కాకినాడ, జనవరి 25: జవహర్‌లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం-కాకినాడ (జెఎన్‌టియుకె) చతుర్థ స్నాతకోత్సవాన్ని మార్చిలో నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో స్నాతకోత్సవాన్ని నిర్వహించాలని ముందుగా భావించినప్పటికీ, ఈ సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలన్న యోచనతో వాయిదా వేశారు. వర్సిటీ ఏర్పడి ఐదు సంవత్సరాలు కాగా ఇంతవరకు మూడు స్నాతకోత్సవాలను నిర్వహించారు. మార్చిలో జరిగే 4వ స్నాతకోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నట్టు వర్సిటీ వీసీ ఆచార్య జి తులసీరాందాస్ తెలియజేశారు. ఇటీవలి కాలంలో జెఎన్‌టియుకె గణనీయమైన పురోగతి సాధించింది. పరిశోధనలకు విశ్వ విద్యాలయం పెద్దపీట వేసింది. క్యాంపస్‌లో ప్రతిష్ఠాత్మక ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఐయుసి-టిఇ) కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వర్సిటీలో కోట్లాది రూపాయల వ్యయంతో భవనాల నిర్మాణం జరుగుతోంది. అత్యాధునిక లైబ్రరీని యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నారు. బి ఫార్మసీ కోర్స్ నిర్వహించేందుకు ఇటీవల నోడల్ సెంటర్‌గా జెఎన్‌టియుకె ఎంపికైంది. వర్సిటీలో ఇంతవరకు వివిధ రంగాల్లో నిష్ణాతులైన 38మందికి పిహెచ్‌డిలను ప్రదానం చేయగా వచ్చే స్నాతకోత్సవంలో పలువురికి పట్టాలు ప్రదానం చేయనున్నారు. ప్రపంచీకరణ ప్రభావంతో ఆధునిక కోర్సుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠ్యప్రణాళికలను వర్సిటీ రూపొందించింది. ఇదిలావుండగా గుంటూరు జిల్లా నరసారావుపేటలో జెఎన్‌టియుకె క్యాంపస్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సెంటర్ కార్యకలాపాలు వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభం కానున్నాయి. విజయనగరంలోని క్యాంపస్ సెంటర్‌ను అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలలో జెఎన్‌టియుకె కళాశాలలు ఏర్పాటు చేసేందుకు వర్సిటీ చర్యలు చేపట్టినట్టు వైస్ ఛాన్సలర్ ఆచార్య తులసీరాందాస్ తెలియజేశారు.
జవహర్‌లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం-కాకినాడ (జెఎన్‌టియుకె) చతుర్థ స్నాతకోత్సవాన్ని మార్చిలో
english title:
m
Date:
Sunday, January 26, 2014