జిన్నారం, జనవరి 28: మండల కేంద్రమైన జిన్నారంలోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా బోధనపై విద్యార్ధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.గత సంవత్సరం పాఠశాలలో ఫలితాలు జిల్లాలోనే తక్కువగా ఎందుకు వచ్చాయని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నా సెలబస్ ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. సమయం తక్కువగా వున్నందున సిలబస్ పూర్తి స్ధాయిలో పూర్తి చేయాలని సాయంత్రం ప్రత్యేక తరగతులను తీసుకోవాలని ఉపాద్యాయులకు సూచించారు. విద్యా భోధనలో ఉపాద్యాయులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం స్థానికంగా గిరిజన గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్ధులకు ఇస్తున్న మెను, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు.
మండల కేంద్రమైన జిన్నారంలోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా
english title:
smitha sabharwal
Date:
Wednesday, January 29, 2014