
కవచం
కవిత్వం
-డా.యిమ్మిడిశెట్టి చక్రపాణి
వెల: రూ.75
ప్రతులకు: రచయిత
ఎఫ్ 1, శ్రీకన్య అపార్ట్‌మెంట్
నెహ్రూచౌక్,
అనకాపల్లి - 531 001
98493 31554
ఇదివరకటి రోజుల్లో కవిత్వాన్ని గురించి ఆలోచిస్తే, ఆత్మాశ్రయం, వస్త్యాశ్రయం అనే రెండు విభాగాలు స్పష్టంగా కనిపించేవి. చాలా సందర్భాల్లో వాదోపవాదాలు కూడా జరిగేవి. కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో సమాజమే పతన విలువలకు జారిపోతున్నప్పుడు పరిస్థితి మారిపోయింది. పూర్వం మనిషి పట్టించుకోని కష్టాలన్నీ, సరాసరి ఇంట్లోకి పడక గదుల్లోకి, మనస్సుల్లోకి ప్రవేశించి, అతలాకుతలం చేస్తున్నై. ఇప్పుడు మనిషిగా ఏం చెప్పినా, అది సమాజానికి సంబంధించిందే అవుతుంది. అందుకే కవులు కూడా వైయక్తిక భావాలూ రాస్తున్నారు. సామాజిక భావాలూ రాస్తున్నారు. ఇమ్మిడిశెట్టి చక్రపాణి ‘కవచం’ కవితా సంపుటి ఇలాంటి సమ్మేళనానికి నిదర్శనంగా ఉంది. ఇప్పటి సాంస్కృతిక పతనమూ, సాంకేతిక విజృంభణమూ, జీవిత వౌలిక ఆనందాన్ని దాటిపోయి, అవసరమైన వాటినే అవసరమైన వాటిగా భ్రమలు కలుగజేసి, వాటి నుండి తప్పించుకోలేని పరిస్థితుల్ని పెంచుతున్నై. అందువల్లనే అందరూ, తమ చిన్ననాటి వాతావరణాన్నీ, గ్రామీణతనీ ప్రాకృతిక వైభవాన్నీ తలచుకుంటున్నారు. కవులైతే, ఇది పదేపదే వ్యక్తం చేసే కవితా సామాగ్రి అయింది. ఈ విషయాన్ని చక్రపాణి రాసిన ‘్భగ్య సీమలు’ కవితలో గమనించగలం. ఇది తన చిన్ననాటి పల్లెటూరును స్మరించి మార్పుకి ఆవేదన ప్రకటించే కవిత, తాననుభవించిన అచ్చమైన ఆనందాన్ని వెలువరించే భావాలు ఈ కవిత నిండా పరుచుకున్నై. మానవతనీ, ఆధునిక పతన సంస్కృతినీ, గ్రామీణ సౌభాగ్యాన్నీ, అనుభూతుల్నీ మేళవించి, ‘కవచం’ కవితా సంపుటి వెలువడింది.