Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రేపు సాగర్‌కు ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జి రాక

$
0
0

నల్లగొండ లీగల్, జనవరి 27: ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జి విజయ్‌కుమార్ రేపు జిల్లాలోని సాగర్ ప్రాజెక్టు సందర్శనకు రానున్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా బుధవారం సాగర్‌ను సందర్శించి గురువారం శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి రాత్రి అక్కడే బస చేసి 31న డిండికి చేరుకుని హైద్రాబాద్‌కు వెళ్లనున్నారు.

పానగల్‌లో లీగల్ ఎయిడ్ క్లీనిక్ ప్రారంభం
నల్లగొండ లీగల్, జనవరి 27: పానగల్‌లోని అంగన్‌వాడి సెంటర్‌లో లీగల్ ఎయిడ్ క్లీనిక్‌ను నల్లగొండ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి బి.జ్ఞానేశ్వర్‌రావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎన్.్భమార్జున్‌రెడ్డి, చంద్రశేఖర్‌రాజు, వి.ముదిరాజ్, న్యాయ కళాశాల విద్యార్థులు, అంగన్‌వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌లో వినతులు వెల్లువ
కలెక్టరేట్, జనవరి 27: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్‌డేలో భాగంగా సోమవారం ఇన్‌చార్జి కలెక్టర్ హరిజవహర్‌లాల్‌కు జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ వినతులు అందజేశారు. జిల్లా కేంద్రం ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతిపై రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ వినతి అందించిన వారిలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గోలి సైదులు నాయకులు ఆంజనేయులు ఉన్నారు. పానగల్ బైపాస్ 12వ వార్డులో రోడ్లు సరిగ్గా లేవని విద్యుత్ దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నామని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు పుష్ప తదితరులు వినతి పత్రం అంజేశారు. పి ఎపల్లి మండలం నంబాపురం గ్రామపంచాయతీలో సిసిరోడ్లు నిర్మాణంలో అక్రమాలు జరిగాయాని విచారణ జరుపాలని కోరుతూ సర్పంచ్ గ్యార ప్రియాంక, ఉప సర్పంచ్ చెన్న ఆధ్వర్యంలో గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.

గ్రామ రెవెన్యూ సదస్సులకు యంత్రాంగం సన్నద్ధం కావాలి
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరిజవహర్‌లాల్
కలెక్టరేట్, జనవరి 27: ఫిబ్రవరి 10నుండి 25వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం తహశీల్దార్లు, వి ఆర్‌వొలు, ఆర్డీవొలు, ఇతర రెవెన్యూ అధికారులతో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరిజవహర్‌లాల్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల వారిగా ఎస్సీ, ఎస్టీ ఇతర బలహీన వర్గాల కాలనీల్లో మాత్రమే రెవెన్యూ సదస్సులు నిర్వమించేలా షెడ్యూల్‌లు రూపొందించాలని ఆదేశించారు. తహశీల్దార్ల అధ్యక్షతన మాత్రమే గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించి సర్పంచ్‌లను భాగస్వాములను చేయాలన్నారు. ఈ నెల 31లోగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి రెవెన్యూ సదస్సులపై వివరించి వారి అభిప్రాయలు స్వీకరించాలని ఆదేశించారు. గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో పరిష్కరించని సమస్యలపై సభలో చదివి వినిపించాలన్నారు. గ్రామాలలో స్మశాన వాటికలకు ప్రభుత్వ భూమిని కేటాయించాలని లేనిచో కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించాలని ఆయన తహశీల్దార్‌లకు సూచించారు. వచ్చే నెల 4న హైద్రాబాద్‌లో రెవెన్యూ సదస్సులపై జాయింట్ కలెక్టర్లతో జరిగే సమావేశానికి సమగ్ర సమాచారం సిద్దం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ కలెక్టర్ ప్రసాదరావు, చంద్రవదన్‌రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన నిరుపేదలకు గ్యాస్ కనెక్షన్‌లు ఇవ్వాలి
కలెక్టరేట్, జనవరి 27: అర్హులైన నిరుపేదలకు గ్యాస్ కనెక్షన్‌లు ఇవ్వాలని సోమవారం ఎంపిడివో కార్యాలయం వద్ద వెలుగుపల్లి, రసూల్‌గూడెం గ్రామాలకు చెందిన గ్రామస్తులు బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బిజెపి అసెంబ్లీ కన్వీనర్ రావుల శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన పేదలందరికి గ్యాస్ కనెక్షన్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోతెపాక లింగస్వామి, తండు బుచ్చయ్య, గుండెబోయిన వెంకన్న, సత్తమ్మ, సుధాకర్, అంజమ్మ, జానయ్య, భద్రి, సువర్ణ, సైదులు, సువార్త, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జి విజయ్‌కుమార్ రేపు జిల్లాలోని సాగర్ ప్రాజెక్టు సందర్శనకు రానున్నారు.
english title: 
r

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>