పి.ఆర్ ప్రసాద్‌కి బొబ్బిలి, ఎల్.కోట ఎస్సై డి.సుధర్శనరావుకి విజయనగరం డిటిసి, బాడంగి ఎస్సై వై.డి మహేశ్వరావుకి విజయనగరం పిసిఆర్, తెర్లాం ఎస్సై పి.సత్యన్నారాయణకి విజయనగరం సిసిఎస్, ఆండ్ర ఎస్సై ఆర్.బాబూరావుకి విజయనగరం పిసిఆర్, బూర్జువలస ఎస్సైకి డి.శేఖర్‌కి బొబ్బిలి ట్రాఫిక్, బుదరాయవలస ఎస్సై ఎన్.వి.జె నాయుడుకి విజయనగరం సి.సిఎస్‌కి, చినమేరంగి ఎం.ఈశ్వరరావుకి విజయనగరం సిసిఎస్‌కి బదిలీ అయ్యరు.
* విశాఖ సిటీకి బదిలీ : కె.రవికుమార్, హెచ్.ఉపేంద్రరావు, జి.ఎ వెంకటరమణ, పి.వరప్రసాద్, ఎస్.్ధనుంజయరావు, పి.రామకృష్ణ, ఎస్.కామేశ్వరావు, ఎస్.షణ్ముఖరావు, ఎస్.అమ్మినాయుడు, కె.నారాయణరావు, డి.దీనబందు.

రైలు ఢీకొని త్రిబుల్ ఐటి విద్యార్థి మృతి
సీతానగరం, జనవరి 23: త్రిబుల్ ఐ.టి చదువుతున్న విద్యార్థి రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడక్కడే మృతిచెందిన వైనం వెలుగుచూసింది. రైల్వే పోలీసులు అందించిన వివరాల మేరకు మండల కేంద్రంలో ఉన్న సుంకరివీధికి చెందిన రఘు మండల శంకరరావు(23) గురువారం సువర్ణముఖి నది వద్ద రైల్వే పట్టాలు దాటుతుండగా తెల్లవారుజామున గుర్తు తెలియని రైలు ఢీకొంది. దీంతో శంకరరావు శరీర భాగాలు గుర్తుపట్టని విధంగా నుజ్జు అయ్యాయి. ఈ మేరకు శంకరరావు రూర్కెలలో త్రిబుల్ ఐ.టి చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పండుగకు నెలరోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. తిరిగి గురువారం వెళ్లాల్సి ఉన్నప్పటికి పట్టాలు దాటుతుండగా మృత్యువాతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకుల రోదన వర్ణాతీతం. శంకరరావు తల్లి గౌరమ్మ కూలీ పని చేసుకుని చదివిస్తుంది. త్రిబుల్ ఐ.టి పూర్తికావస్తుందని, అందివస్తాడనుకున్న కొడుకు అందనంత లోకాలకు వెళ్లడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఈ మేరకు హెచ్.సి నారాయణరావు పోస్టుమర్టం నిమిత్తం శంకరరావు మృతదేహాన్ని బొబ్బిలి పి.హెచ్.సికు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి: కమిషనర్
విజయనగరం (్ఫర్టు), జనవరి 23: పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రత్యేకంగా దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి కోరారు. గోల్డెన్‌వీక్ (బంగారువారం) కార్యక్రమంలో కంటోనె్మంట్ యూత్ హస్టల్ నుంచి మున్సిపల్ పాఠశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ జంక్షన్ మీదుగా కంటోనె్మంట్ మున్సిపల్ హైస్కూల్‌వరకు సాగింది. ఈ సందర్భంగా గోవిందస్వామి మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. దీనిలోభాగంగా రోడ్లపై పేరుకుపోయిన చెత్త, కాలువల్లో పూడిక ఎప్పటికప్పుడు తొలగిస్తామన్నారు. ముఖ్యంగా తడిచెత్త-పొడి చెత్త వేర్వేరుగా చేయడంతోపాటు పాస్టిక్ నియంత్రణపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాలపై విద్యార్థులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం పెరిగితే పర్యావరణ పరిరక్షణకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

10 నుంచి రెవెన్యూ సదస్సులు: మంత్రి
విజయనగరం, జనవరి 23: భూములకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు వచ్చే నెల 10 నుంచి రెవెన్యూ సదస్సులను చేపట్టాలని మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. గురువారం సచివాలయం నుంచి ఆయన వీడియోకానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్వో, విఆర్‌ఎ పరీక్షల నిర్వహణపై సిసిఎల్‌ఎ ఐవైఆర్ కృష్ణారావుతోకలసి వీడియో కానె్ఫరెన్స్ నిర్వసించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేసేందుకు వీలుగా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకునేందుకు అవకాశం కల్పించినట్టు చెప్పారు.
కాగా, విఆర్వో, విఆర్‌ఎ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వీడియోగ్రఫీ తీయడంతోపాటు అభ్యర్థుల వేలిముద్రలు కూడా తీసుకోవాలన్నారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించరాదన్నారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ జిల్లాలో 4400 దరఖాస్తులు అందాయని, 168 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఎజెసి నాగేశ్వరరావు, డిఆర్వో వెంకట్రావు, సబ్‌కలెక్టర్ శే్వతామహంతి, ఆర్డీవో వెంకట్రావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

‘ఆధునిక పనిముట్లకు రూ. 3.65 కోట్లు మంజూరు’
గజపతినగరం, జనవరి 23 : జిల్లాలో అవసరమైన రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లు రాయితీపై సరఫరా చేయడానికి రూ. 3.65 కోట్లు నిధులు మంజూరైనట్లు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకురాలు డి.ప్రమీల చెప్పారు. గురువారం ఇక్కడ సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం ద్వారా జిల్లాలో పప్పుదినుసుల రకాలకు చెందిన పైర్లు కంది 1300 హెక్టార్లలోను, మినుము 300 హెక్టార్లలోను సాగు చేయడానికి ఇన్‌పుట్ సబ్సిడీ హెక్టార్‌కు ఐదువేలు వంతున అందజేయడం జరిగిందన్నారు. గజపతినగరం సబ్ డివిజన్ పరిధిలో 44.09 లక్షలు విలువ గల ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్లు, టార్పాన్లు రైతులకు అందజేశామన్నారు. రబీలో పప్పుదినుసుల అభివృద్ది పథకం క్రింద జిల్లా వ్యాప్తంగా 3,450 హెక్టార్లలో మినుము, పెసరపైర్లను సాగు చేస్తున్నారన్నారు. భూచేతన పథకం ద్వారా ఖరీఫ్‌లో 1600 హెక్టార్లలోను రబీలో 870 హెక్టార్లలో వరి సాగు చేయడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని గజపతినగరం, గంట్యాడ, పాచిపెంట మండలాల్లో అమలు జరుపుతున్నట్లు చెప్పారు. సేంద్రియ ఎరువుల వాడకంలో రైతుల్లో అవగాహన కల్పించేందుకు పూర్తిస్థాయిలో ప్రచార కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో ఖరీఫ్‌లో రూ. 480 కోట్లు, రబీలో 156 కోట్లు పంట రుణాలుగా అందజేసినట్లు చెప్పారు.. సహాయ సంచాలకులు సిహెచ్ లచ్చన్న, మండల వ్యవసాయ అధికారులు టి.సంగీత, కె. తిరుపతమ్మ, కె.తిరుపతిరావు, మాధవి తదితరులు పాల్గొన్నారు.

పోలీసుస్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ
మక్కువ, జనవరి 23: శంబర పోలమాంబ జాతర సందర్భంగా జిల్లా ఎస్పీ షబ్భీర్ ఇక్భాల్ గురువారం మక్కువ పోలీసుస్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసుస్టేషన్‌లో ఆయన సి. ఆర్.పి. ఎఫ్ క్వార్టర్స్, వాచ్‌టవర్ నిర్మాణంను, పోలీసు స్టేషన్ క్వార్టర్స్‌ను పరిశీలించి వివరాలను సి. ఐ దేవుళ్లను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, రూట్‌మ్యాప్‌లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శంబర జాతరకు పటిష్ఠమైన బందోబస్తు కోసం 800మంది పోలీసుసిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. 11మంది సి. ఐలు, 35మంది ఎస్. ఐలు, డి ఎస్పీను నియమించామన్నారు. ఈ కార్యక్రమం ఒ. ఎస్.డి కె.ప్రవీణ్ అధ్వర్యంలో జరుగుతుందన్నారు. ట్రాఫిక్, క్రైం, కూంబింగ్, తదితర పార్టీలున్నాయన్నారు. సిరిమాను సంబరానికి 40మంది ఎస్.టి. ఎఫ్ జవాన్లను రోప్‌పార్టీకి నియమించామన్నారు. 6 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. క్రైం రేటు తగ్గిందన్నారు. అక్టోబర్‌లో 30 ఉంటే డిసెంబర్‌లో 3మాత్రమే వచ్చాయన్నారు. ప్రాపర్టి రికవరీ పెరిగిందని తెలిపారు. బోర్డర్ ఏరియాలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్నారు. ప్రజలతో పోలీసులు మమేకం అయ్యేందుకు తత్సంబధాలను ఏర్పరించేందుకు వాలీబాల్ టోర్నమెంట్‌లు, క్రికెట్, ఉచిత వైద్య శిబిరాలు, ట్రైబుల్ విద్యార్థుల కోసం ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు రిక్య్రూట్‌మెంట్ చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.బి.సి. ఐ లీలారావు, సి. ఐ దేవుళ్లు, ఎస్. ఐ పి.వరప్రసాద్, సి. ఆర్.పి. ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, తదితరులు పాల్గొన్నారు.

ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేయాలి
దత్తిరాజేరు, జనవరి 23 : గ్రామాల్లో నిత్యవసర సరుకులు పొందుతున్న రేషన్ కార్డుల లబ్ధిదారులు, తమకు చెందిన ఆధార్ కార్డుల వివరాలను డీలరుకు తెలియజేయాలని తహశీలల్దార్ జి.అప్పలనర్సయ్య తెలిపారు. అలాగే రేషన్ కార్డు లబ్ధిదారులకు, తమ బ్యాంకు ఖాతా నెంబరును కూడా ఇవ్వాలని తెలిపారు. లేనియెడల రేషన్ సరుకులు పొందడం కష్టమని అన్నారు. అలాగే 25న జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా, పోలింగ్ కేంద్రాల పరిధిలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే ఈనెలాఖరు నాటికి ఓటరు జాబితాలు కొత్తగా వస్తాయని, వాటిని గ్రామాల్లో చదివి వినిపించాలని కోరారు. అలాగే కొత్తగా ఓటరు నమోదు చేసుకున్న వారికి జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు, గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని తహశీల్దార్ తెలిపారు.

ధ్రువప్రతం కోసం ఆర్.ఐ సంతకం ఫోర్జరీ
బొబ్బిలి (రూరల్), జనవరి 23: నివాస ధ్రువీకరణ పత్రం కోసం తహశీల్దార్, ఆర్.ఐ, వి.ఆర్‌ఒల సంతకాలు పోర్జరీ చేసిన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబందించి వివరాలను ఆర్.ఐ అప్పలనాయుడు గురువారం విలేఖరులకు తెలియజేశారు. మండలం గొంగాడవలస పంచాయితీ పరిధిలో ఉన్న అన్నంనాయుడువలస గ్రామానికి చెందిన నేతల అప్పారావుకు నివాస ధ్రువీకరణ పత్రం ఉంది. బ్యాంకు అకౌంటు ప్రారంభించాలంటే నివాస ధ్రువీకరణ పత్రం అవసరం కావడంతో రెడ్డియవలస గ్రామానికి చెందిన నేతల శ్రీనును సర్ట్ఫికెట్ కావాలని అప్పారావు ఆశ్రయించారు. దీంతో నేతల శ్రీను గత నెల 26న తహశీల్దార్, ఆర్.ఐ, వి.ఆర్.వోల సంతకాలతో పాటు సీలు వేసి అప్పారావుకు నివాస ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. సర్ట్ఫికేట్ పట్టుకుని అప్పారావు ఎకౌంట్ ప్రారంభించేందుకు ఎస్.బి.హెచ్‌కు ఇటీవల వెళ్లాడు. సర్ట్ఫికెట్ మీద పొటో ఉండడంతో అక్కడ కూడ తహశీల్దార్ సంతకం చేయించుకుని రావాలని బ్యాంకు అధికారులు అప్పారావుకు సూచించారు. దీంతో అప్పారావు నేరుగా తహశీల్దార్ కె.సూర్యనారాయణ దగ్గరుకు వెళ్లి సంతకం కావాలని అడిగాడు.
వెంటనే తహశీల్దార్ సర్ట్ఫికేట్‌ను చూసి ఈ సంతకం తనది కాదని ఎవరు నీకు సర్ట్ఫికేట్ ఇచ్చారని నిలదీశారు. దీంతో అప్పారావు వెంటనే నేతల శ్రీను సర్ట్ఫికేట్ అందించినట్లు తెలియజేశారు. సర్ట్ఫికెట్‌కు సంబంధించిన సంతకాలన్ని పోర్జరీ అని తెలిపారు. వెంటనే ఆర్.ఐ అప్పలనాయుడును దర్యాప్తు చేయాలని ఆదేశించారు. శ్రీనుపై క్రిమినల్ కేసు పెడుతున్నట్లు అప్పలనాయుడు స్పష్టం చేశారు.

రహదారి నిబంధనలు పాటించండి: ట్రాఫిక్ సిఐ
విజయనగరం , జనవరి 23: రహదారి నిబంధనలు పాటించి, ప్రమాదాలు నివారణకు కృషి చేయాలని విజయనగరం ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ.రవికుమార్ కోరారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా గురువారం ఇక్కడ ఆర్టీసీ ప్రాంతీయ సిబ్బంది శిక్షణా కళాశాలలో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకాగ్రతతో వాహనాలను నడపాలమన్నారు. ‘ఇతరులకు దారి ఇవ్వండి. సాఫీగా ముందుకు సాగండి. భద్రంగా గమ్యం చేరండి’ అనే నినాదంతో డ్రైవింగ్ చేయాలన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్ధానాలకు చేర్చే బాధ్యత డ్రైవర్లకే కాకుండా కండక్టర్లకు కూడా ఉంటుందన్నారు. చాలాచోట్ల నెమ్మదిగా వెళుతున్న సమయంలో చాలామంది ప్రయాణికులు దిగిపోతున్నారని, దీనివల్ల ప్రదామాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల ప్రయాణికులు దిగకుండా కండక్టర్లు కట్టడి చేయాలన్నారు. పట్టణంలో రాజీవ్‌గాంధీ, మయూరీ జంక్షన్ తదితర చోట్ల రోడ్డు మధ్యలో ఆర్టీసీ బస్సులను నిలుపుతున్నారని, ఈ విధంగా చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలను ఏర్పడుతున్నాయన్నారు. ప్రాంతీ రవాణాశాఖ మోటారువాహనాల సీనియర్ ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ వాహనాలను ఏకాగ్రతతో, జాగ్రత్త నడపాలని కోరారు. మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్ సుధీర్, ఆర్టీసీ స్ట్ఫా ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ త్రినాధబాబు తదితరులు పాల్గొన్నారు.

దేశంలో విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సౌరశక్తి, అణువిద్యుత్‌లే
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles