Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

భవిష్య కాలం

$
0
0

భావన రామకృష్ణ - కమలాపురం (శ్రీకాకుళం)
ప్ర:స్థాయికి మించిన అప్పులు ఎలా తీరాలి?
సమా: ‘అర్థశక్తి సమం వ్యయం - ఆత్మశక్తి సమం కోపం’- అని పెద్దలు చెప్పిన మంచి మాట- స్థాయిని మించి అప్పులు చేయటం పెద్ద పొరపాటు. నివారణగా మూడు మంగళవారాలు ఋణవిమోచన పాశుపతరుద్రాభిషేకం జరిపించండి. లేదా పదకొండు మంగళవారాలు ఋణవిమోచన అంగారకవ్రతం చేయండి- మార్పు వస్తుంది.
ఆర్.గీత- జమ్మల మడుగు (కడప)
ప్ర:సంతాన యోగం
సమా: సంతానం విషయంలో దంపతుల ఇరువురి జాతకాలు పరిశీలించాలి. ఏ ఒక్కరి వల్ల ఏమీ చెప్పలేము. ఈ విషయం వేర్వేరు సందర్భాలలో చాలాసార్లు స్పష్టం చేయటం జరిగింది. సంపూర్ణ ఆరోగ్యానికి తులసీవ్రతం చేయండి- తులసీ తీర్థం గ్రహించండి (సూర్యోదయ్పార్వం ప్రభాత వేళలో).
కాట్రగడ్డ వెంకటరావు - పామర్రు (కృష్ణా)
ప్ర: స్వంత ఇల్లు యోగం?
సమా: 2015 మధ్యభాగంలో ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.
తాళ్ళ లక్ష్మీనారాయణ - నిజామాబాద్
ప్ర: సాహిత్యంలో పైకి వస్తానా?
సమా: అనుకూలంగానే ఉంది. పట్టుదలగా ప్రయత్నించండి!
ఎ.కె.కుమారి -సరూర్‌నగర్ (హై)
ప్ర: వివాహం - ఏ దిశ?
సమా: మీ జాతకంలో శని కుజుల దోషం గోచరిస్తోంది- ‘వర పాశుపత రుద్రాభిషేకం’ (మూడు శని, మంగళ వారాలు) జరిపించండి- తూర్పు ఆగ్నేయం కాని-నైఋతి దక్షిణం నుండి కాని వరలాభం-
కె.నాగరాజు -పొన్నూరు (గుంటూరు)
ప్ర: లాభాలు బాగానే ఉన్నాయి. ఖర్చులకు సరిపోవటంలేదు.
సమా: పొదుపు చర్యలు (ఆస్టిరిటీమెషర్స్) పాటించండి. బండి దారికి వస్తుంది.
జి.శ్రీనివాసరావు - విజయనగరం
ప్ర:కుమారుని వివాహం - జాతక దోషాలు - నివారణ
సమా: జాతకంలో శని రాహువులు వివాహానికి దోష కారకులు- కన్యా పాశుపత రుద్రాభిషేకాలు శని, గురువారాలలో జరిపించండి.
మువ్వా దొరబాబు - చెరుకుపల్లి (గుంటూరు)
ప్ర:కష్టపడి పనిచేసినా జీతం ఇవ్వరు- ఏం చేయాలి?
సమా: కొందరి జాతకంలో రవి, గురువుల దోషంవల్ల అలా జరుగుతుంది. ఆదివారం ఆంజనేయస్వామికి ఐదు అరటిపండ్లు సమర్పించం. గురువారం గోవుకు దాణా పెట్టండి- నాగ సింధరం బొట్టు పెట్టుకోండి.
కె.కోటేశ్వరరావు - కావలి
ప్ర:ఆరోగ్యం
సమా: మీ జాతక రీత్యా నడుము- మోకాళ్లు బలహీన స్థానాలు- జాగ్రత్త అవసరం. మిగతా భాగాలలో అనారోగ్యం ఉంటే త్వరలోనే బాగుపడుతుంది.
పి.వి.శరత్ చంద్ర - గూటాల (ప.గో.జిల్లా)
ప్ర:ఉద్యోగం?
సమా: ఇంకా ఆలస్యం ఉంది. అయినా యోగం బాగానే ఉంది. ఓపిక పట్టండి
శ్రీరాం చంద్రశేఖర్ -సామర్లకోట
ప్ర:వివాహం?
సమా: ఈ సంవత్సరమే (2014) ఆగ్నేయ దిశ అక్షరాలు ఎస్ - కె - బి - వి - ఎన్- అయితే గ్రహచార దోష నివారణకు నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం (మూడు వారాలు) ఆదివారాలు జరిపించాలి.
కె.సతీశ్‌బాబు - కడప
ప్ర:వివాహం?
సమా: మీ వివాహానికి మీ వారి నుండే ఆలస్యం ఉంది. బహుశా వచ్చిన సంబంధాలు వారికి నచ్చటం లేదేమో? ఉద్యోగం ఆలస్యం-
తిరునవ్వేలి హరనాధ్ - కావలి
ప్ర: దాంపత్యం - సంతాన ప్రేమ
సమా: 2014లో ఆగస్టు తరువాత కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది.

ఎ.దేవరాజ్ - కామారెడ్డి
ప్ర:వివాహం - మంచి రోజులు
సమా: 2014 జూలై తరువాత మంచి మార్పు వస్తుంది. వివాహానికీ అనుకూలం.
*

పేరు : ......................................................................................................................................................................................................................... .
చిరునామా : .......................................................................................................................................................... ............................................. ....................................................................................................................................................................................................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) : .............................................
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ : ......................................
ప్రశ్న : .....................................................................................................................................
........................................................................................................................................
.......................................................................................................................................
.......................................................................................................................................
సంతకం : ...............................................................

(ఒక కూపన్‌పై ఒక ప్రశ్న మాత్రమే పంపాలి)

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి. బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్), హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

భావన రామకృష్ణ - కమలాపురం (శ్రీకాకుళం)
english title: 
bhavishya kalam
author: 
‘దివ్యజ్ఞానవిభూషణ’ ఉమాపతి. బి.శర్మ

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>