Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఉపాధిహామీలో అవినీతి కంపు

$
0
0

మహబూబ్‌నగర్, జనవరి 28: జిల్లాలో వలసల నివారణకు, పేదరిక నిర్మూలన కోసం సొంత గ్రామాలలోనే పనులు చేసుకుంటూ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకం మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం అవినీతి పరులకు, దళారులకు ఉపాధిని ఇచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూలీలకు దక్కాల్సిన డబ్బు దళారుల జేబుల్లోకి వెళ్లడంతో ఉపాధిహామీ పథకం అమలులో అవినీతిలో రాష్ట్రంలోనే జిల్లా 5వ స్థానాన్ని సంపాదించడం దురదృష్టకరం. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం దళారులకు ఉపాధిగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఎపిఓలు చేసిన తప్పిదాల కారణంగా ఉపాధిహామీ పథకానికి అవినీతి కంపు పట్టింది. జిల్లా వ్యాప్తంగా 2013-14 సంవత్సరంలో రూ. 216 కోట్లతో 3.17 లక్షల కుటుంబాలకు సంబంధించిన 5.75 లక్షల మంది కూలీలు ఉపాధిహామీ పనులు చేసినట్లు రికార్డులు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని ప్రారంభించిన మొదట్లో రెండు సంవత్సరాల పాటు జిల్లాలో జరిగిన పనులలో కోట్లాది రూపాయలు గల్లంతైనట్లు రికార్డులే చెబుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. 2014 అక్టోబర్‌లోపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉపాధిహామీ పథకం సామాజిక తనిఖీల్లో జిల్లా అవినీతిలో 6వ స్థానంలో నిలిచినట్లు సంబంధిత శాఖ మంత్రి వెల్లడించడం గమనార్హం. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా ఉపాధిహామీ పథకం ప్రారంభం నుండి ఇప్పటి వరకు దాదాపు రూ. 35 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు అనధికారికంగా బహిర్గతమవుతున్నప్పటికీ అధికారికంగా మాత్రం రూ. 25 కోట్లకు పైగానే అవినీతి జరిగినట్లు పలు జిల్లా సమావేశాలలో ఎంపి, ఎమ్మెల్యేలు అధికారులపై మండిపడ్డారు. కొందరు ఎంపిడిఓలు, ఎపిఓలు, టెక్నికల్ అసిసెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్‌లను సస్పెండ్ చేసినప్పటికినీ పూర్తి స్థాయలో ఈ చర్యలు మాత్రం తూతూమంత్రంగా కొనసాగాయి. అయితే రూ. 25 కోట్లకు పైగా అధికారికంగానే అవినీతి జరిగిందని రికార్డులు చెబుతుండగా, ఈ సొత్తును దళారుల నుండి రికవరీ చేయడానికి అధికారులు చట్టాలను ఉపయోగించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తుంది. కేవలం రూ. 3 కోట్లు మాత్రం రికవరీ అయినట్లు గత సంవత్సరం అక్టోబర్ చివరి వరకు లెక్కలు తేలినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా పండ్ల తోటల పెంపకంలో కూడా అవినీతి చోటు చేసుకుంది. కొన్ని మండలాల్లో కోటి రూపాయలకు పైగా అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. ఇందులో రాజకీయ నాయకుల అండదండలు అవినీతిపరులకు అండగా ఉండటంతో అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెలువడుతున్నాయి. 2012-13 సంవత్సరంలో జిల్లాలో పెద్దఎత్తున ఉపాధిహామీ పథకంలో అవినీతి చోటు చేసుకున్నట్లు, ఆ ఆర్థిక సంవత్సరమే దాదాపు రూ. 14 కోట్లకు పైగా ఉపాధిహామీ పథకం డబ్బు కూలీలకు చెందాల్సిందిపోయిది దళారుల జేబుల్లోకి వెళ్లినట్లు సామాజిక తనిఖీల్లో తేటతెల్లమైంది. ఏదిఏమైనా జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి అవినీతి కంపు తగిలింది.

వ్యక్తికి జీవిత ఖైదు
వనపర్తిటౌన్, జనవరి 28: వీపనగండ్ల మండలానికి చెందిన కొత్త నాగేశ్వర్‌రెడ్డి హత్యకేసులో గునమోని ఊషన్న(మంచాలకట్ల ఊషన్న)కు వనపర్తిలోని జిల్లా అదనపు కోర్టు న్యాయయూర్తి విజేందర్ మంగళవారం జీవిత ఖైదు తీర్పుచ్చిన్నట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వీపనగండ్ల మండలంకు చెందిన కొత్తకృష్ణారెడ్డి ఆయన అన్న కొత్త నాగేశ్వర్‌రెడ్డికి తేదీ 15.03.2011న క్రాప్‌లోన్ చెల్లించాలని రూ.40వేలు ఇవ్వగా తేదీ 17.03.2011 నుండి కనిపించడం లేదని దీంతో 21.03.2011న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అదే రోజు పాత సోళీపురం వీపనగండ్లలో కొత్తనాగేశ్వర్‌రెడ్డి మృతదేహం లభించినట్లు చెప్పారు. గునమోని ఊషన్న అలియాస్ మంచాలకట్ట ఊషన్న ఫిర్యాదుదారుని అన్న వెంట ఆ సమయంలో తిరుగాడినట్లు గ్రామస్థులు చెప్పగా అనుమానం వచ్చి అతనిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దర్యాప్తు అనంతరం నిందితుడు కొత్తనాగేశ్వర్‌రెడ్డిని చంపినట్లు అంగికరించాడని, ఊషన్న నుండి రూ.35వేలను రికవరి చేసినట్లు చెప్పారు. నిందితుడు ఊషన్నకు న్యాయమూర్తి జీవిత ఖైదుతో పాటు రూ.5వేలు జరిమానా విధించినట్లు, జరిమానా చెల్లించకుంటే మరో ఆరు నెలలు శిక్ష విధించినట్లు ఏపిపి చెప్పారు.
భార్య హత్యకేసులో పదేళ్ల శిక్ష
గద్వాలరూరల్, జనవరి 28: తాగుడుకు బానిసై వరకట్నం కోసం వేధించి భార్య ప్రాణాలు తీసిన భర్తకు పదేళ్లు జైలు శిక్ష, జరిమాన విదిస్తూ మూడవ అదనపు జిల్లా జడ్జి ప్రభాకర్ మంగళవారం తీర్పు చెప్పారు. అడిషనల్ పిపి వెంకటేశ్వర్లు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్వ మండలం కన్వనూరు గ్రామానికి చెందిన హరిజన్ మెగిలన్నకు అదే గ్రామానికి చెందిన కురుపమ్మ(28)తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా వరకట్నం కింద రూ.20వేల నగదును కురుపమ్మ తండ్రి సందెపాగ గణేష్ ఇచ్చాడు. పెళ్లయిన సంవత్సరం నుంచి మొగిలన్న భార్యను తరచు అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తూ కొట్టేవాడు. ఈ సందర్భంగా రెండు మూడు సార్లు గ్రామంలో పంచాయతీ నిర్వహించి అదనంగా రూ.30వేలు మొగిలన్నకు కురుపమ్మ తండ్రి ఇచ్చాడు. తాగుడుకు బానిసైన మొగిలన్న తరచు భార్యను కొడుతుండడంతో గాయపడి 14.01.2013న మృతి చెందింది. మృతురాలి తండ్రి గణేష్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి కేసు నమోదు చేశారు. గద్వాల ఎస్‌డిపిఓ గోవింద్‌రెడ్డి కేసు విచారణ జరిపారు. ఈ కేసు విచారించిన మూడవ అదనపు జిల్లా జడ్జి నిందితుడు మొగిలన్నపై నేరం రుజువుకావడంతో పదేళ్ల కఠినకారాగారశిక్షతో పాటు రూ.3వేలు జరిమాన, అదనపు కట్నం కోసం వేధించినందుకు మరో ఆరు సంవత్సరాల కఠినకారాగార శిక్షతో పాటు వెయ్యి రూపాయలు అదనంగా జరిమాన చెల్లించాలని, జరిమానా చెల్లించని పక్షంలో మరో 20 నెలలు సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కాగా ఈ శిక్షలన్ని ఏకకాలంలో అమలు జరపాలని న్యాయమూర్తి ప్రభాకర్ తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా మొత్తం 13 మంది సాక్షులను విచారించారు.

ఎబివిపి ధర్నా
మహబూబ్‌నగర్, జనవరి 28: ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల నుండి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలకు సంబంధించి తెలుగు, హిందీ, కెమిస్ట్రీ, గణితం, అన్ని డిపార్ట్‌మెంట్లకు సంబంధించి ఇప్పటి వరకు కళాశాల ప్రారంభమైనప్పటి నుండి భర్తీ చేయకపోవడం గమనార్హమని అన్నారు. వలసలకు నిలయమైన జిల్లా పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటున్నారని, ప్రతిసారి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విన్నవించిన్నప్పటికినీ పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ సంవత్సరం అకాడమిక్ పూర్తవుతున్నప్పటికినీ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నందునే ఇంటర్మీడియట్, డిగ్రీలో ఉత్తీర్ణత శాతం తగ్గుతుందని, జిల్లాలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం ప్రతి ఏటా పెరుగుతున్నప్పటికినీ ఇంటర్మీడియట్‌కు వచ్చేసరికి ఉత్తీర్ణత శాతం తగ్గడంతో లెక్చరర్ పోస్టుల ఖాళీలే ముఖ్య కారణమని ఆయన అన్నారు.

టెలీ మెడిసిన్ సేవలకు శ్రీకారం
* దేశంలోనే మొదటిసారిగా..
* అపోలో వైద్యశాల ఆధ్వర్యంలో
* మీసేవ సెంటర్‌లో సేవలు ప్రారంభం
బాలానగర్, జనవరి 28: దేశంలోనే మొట్టమొదటిసారిగా అపోలో ఆసుపత్రి సహకారంతో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో టెలీ హెల్త్ సర్వీసెస్ (టెలీ మెడిసిన్ సహాయంతో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ) ప్రారంభమైంది. దీనిని జిల్లా స్పెషల్ కలెక్టర్ విజయరామారావు మంగళవారం ప్రారంభించారు. తహశీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఉన్న మీసేవ కేంద్రంలో ఈ టెలీ హెల్త్ సర్వీసెస్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలంతోపాటు డబ్బు వృథా కాకుండా ఆన్‌లైన్‌లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం ఈ సర్వీసెస్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరు వినియోగించుకోవాలని ఆయన కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు దీని గురించి అవగాహన తక్కువ ఉండడం వల్ల మీసేవ కేంద్రాల యజమానులు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఆరోగ్య సమస్య కోసం ప్రతి ఒక్కరు హైదరాబాద్ వెళ్లడం వల్ల డబ్బు వృథా అవుతోందని అన్నారు. అయతే ఆన్‌లైన్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ టెలీ హెల్త్ సర్వీసుల వల్ల ఆ అవసరం లేకుండా మీసేవ కేంద్రంలోనే కేవలం వంద రూపాయల ఫీజుతో ఆసుపత్రుల డాక్టర్లతో ముఖాముఖిగా మాట్లాడి అందుకు కావాల్సిన చికిత్సను పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషాలాఫీసర్ నాగమ్మ, తహశీల్దార్ లింబ్యానాయక్, ఎంపిడివో అనంతరెడ్డి, ఆన్‌లైన్ సర్వీసెస్ ఇన్‌చార్జి ఎస్‌ఎస్‌రావు, సర్పంచ్ శాంతిదాస్‌రాం నాయక్, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

విద్యుత్ కోతలను ఎత్తివేయకపోతే ఆమరణ దీక్ష
* బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి హెచ్చరిక
ఆమనగల్లు, జనవరి 28: జిల్లా వ్యాప్తంగా విద్యుత్ కోతలు, లోఓల్టేజి సమస్యలు తీర్చకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజు ఆచారి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం రైతులతో కలిసి ఆమనగల్లు విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు ఆమనగల్లు పట్టణంలో రైతులు, బిజెపి కార్యర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ ఎడిఇ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రాన్ని అదోగతిపాలు చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం తెలంగాణను అడ్డుకోవడానికే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడని, వెయ్యి మంది కిరణ్‌లు వచ్చినా తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడం ఎవరితరం కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డివిరుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లు సమృద్ధిగా వర్షాలు కురియకపోవడంతో పంటలు పండక కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొని ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. 2009 ఎన్నికలకు ముందు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించిందని అన్నారు.
బిజెపి పాలిత రాష్ట్రాలలో 24 గంటల పాటు విద్యుత్ అందిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వ్యవసాయానికి సరఫరా చేయాల్సిన విద్యుత్‌ను పరిశ్రమలకు వదులుతున్నారని ఆరోపించారు. బిజెపి మాత్రం ప్రజలు, రైతుల పక్షాన పోరాటం చేస్తుందని ఆయన అన్నారు.

ద్వేషాలు రెచ్చగొట్టేలా పాటలు ఉండరాదు
* కవులు, కళాకారులకు ప్రజాకవి గోరటి వెంకన్న పిలుపు
నాగర్‌కర్నూల్, జనవరి 28: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కవులు, కళాకారులు వచ్చే తెలంగాణ రాష్ట్రంలో ద్వేషాలు రెచ్చగొట్టేలా పాటలు ఉండరాదని, జీవితం నేర్పే పాటలు రావాలని ప్రజాకవి గోరటి వెంకన్న కవులు, కళాకారులకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సాయి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పుననిర్మాణం, మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో గోరటి వెంకన్నతోపాటు బ్లాక్ పాయింట్ సింగర్, కవి జయరాజు, గిద్దె రాంనర్సయ్య, ప్రముఖ కవులు సాయిచంద్, జంగిరెడ్డి, జల్లికృష్ణ, శివనాగులు, ఉదయ్, డప్పులక్ష్మణలపాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర ఎంతో కీలకమైందని, రాజకీయాలకు అతీతంగా ప్రజలను చైతన్యపర్చడంతోపాటు రాజకీయ పార్టీలను ఏకం చేసిన ఘనత కూడా కవులు, కళాకారులదేనని అన్నారు.
అద్భుత రాష్ట్రం ఏర్పడే వరకు పాటలు ఆగవు: కవి జయరాజు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత అద్భుతరాష్ట్రం ఏర్పడే వరకు తెలంగాణ పాటలు ఆగవని బ్లాక్ పాయింట్ సింగర్, కవి జయరాజు అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత సాంస్కృతిక విప్లవం రావాలని బాబాసాహేబ్ బిఆర్ అంబేద్కర్ అన్నారని, ఆయన మాటలను స్మరించుకుంటూ తెలంగాణ వచ్చిన తరువాత కూడా సాంస్కృతిక విప్లవం రావాలని, పేదల కన్నీళ్లు, కష్టాలు తీర్చేందుకు కవులు, కళాకారులు ఇంకా పాడాలన్నారు. కళాకారులకు ఎవ్వరూ సాటిరానని, చరిత్రలో పదికాలాల పాటు పాట నిలబడేలా చూడాలన్నారు. మాజీ జడ్పీచైర్నన్ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి నెలాఖరులోగా తెలంగఆణ రాష్ట్రం ఏర్పడుతుందని, రాష్ట్ర పునర్మిర్మాణంలో అందరి బాధ్యత ఉందన్నారు.

* జిల్లాలో రూ. 25 కోట్లకు పైగా స్వాహా * రికవరీలో వెనకంజ వేస్తున్న అధికారులు
english title: 
recovery

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>