Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎస్పీ శివశంకర్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్

$
0
0

కాకినాడ సిటీ, జనవరి 25: జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ శివశంకర్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం శనివారం ప్రకటించిన అత్యున్నత పురస్కారాల జాబితాలో జిల్లా ఎస్పీ శివశంకర్ రెడ్డికి స్థానం లభించింది. ఇండియన్ పోలీస్ మెడల్ ఎస్పీ శివశంకర్ రెడ్డి అందుకోనున్నారనే విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది శనివారం రాత్రి ఎస్పీ కార్యాలయ ఆవరణలో స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. 2012లో జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన సౌమ్యుడిగా మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా అవినీతికి పాల్పడుతున్న పలువురు పోలీస్ అధికార్లుపై ఆయన కఠిన చర్యలు తీసుకోవడంతో పోలీస్ శాఖకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. జిల్లాలో ఆదివారం జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాల నిర్వహణపై ఆయన పోలీస్ అధికారులతో శనివారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఇండియన్ పోలీస్ మెడల్ అందుకునేందుకు ఆదివారం ఆయన హైదరాబాద్‌కు వెళ్ళాల్సి ఉండగా ఆయన వెళ్ళేది లేనిది అధికారులు స్పష్టం చేయలేదు.
ప్రపంచ భువనంలో భారత్ పూజగది
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, జనవరి 25: ప్రపంచమంతా ఒక భవనమయితే, అందులో పూజ గది భారతదేశమని భారతీయం సత్యవాణి అన్నారు. పూజ గదిలో మాలిన్యం చేరుతోందని, ఇప్పుడా మాలిన్యాన్ని తొలగించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. శనివారం రాజమండ్రిలోని చెరుకూరి సుబ్బారావు, గనె్నమ్మ ఫంక్షన్‌హాలులో జరిగిన రోటరీ క్లబ్ విజయోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ పూషా అధ్యక్షతవహించారు. ఇతరులకు సేవ చేయటం ద్వారా తరించే విధానాన్ని భగవంతుడు సృష్టిలో ఏర్పాటుచేసాడని సత్యవాణి అన్నారు. ప్రతి వ్యక్తి పాత్ర పోషణ ద్వారా చరిత్రలో నిలిచిపోతారన్నారు. భారతదేశం నుండి పోలియో మహమ్మారిని తరిమికొట్టడంలో రోటరీ క్లబ్ చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. సమాజం కోసం మనం-ఇదీ మన స్వరం అనే రోటరీ క్లబ్ విధానం అదర్శనీయమన్నారు. సమాజంలో డబ్బు సంపాదించాలనే ధోరణి బాగా పెరిగిపోతోందన్నారు. పెంచుకుంటూ పోతే అది డబ్బని, పంచుకుంటూ పోతే అది సంపదన్నారు. జ్ఞానమయినా, సంపదయినా పది మందికీ పంచితేనే దానికి పరమార్ధం ఉంటుందన్నారు. మనం ఏం చేస్తే ఇతరులు బాధపడతారో, దానిని చేయకుండా ఉండాలని సూచించారు. భారతదేశం వంటి పుణ్యభూమిలో పుట్టిన మనం ఇపుడు విలువలు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. సమాజంలో విలువలు తగ్గినపుడల్లా, ఎవరో ఒక మహానుభావుడు పుట్టి దేశాన్ని సరయిన దారిలో పెడుతున్నారన్నారు. భారతదేశానికి స్ర్తి వెనె్నముకని సత్యవాణి చెప్పారు. దేశం ఇంకా చెడిపోకుండా ఉండటానికి భారత స్ర్తి కారమన్నారు. పురుషులను బేలన్స్ చేయగల శక్తి భారత స్ర్తికి మాత్రమే ఉందన్నారు. పుట్టిన బిడ్డకు అమ్మ ఒడే మొదటి బడి అని, అలాంటి తల్లి ఒడి ఇపుడు సరిగా లేదన్నారు. అమ్మ ఒడి టివి సీరియళ్ల ముందు చతికిలబడితే, తండ్రి సంపాదనలో, రాజకీయాల్లో తీరిక లేకుండా గడుపుతున్నాడన్నారు. దాంతో యువత క్లబ్బులు, పబ్బుల్లో గడుపుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో వచ్చి దేశాన్ని రక్షిస్తారని అనుకోకుండా, ఈ దేశం నాది అనుకోవాలని సత్యవాణి పిలుపునిచ్చారు. 3లేవండి..మేల్కొనండి2 అనే పిలుపుతో దేశాన్ని కాపాడుకోవాలని, దేశాన్ని జగద్గురు స్థానంలో నిలపాలన్నారు. పిల్లలకు చిన్ననాటి నుండే నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను నేర్పిస్తే ఈ దేశానికి యువశక్తి అద్భుతమైన ఆస్తిగా తయారవుతుందన్నారు. మాతృభాషను గౌరవించాలని, ఇంగ్లీషును కళ్లకు పెట్టుకునే కాటుకలా వాడుకోవాలే తప్ప, ఒళ్లంతా రాసుకోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సిబిఐ పూర్వ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, వివిధ జిల్లాలకు చెందిన రోటరీ క్లబ్బులకు చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీప్రకాష్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్ధులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

సూక్ష్మచిత్రకారుని చేతిలో రూపుదిద్దుకున్న
రాకెట్ నమూనాలు
మండపేట, జనవరి 25: గణతంత్ర వేడుకలు పురస్కరించుకుని స్థానిక స్వర్ణకారుడు, సూక్ష్మ చిత్రకారుడు దొంతంశెట్టి బాలనాగేశ్వరరావు ఘన విజయం సాధించిన ఆరు రాకెట్ నమూనాలను చిత్రీకరించాడు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు శనివారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ 2001 నుండి 2014 వరకు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుండి విజయవంతంగా ప్రయోగించిన ఆరు రాకెట్ నమూనాలను తయారు చేశానని తెలిపాడు. జిస్‌ఎల్‌వి డి1, జిఎల్‌ఎల్‌వి డిసి, జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌డి1, జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌డి4, పిఎస్‌ఎల్‌వి సి.25, జిఎస్‌ఎల్‌వి 2.5 రాకెట్లను అలాయ్ లోహంలో రాగిని కలిపి తయారు చేశానని చెప్పాడు. వాటిపై ఎపిజె అబ్దుల్ కలామ్ చిత్రాన్ని వెండి రేకుతో చిత్రీకరించానన్నాడు. హిమాలయ పర్వతాలు, జాతీయ జెండాలను వెండితో తయారు చేసినట్టు తెలిపాడు. వీటిని తయారు చేయడానికి రోజుకి రెండు గంటలు చొప్పున 45 రోజులు పట్టిందని బాలనాగేశ్వరరావు తెలిపాడు. ఈ సందర్భంగా సూక్ష్మ చిత్రకారుడు దొంతంశెట్టిని పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు.
నష్టపోయిన ఖాతాదార్లందరికీ న్యాయం చేయాలి:బండారు
రావులపాలెం, జనవరి 25: గోపాలపురం ఇండియన్ బ్యాంకులో వెలుగుచూసిన ఖాతాదారుల సొమ్ము గోల్‌మాల్ వ్యవహారంలో బాధితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బ్యాంకు అధికారులను కోరారు. శనివారం బ్యాంకుకు వచ్చిన ఆయన బ్యాంకు అధికారులు, ఖాతాదారులతో జరిగిన వ్యవహారానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిసిసిబి మాజీ డైరెక్టర్ ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ ఈ వ్యవహారం వెలుగులోనికి వచ్చాక ఖాతాదారులు తమతమ ఖాతాలను పరిశీలన చేసుకోగా సుమారు రూ.90లక్షలు నగదు, 90 కాసుల బంగారం గోల్‌మాల్ అయినట్లు తేలిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ నిధుల స్వాహా చేసింది బ్యాంకు ఉద్యోగి పట్టా శ్రీనివాస్ అయినందున ప్రతి బాధితునికి న్యాయం చేయవలసిన బాధ్యత బ్యాంకు అధికారులపై ఉందన్నారు. బాధితులు అధైర్యపడవలసిన అవసరం లేదని, అందరికీ న్యాయం జరిగేలా ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల రామకృష్ణ, మైగాపుల గురవయ్య, సర్పంచ్ ఆనె లక్ష్మి, కుడిపుడి వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ అథికారి నాగు, ఎఎంసి మాజీ ఛైర్మన్ ఎస్ జనార్దనరాజు, అల్లూరి సత్తిరాజు, తహసీల్దార్ వరదా సుబ్బారావు, సిఐ సిహెచ్‌వి రామారావు, ఎస్‌ఐ ఆర్ గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆధారాలు మాయం చేస్తున్నారు
గోపాలపురం ఇండియన్ బ్యాంకులో ఈ నెల 21న వెలుగుచూసిన ఖాతాదారుల సొమ్ము గోల్‌మాల్ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది ఆధారాలను మాయం చేస్తున్నారని పలువురు ఖాతాదారులు ఆరోపించారు. బ్యాంకులో తాత్కాలిక ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పట్టా శ్రీనివాసు సుమారు రూ.కోటి వరకూ నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలొచ్చిన సంగతి విదితమే. దీనిపై బ్యాంకు విజిలెన్స్ అధికారులు గత నాలుగు రోజులుగా విచారణ సాగిస్తుండగా, శనివారం బ్యాంకు వెనుక వైపు భారీగా బ్యాంకుకు సంబంధించిన కాగితాలను దహనం చేసినట్లు ఖాతాదారులు గుర్తించారు. సగం కాలిన కాగితాలు పరిశీలించగా వాటిలో కొన్ని పాస్ బుక్‌లు, దస్తావేజులు, ప్రామిసరీ నోటులు ఉండటంతో ఖాతాదారులలో అనుమానం ప్రారంభమైంది.
న్యాయస్థానానికి మహేంద్రవాడ పంచాయతీ బ్యాలెట్ పత్రాలు
అనపర్తి, జనవరి 25: అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు స్థానిక న్యాయస్థానానికి చేరాయి. గత జూలైలో పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు విషయంలో అధికారులు పక్షపాతం వహించారంటూ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన జి. దుర్గ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈమెతో పాటు మూడవ వార్డు సభ్యునిగా పోటీచేసిన సబ్బెళ్ల వెంకటరెడ్డి సైతం కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి సర్పంచ్, మూడవ వార్డు బ్యాలెట్ పేపర్లను న్యాయస్థానానికి చేర్చేందుకు అడ్వొకేట్ కమిషనర్లుగా ఎస్‌వివి సత్యనారాణరెడ్డి, టివివి రమణమూర్తిలను నియమించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు అనపర్తి ఎంపిడిఒ పి. విజయభాస్కర్ జిల్లా కేంద్రంలో భద్రపరిచిన బ్యాలెట్ పేపర్లను శుక్రవారం కార్యాలయానికి రప్పించారు. వీటిని అడ్వొకేట్ కమిషనర్లతో పాటు పిటిషనర్లు దుర్గ, వెంకటరెడ్డి, వారి తరఫు న్యాయవాది వి. సుందరరావు, సర్పంచ్ అన్నపూర్ణ, వార్డు సభ్యుడు వెలగల శ్రీనివాసరెడ్డిల సమక్షంలో పరిశీలింపచేసి అడ్వొకేట్ కమిషనర్లకు శనివారం అందజేశారు. పోలీసుల భద్రత నడుమ శనివారం కవర్లను న్యాయస్థానానికి చేర్చారు. ఇదిలావుండగా ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి అన్నపూర్ణకు 1896 ఓట్లు, దుర్గకు 1881 ఓట్లు లభించగా 13 ఓట్ల ఆధిక్యతతో అన్నపూర్ణ విజయం సాధించినట్టు, మూడవ వార్డులో శ్రీనివాసరెడ్డి 131 ఓట్లు, వెంకటరెడ్డి 128 ఓట్లు సాధించగా, మూడు ఓట్ల ఆధిక్యతతో శ్రీనివాసరెడ్డి ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. ఓటమి పొందినట్టు ప్రకటించడంతో తాము ఓట్ల లెక్కింపు సక్రమంగా జరగలేదని, తిరిగి ఓట్లు లెక్కించాలని అభ్యర్థించినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని వారి తరఫు న్యాయవాది సుందరరావు తెలిపారు.
ఎనిమిది కిలోల భారీ కోడి!
పెద్దాపురం, జనవరి 25: మండలంలోని గోరింట గ్రామంలో ఉన్న శ్రీ బండి సత్యన్నారాయణ పౌల్ట్రీ ఫారంలో సుమారు ఎనిమిది కిలోల బ్రాయిలర్ కోడి చూపరులను అబ్బుర పరుస్తోంది. సాధారణంగా బ్రాయిలర్ కోళ్లు మూడు నుండి నాలుగు కిలోల బరువు వరకు పెరుగుతాయి. అటువంటిది, ఈ కోడి ఎనిమిది కిలోల బరువు ఉండటం అందర్నీ అబ్బుర పరుస్తోంది. ఈ సందర్భంగా ఫారం యజమాని కుమారుడు గంగాధర్ విలేఖరులతో మాట్లాడుతూ కోళ్ల ఫారాలను జీవనాధారంగా ఎంచుకున్న రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపి, వాటికి నిర్ణీత సమయాలలో మేత పెడితే అధిక బరువు కల్గి, తద్వారా లాభాలు ఆర్జీంచవచ్చునన్నారు. కేవలం వంద రోజులు వయస్సు కలిగిన కోడి ఇంత బరువుతో ఉండటం తనకు తెలిసి ఇదే ప్రథమమని అన్నారు. ఈ భారీ కోడిని చూసేందుకు గ్రామస్థులు ఆసక్తిగా వస్తున్నారు.
30 మంది ఎస్సైలకు పోస్టిగులు
కాకినాడ సిటీ, జనవరి 25: ఇటీవల పోలీసు శాఖలో ఎస్సైలుగా నియామకం పొంది శిక్షణ పూర్తిచేసుకున్న 30 మందికి పోస్టింగులు ఇస్తూ ఏలూరు రేంజి డిఐజి విక్రమ్‌సింగ్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. వివరాలను జిల్లా ఎస్పీ ఎన్. శివశంకర్‌రెడ్డి రాత్రి విడుదల చేశారు. అమలాపురం తాలూకా ఎస్సైగా కె. సుధాకర్ ఆత్రేయపురం ఎస్సైగా ఎం ఏసుబాబు, నగరం ఎస్సైగా బి. సంపత్‌కుమార్, పిఠాపురం టౌన్ ఎస్సైగా ఎ. చైతన్యకుమార్, కోరంగి ఎస్సైగా ఎస్. రాము, రాజోలు ఎస్సైగా ఇ. అప్పన్న నియమితులయ్యారు. రామచంద్రపురం ఎస్సైగా ఎస్. రెహ్మాన్, తుని రూరల్ ఎస్సైగా ఎస్. శివప్రసాద్, అల్లవరం ఎస్సైగా బి. రాజేష్‌కుమార్, మలికిపురం ఎస్సైగా ఎస్ సిద్ధిఖ్, రావులపాలెం అదనపు ఎస్సైగా ఎస్. జాన్ బాషా, పిఠాపురం రూరల్ ఎస్సైగా ఆర్. మురళీమోహన్, సామర్లకోట అదనపు ఎస్సైగా కె. వెంకట నాగార్జున నియమితులయ్యారు. పి. గన్నవరం ఎస్సైగా బి. హరీష్‌కుమార్, అడ్డతీగల ఎస్సైగా టి. రామకృష్ణ, రాయవరం ఎస్సైగా కె. శ్రీనివాసరావు, రంగంపేట ఎస్సైగా ఆర్. అంకరావు, అనపర్తి అడిషనల్ ఎస్సైగా ఆర్. విజయకుమార్, సఖినేటిపల్లి ఎస్సైగా టి. శివకుమార్, ద్రాక్షారామ ఎస్సైగా కె. వంశీధర్, పామర్రు ఎస్సైగా ఎన్. హనుమంతు నియమితులయ్యారు. ముమ్మిడివరం ఎస్సైగా సిహెచ్. క్రిష్ణకుమార్, మండపేట రూరల్ ఎస్సైగా ఎల్. శ్రీను, తిమ్మాపురం ఎస్సైగా బి. వినయ్‌ప్రతాప్, ఉప్పలగుప్తం ఎస్సైగా పివిసిఎస్ నాయుడు, రంపచోడవరం ఎస్సైగా కె. విజయశేఖర్, గండేపల్లి ఎస్సైగా వి.సురేష్, గంగవరం ఎస్సైగా జి సుధాకరరావు, జడ్డంగి ఎస్సైగా ఎన్. లక్ష్మణబాబు, దేవీపట్నం ఎస్సైగా సిహెచ్ దుర్గారావు నియమితులయ్యారు.
పోలీసు స్టేషన్‌కు చేరిన పక్షి
రాయవరం, జనవరి 25: ఒక పక్షి రాయవరం పోలీసు స్టేషన్‌లో శనివారం హల్‌చల్ సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో అమ్ముతుండగా అదే గ్రామానికి చెందిన పక్షి ప్రేమికుడు టి సూర్యనారాయణరెడ్డి 400 రూపాయలకు కొని అటవీ శాఖ అధికారులకు అప్పగించాలని రాయవరం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ పక్షిని పోలీసులతో పాటు, పలువురు ఆసక్తిగా తిలకించారు. జిల్లా అటవీ అధికారి వెంకట సుబ్బారెడ్డికి విషయం తెలపగా ఆదివారం పక్షిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
స్ర్తీ నిధి రుణాలకూ సామాజిక తనిఖీలు
సామర్లకోట, జనవరి 25: ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో అమలులో వున్న సోషల్ ఆడిట్ విధానాన్ని త్వరలో స్రీ నిధి రుణాలు జారీ, నిధుల వినియోగంపై చేపట్టేందుకు స్రీ నిధి రాష్ట్ర చైర్మన్ నిర్ణయించినట్టు స్రీ నిధి డిప్యూటీ జనరల్ మేనేజర్ సిద్దు శ్రీనివాస్ వెల్లడించారు. శనివారం స్థానిక టిటిడిసిలో జిల్లా సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలపై చేపట్టాల్సిన మార్పులపై ఇందిరాక్రాంతి పథం ఏరియా కోఆర్డినేటర్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఐకెపి ప్రాజెక్టు మేనేజర్ ఎ కోమలి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న డిజిఎం జిల్లా సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను ఎసిలకు వివరించారు. గత రెండేళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.1500 కోట్లు మేర స్రీనిధి రుణాలు జారీచేశామన్నారు. అలాగే మరో రూ.400 కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నారు. రాష్టవ్య్రాప్తంగా తీసుకున్న రుణాలు 98 శాతం రికవరీ ఉన్నట్లు చెప్పారు. స్రీ నిధి రుణాలు సక్రమంగా అమలవుతున్నదీ, లేనిదీ సోషల్ ఆడిట్‌ల ద్వారా గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకు అందుబాటులో లేని గ్రామాల్లో బ్యాంకు కరస్పాండెంట్‌లు, గ్రామ సంఘాల ఆధ్వర్యంలో అమలుచేయనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ ఒక్కో గ్రామ సంఘానికి రూ.10 లక్షలు రుణం ఇస్తుండగా, ఇకనుండి పరిమితిని రూ.20 లక్షలకు పెంచామన్నారు. సమావేశంలో ఐకెపి జిల్లా మేనేజర్ కోమలి, స్రీ నిధి మేనేజర్లు సుజాత, ప్రసన్న, ఎజిఎం హేమంత్‌కుమార్, ఎసిలు కమలామిశ్ర, గణేష్, వల్లీ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలతో అశోక చక్రం
కడియం, జనవరి 25: రిపబ్లిక్ డేను పురస్కరించుకుని కడియం పల్ల వెంకన్న నర్సరీలో అశోకచక్రాన్ని ల్యాండ్ స్కేపింగ్ చేశారు. పలు రకాల బోర్డర్ ప్లాంట్‌లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ల్యాండ్ స్కేపింగ్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శౌర్యానికి, పరాక్రమానికి చిహ్నంగా జాతీయ జెండాపై ఉండే అశోకచక్రాన్ని ఈ ల్యాండ్ స్కేపింగ్‌లో అత్యంత మనోహరంగా వివిధ రకాల ప్లాంట్లతో అలంకరించారు. ఈ ల్యాండ్ స్కేపింగ్ 15రోజుల పాటు చూపరుల కోసం అలాగే ఉంచుతామని నర్సరీ రైతులు పల్ల సత్తిబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి తెలిపారు.
బియ్యపు గింజలపై జాతీయ గీతం!
బిక్కవోలు, జనవరి 25: పందలపాక వ్యాయామ ఉపాధ్యాయుడు లయన్ ద్వారంపూడి యువ రాజారెడ్డి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బియ్యపు గింజలపై జాతీయ గీతాన్ని రాష్ట్ర భాష తెలుగు, దేశభాష హిందీలలో సాధారణ మార్కర్‌ను ఉపయోగించి రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ సమైక్యతకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జనగణమన ఆలపించాలన్నారు. ఇదివరకు వందేమాతరం, శ్రీరామ నామాలు, సమైక్యాంధ్ర నినాదాలు బియ్యపు గింజలపై రాసి స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించానన్నారు. రాజారెడ్డిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొవ్వూరి అమ్మిరెడ్డి, అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కె సత్తిరెడ్డి, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ శివశంకర్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. రిపబ్లిక్ డే
english title: 
sp

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>