Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

. ఓటుహక్కు వినియోగించుకోవాలి

$
0
0

ఏలూరు, నవంబర్ 25 : ఎన్నికల సమయంలో ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ హరికృష్ణ పిలుపు నిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక సెయింట్ థెరిస్సా కళాశాల మైదానంలో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ ఓటేకదా అని మిన్నకుంటే చక్కటి నేతను ఎన్నుకునే అవకాశం కోల్పోయే అవకాశం వుంటుందన్నారు. రాజ్యాంగ నిర్మాతలు అందించిన ఓటు హక్కును ఎవరికి వారు తమ ఆత్మప్రబోధం మేరకు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో కేవలం 50 శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ విధంగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోకపోవడం స్వయం కృతాపరాధమేనని స్పష్టం చేశారు. నిరాశక్తత, నిర్లిప్తత విడనాడి అర్హత ఉన్న ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్ననాడే జాతీయ ప్రయోజనాలను కాంక్షించే అభ్యర్ధులే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. మరో అతిధిగా హాజరైన రెండవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎ హరిహరనాధ శర్మ మాట్లాడుతూ ఓటును సద్వినియోగం చేసుకుని మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకుని అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటు హక్కు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని ప్రజాస్వామ్యంలో జనం బలానికి ప్రతీక ఓటు అని అన్నారు. మూడు గంటలపాటు వీక్షించే సినిమా విషయంలో ఎంతో ఆలోచిస్తామని అదే విధంగా అయిదు సంవత్సరాలపాటు మనకు పాలనను అందించే వారి ఎన్నిక విషయంలో కూడా అంతే శ్రద్ధ వహించాలని సూచించారు. న్యాయ శాస్త్రంలోని 171వ సెక్షన్ ప్రకారం ఓటు విషయంలో ప్రలోభాలకు గురి చేసే వారితో పాటు తీసుకున్న వారు కూడా నేరం చేసినట్లేనని చెప్పారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా అంతరాత్మ సాక్షిగా ఓటు వేస్తే అయిదు ఏళ్ల మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్నారు. విచక్షణ కోల్పోయి ఓటు వేస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరు, జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి సిద్ధార్ధ్‌జైన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య మనుగడను కాపాడుకోవాలంటే ఓటు హక్కు వినియోగం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. నిస్వార్ధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు లొంగకూడదని ఆయన పిలుపునిచ్చారు. ఓటుకు విలువకట్టే స్థాయి ఏ ఒక్కరికీ లేదని ఓటు అనేది అమూల్యమైనదని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలను నిర్ధేశించడంలో యువత కీలకపాత్ర పోషించాలని, జిల్లా వ్యాప్తంగా 18-19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు 73 వేల మంది వున్నారని చెప్పారు. యువత మంచి నాయకత్వం ఉన్న వ్యక్తిని, పనిచేసే ప్రజానాయకుడిని ఎన్నుకోవడానికి తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురి అయితే ప్రజాస్వామ్యం అమ్ముడుపోతుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేసే వారు ఆ తర్వాత కాలంలో వాటిని వసూలు చేసుకునేందుకు ప్రక్కదారి పడతారని దానివల్ల మనమే ఇబ్బంది పడాల్సిన అగత్యం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ నెల 31వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించడం జరుగుతుందని ఆ తర్వాత ఓటర్లుగా నమోదు అయ్యేందుకు కొత్త వారికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. తొలుత న్యాయమూర్తి హరహరనాధ శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏలూరు ఆర్‌డివో బి శ్రీనివాసరావు దేశ ఎన్నికల ప్రధానాధికారి వి ఎస్ సంపత్ పంపిన ఓటరు దినోత్సవ ప్రాముఖ్యతను సభలో చదివి వినిపించారు. తదుపరి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ ఓటర్లు జె వీరభద్రరావు, వెంకటప్పయ్య, మామిళ్ల నక్షత్రమ్మ, గరికిముక్కల పెంటమ్మ తదితరులను జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్, న్యాయమూర్తి హరిహర నాధ శర్మ, ఎస్‌పి హరికృష్ణలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఓటు ప్రాముఖ్యతను తాడేపల్లిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన సౌజన్య, ప్రసన్నలు ఉపన్యసించారు. అనంతరం జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు, 3కె రన్‌లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలను ముఖ్య అతిధులు అందజేశారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, జడ్పీ సి ఇవో వి నాగార్జునసాగర్, డి ఎస్‌పి ఎం సత్తిబాబు, డి ఇవో ఆర్ నరసింహరావు, డ్వామా పిడి ఎన్ రామచంద్రారెడ్డి, సెట్‌వెల్ సి ఇవో ఎండిహెచ్ మెహర్రాజ్, సెయింట్ థెరిస్సా కళాశాల కరస్పాండెంట్ సిస్టర్ మరియట్ట పూదోట తదితరులు పాల్గొన్నారు.

పారిజాతగిరిలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం, జనవరి 25: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లూరు రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో తెల్లవారు ఝామున స్వామివారికి సుప్రభాత, తోమాల, అర్చన సేవలు నిర్వహించారు. తీర్థ ప్రసాదగోష్ఠి అనంతరం ప్రత్యేకాలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు జంగారెడ్డిగూడెంకు చెందిన పాకనాటి సత్యనారాయణ దంపతులు, ఆండ్ర మోహనరాజు దంపతులు అన్నప్రసాద వితరణ జరిపించారు. స్వామివారికి పుష్పాలంకరణ కూడా జరిపించారు. ఈ కార్యక్రమాలలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు(శివ), ఆలయ అభివృద్ది కమిటి సభ్యులు పేరిచర్ల జగపతిరాజు, కాకాని శ్రీహరిరావు, బిక్కిన సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ, దండు ధనరాజు, కంది బాలకృష్ణారెడ్డి, రెడ్డి రంగప్రసాదరావు, పోరూరి వెంకటరావు, మాదల రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
అంధ విద్యార్థి ఆత్మహత్య
తాళ్లపూడి, జనవరి 25: తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామానికి చెందిన డేరా ముసలయ్య (17) అనే యువకుడు రాజమండ్రిలో తాను చదువుకుంటున్న హాస్టల్‌లోనే ఉరి వేసుకుని మృతిచెందిన సంఘటన ఆ కుటుంబాన్ని కలచివేసింది. ప్రక్కిలంకకు చెందిన డేరా సూరిబాబు, లక్ష్మిల కుమారుడు ముసలయ్య మూగ, చెవిటితో పుట్టాడు. చదువు పట్ల ఆసక్తితో వున్న ఆ యువకుడిని రాజమండ్రిలోని ఒక విద్యాసంస్థలో చేర్పించారు. అదే విద్యాసంస్థకు చెందిన హాస్టల్‌లో శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం శనివారం మధ్యాహ్నం ఆ యువకుడి మృతదేహం స్వగ్రామం ప్రక్కిలంకకు చేరింది. తమ కుమారుడి మృతి ఉదంతంలో నిజానిజాలు తేల్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
గర్భిణీల శస్తచ్రికిత్సల నిరోధానికి
ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా:కలెక్టర్
ఏలూరు, జనవరి 25 : జిల్లాలో గర్భిణీలకు ప్రసవ సమయంలో అనవసర ఆపరేషన్ల నిరోధానికి ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం ఐఎంఏ ప్రతినిధులు, ప్రైవేటు ఆసుపత్రుల వైద్య నిపుణులతో కలెక్టర్ అనవసర ఆపరేషన్లపై సమీక్షించారు.ప్రసవ సమయంలో సిజేరియన్ ఆపరేషన్లు చేయడంలో జిల్లా ప్రపంచంలోనే అగ్రస్థానంలో వుందని దీని నివారణకు ప్రైవేటు వైద్య నిపుణులు శ్రద్ధ వహించాలని కలెక్టర్ కోరారు. ప్రపంచ వ్యాప్తంగా 15 నుండి 18 శాతం మందికి మాత్రమే ప్రసవ సమయంలో ఆపరేషన్లు నిర్వహిస్తుండగా పశ్చిమగోదావరి జిల్లాలో 66 శాతం మందికి ఆపరేషన్లు చేయడం ఎంతో దారుణమని దీనివల్ల మహిళల భవిష్యత్తు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఇటువంటి పరిస్థితిని తొలగించడానికి జిల్లాలోని ప్రైవేటు వైద్య నిపుణులు పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగంతోసహకరించాలని ఆయన కోరారు. చిత్తూరు జిల్లాలో కేవలం 28 శాతం మందికి మాత్రమే ప్రసవ సమయంలో ఆపరేషన్లు జరుగుతుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 66 శాతం మందికి ఎందుకు సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని కలెక్టర్ ప్రశ్నించారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుని వైద్య పరమైన అత్యవసర సమయంలోనే సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో గర్భిణీ స్ర్తిల స్కానింగ్ రిపోర్టుల వివరాలను జిల్లా యంత్రాంగానికి సమర్పించాలని అనవసర ఆపరేషన్ల పరిస్థితిని నియంత్రించడానికి ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుందని, ఎవరైనా ఇష్టానుసారం వ్యవహరిస్తే అటువంటి ఆసుపత్రుల లైసెన్సును రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. డబ్బు కోసమే ప్రైవేట్ ఆసుపత్రులలో అనవసరంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, ప్రతీ కాన్పుకు 15 నుండి 20 వేల రూపాయలకు పైబడి డబ్బును వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని ఇది మంచి విధానం కాదని చెప్పారు. ఒకసారి సిజేరియన్ ఆపరేషన్ జరిగితే మళ్లీ ఆ మహిళ కాన్పు కూడా విధిగా ఆపరేషన్ చేయాల్సి వస్తుందని ఒక మహిళకు రెండుసార్లు సిజేరియన్ చేయడం వల్ల శారీరకంగా ఆరోగ్యపరంగా ఎంతో నష్టపోతుందని ఇటువంటి వాస్తవాన్ని గుర్తించి జిల్లాలో ఇప్పటి నుండే సిజేరియన్‌లు తగ్గించడానికి ప్రయత్నించాలని వైద్యులను కలెక్టర్ కోరారు. చెస్ట్‌లో నొప్పి వచ్చిందంటే బైపాస్ ఆపరేషన్ చేస్తామా, కడుపులో గ్యాస్ నొప్పి వల్ల కూడా ఛాతీలో నొప్పి వస్తుందని అది కూడా గుండె నొప్పే అని ఆపరేషన్ నిర్వహిస్తామా? అంటూ కలెక్టర్ వైద్యులను ప్రశ్నించారు. జిల్లాలో పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రతీ స్ర్తికి ప్రసవ సమయంలో అవసరమైనప్పుడే సిజేరియన్ చేయడానికి వైద్యులు ముందుకు రావాలని, ఇకపై ప్రతీ ప్రైవేటు ఆసుపత్రిలో నెలలో ఎన్ని కాన్పులు జరిగాయో, వాటిల్లో ఎంత మంది సిజేరియన్ లేకుండా కాన్పులు చేసారో ఆ వివరాలను విధిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారికి సమర్పించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో మాతా శిశు మరణాల సంఖ్యను కూడా పూర్తిగా నిరోధించి ఆరోగ్యవంతమైన సమాజం ఆవిర్భావానికి వైద్య రంగ ప్రముఖులు, సిబ్బంది సహకరించాలని ఆయన కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ టి శకుంతల మాట్లాడుతూ జిల్లాలో గర్భిణీ స్ర్తిలకు పోషకాహారాన్ని అందించి క్యాస్‌లెస్ డెలివరీలు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతీ మహిళా గర్భం దాల్చిన తర్వాత విధిగా పోషకాహారాన్ని తీసుకునేలా ప్రభుత్వమే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని కావున ప్రభుత్వం అమలు చేసే పోషకాహార కార్యక్రమాన్ని గర్భిణీ స్ర్తిలు సద్వినియోగం చేసుకోవాని జిల్లా వైద్య విధాన పరిషత్తు కో ఆర్డినేటర్ డాక్టర్ శంకరరావు కోరారు.
కేంద్ర మంత్రి కమల్‌నాథ్ గడ్డిబొమ్మ దగ్ధం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జనవరి 25: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం ఖాయమని, వచ్చే నెలలో బిల్లు పెడతామని కేంద్ర మంత్రి కమల్‌నాథ్ వ్యాఖ్యానించడం తెలుగు ప్రజలను అవమానించినట్టేనని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు వడ్డి సుబ్బారావు, గంటా సుందర్‌కుమార్ అన్నారు. శనివారం స్థానిక ప్రకాశం చౌక్‌లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కమల్‌నాథ్ గడ్డిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంతో సంబంధం లేనివారు, తెలుగు మాట్లాడ లేనివారు, ఇతర రాష్ట్రాలకు చెందిన దిగ్విజయ్‌సింగ్, చిదంబరం, వీరప్ప మొయిలీ తదితరులు తెలుగు ప్రజలపై పెత్తనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు సమైక్యాంధ్ర ప్రకటనలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎంవిఆర్ అప్పాజీ, నసీమా బేగం, జంపన ఫణీబాబు, బోడపాటి పెదబాబు, గోపు రమాభారతి, పోశింశెట్టి మురళి, బలే ఏసుబాబు, కంభంపాటి బాబ్జీ, నల్ల గంగాధర్, టివివి ప్రసాద్, గొంట్లా సత్యనారాయణ, శివకవి సాంబమూర్తి, రౌతు రమేష్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

పోలవరం రోడ్డు పునర్మిర్మాణం కోసం వైసిపి నిరసన
కొయ్యలగూడెం, జనవరి 25: కొయ్యలగూడెం - పోలవరం రోడ్డు ప్యాచ్ వర్క్‌తో సరిపెట్టరాదని, రోడ్డు పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం పోలవరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికార పార్టీ అయివుండీ, అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చినప్పటికీ, వారి హామీలు నిలుపుకోకుండా ప్యాచ్ వర్క్ మాత్రమే చేస్తూ చేతులు దులుపుకోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నట్టు కాంగ్రెస్ నాయకుడు ముప్పిడి చినబాబు ధ్వజమెత్తారు. పూర్తిగా శిథిలావస్థకు చేరి పది సంవత్సరాలైనప్పటికీ గిరిజన ప్రాంతానికి వెళ్ళే ఈ రహదారిని విస్మరించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ కార్యకర్తలు బి.గంగాధరరావు, శ్రీను, అడపా సత్తిబాబు, ఎం.శ్రీను, తానేటి రాజు పాల్గొన్నారు.
ఏలూరు రేంజ్ డిఐజికి పోలీసు మెడల్
ఏలూరు, జనవరి 25 : పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందించినందుకు ఏలూరు రేంజ్ డిఐజి విక్రమ్‌సింగ్ మాన్‌కు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం విక్రమ్‌సింగ్‌మాన్‌కు ఇండియన్ పోలీస్ మెడల్‌ను ప్రకటించింది. ఢిల్లీకి చెందిన విక్రమ్‌సింగ్ మాన్ 1998 ఐపిఎస్ బ్యాచ్‌నకు చెందినవారు. ఐపి ఎస్ శిక్షణ పూర్తయిన తరువాత ఆయన ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్, మహబూబ్‌నగర్, విజయనగరం జిల్లాల్లో ఎస్‌పిగా పనిచేశారు. అనంతరం వరంగల్ డిఐజిగా పదోన్నతి పొందారు. గత ఏడాది మే 31వ తేదీన వరంగల్ నుంచి ఏలూరు రేంజ్ డిఐజిగా ఇక్కడకు విక్రమ్‌సింగ్ మాన్ బదిలీపై వచ్చారు.
జొన్నలగరువులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ అభినందనీయం
మాజీ ఎంపి హరిరామ జోగయ్య
పాలకొల్లు, జనవరి 25: పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు జొన్నలగర్వు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయమని సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తున్నారని, ఆయన గెలుపొందిన వెంటనే జిల్లాలో భారీ పరిశ్రమ స్థాపించి ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధానిగా చేయాలని జోగయ్య విజ్ఞప్తి చేశారు. శనివారం పాలకొల్లు మండలం జొన్నలగర్వులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆకెన వీరాస్వామి (అబ్బు) ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని రఘురామకృష్ణంరాజు అవిష్కరించారు. అంబేద్కర్ అందరి వాడని, ఒక కులానికో, ఒక ప్రాంతానికో చెందిన వాడు కాదని రఘు అన్నారు. రాబోయే ఎన్నికలు అసెంబ్లీ, పార్లమెంటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టి.బిల్లుపై చర్చించడానికి గడువు అడగ్గా వారం రోజులే ఇవ్వడం అన్యాయమన్నారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ అంబేద్కర్ దశ, దిశ నిర్దేంచిన నాయకుడన్నారు. అంబేద్కర్ విగ్రహం పక్కన ఒక్క డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం తప్ప మరేది ప్రజలు అంగీకరించరని, రాష్ట్రంలో ఆయన పాలనలో పేదలకోసం ప్రవేశపెట్టిన పథకాలు కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా ఉన్నతంగా అమలు చేశారని ఆయన వెల్లడించారు. మళ్లీ ఈ పథకాలు కొనసాగించాలంటే కేవలం జగన్ వల్లనే సాధ్యమని, అందరూ వచ్చే ఎన్నికలో భారీ మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, నడపన చినసత్యనారాయణ, యడ్ల తాతాజీ, గుణ్ణం నాగబాబు తదితరులు ప్రసంగించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ప్రారంభించారు. నూరు మీటర్ల వెఎస్సార్ కాంగ్రెస్ జెండాతో జొన్నలగర్వు నుండి శివదేవుని చిక్కాల, బల్లిపాడు, దగ్గులూరు, లంకలకోడేరు, భగ్గేశ్వరం, పూలపల్లి మీదుగా ర్యాలీ పాలకొల్లు చేరింది. ఎన్నికల ప్రచార యాత్రను పాలకొల్లులో నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రారంభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ఈ పాదయాత్రలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు, ఆకెన వీరాస్వామి, మైఖేల్‌రాజు, నడపన గోవిందరాజులు, గుబ్బల వేణు, పిఆర్‌కె మూర్తి, జి జోషి, యడ్ల తాతాజీ, శ్రీనివాస్, అన్నపూర్ణ, మద్దా చంద్రకళ, సీతామహలక్ష్మి నాయకత్వం వహించారు.

ఎస్పీ హరికృష్ణ
english title: 
o

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles