నందిపేట, జనవరి 27: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఒప్పుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టిడిపి నేత చంద్రబాబునాయుడు, వైఎస్.జగన్‌లు అడ్డుపడుతున్నారని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలో సోమవారం గుండెగుండెలో తెలంగాణ జెండా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పెట్రోల్‌బంక్ నుండి నందిపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గంగారెడ్డి మాట్లాడుతూ, 13 సంవత్సరాల నుండి కెసిఆర్ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ తెలంగాణ కోసం పోరాడుతోందని, 1200 మంది యువకులు ఆత్మబలిదానాలు కూడా చేసుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాల ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని కేంద్రం తెలంగాణ బిల్లుపై అభిప్రాయం తెలపాలని అసెంబ్లీకి పంపితే, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ నక్కజిత్తులు వేస్తూ వెనక్కి పంపించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్మూర్ టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో గత 30 ఏళ్లుగా అత్త అన్నపూర్ణ, అల్లుడు సురేష్‌రెడ్డి పరిపాలిస్తూ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఎర్రజొన్న రైతుల బకాయిలు, ముంపు గ్రామాల నష్టపరిహారం ఇప్పటికీ ఇప్పించలేరని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఈగ గంగారెడ్డి టిఆర్‌ఎస్ జెండాను జెఎసి టెంటు వద్ద ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాజేశ్వర్, మండల అధ్యక్షుడు భూమేష్, రాష్ట్ర బిసి సెల్ నాయకుడు రాజశేఖర్, సర్పంచ్ షాకీర్, బాలగంగాధర్, సయ్యద్, ఉస్నో తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఒప్పుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టిడిపి నేత
english title:
t
Date:
Tuesday, January 28, 2014