నల్లగొండ లీగల్, జనవరి 27: విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించి వారి హక్కులను న్యాయస్థానాల ద్వారా నిలబెట్టడం కొరకే న్యాయ విజ్ఞాన శిభిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి, నల్లగొండ సీనియర్ సివిల్ జడ్జి బి.జ్ఞానేశ్వర్‌రావు అన్నారు. సోమవారం పానగల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన శిభిరంలో ఆయన ప్రసంగిస్తూ విద్యార్థులు చట్టాలపై ప్రాథమిక అవగాహన పెంపొందించుకుని తమ కుటుంబ సభ్యులకు, పొరుగు వారికి న్యాయ సహాయం అందించేందుకు తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, న్యాయవాదులు ఎన్.్భమార్జున్‌రెడ్డి, వి.ముదిరాజ్, చంద్రశేఖర్‌రాజు, సైదులు, యాదయ్య, న్యాయ విద్యార్థిని ప్రమీల, పాఠశాల సిబ్బంది శ్రీనివాసరావు, హేమలత, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ చెనగోని యాదగిరి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి జ్ఞానేశ్వర్‌రావు
english title:
chatta
Date:
Tuesday, January 28, 2014