ముషీరాబాద్, ఫిబ్రవరి 2: రైలు ప్రయాణంలో కోరుకున్న చోట కోరిన ఆహారం అందిస్తోంది ట్రావెల్ ఖానా. ఢిల్లీకి చెందిన పుష్పీందర్ సింగ్ నేతృత్వంలో ట్రావెల్ ఖానా పథకం దేశంలోని 100 కేంద్రాల్లో రెండు వేలకుపైగా ప్రధాన రైళ్లలో అందుబాటులో ఉంది. రైలు ప్రయాణంలో ఉండగా కోరుకున్న ఆహారం కోరుకున్న సమయంలో ఆయా స్టేషన్‌లో ప్రయాణికుడికి అందించడం పథకం ఉద్ధేశ్యం. రైలులోని ప్యాంట్రీకార్‌లో వండిన ఆహార పదార్థాలు నచ్చకుంటే ట్రావెల్‌ఖానాను సంప్రదించి కావలసిన వంటకాన్ని అవసరమైన సమయానికి రైలు చేరుకునే స్టేషన్‌కు ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవచ్చు. ఆన్‌లైన్, ఫోన్ బుకింగ్ సౌకర్యం ఉంది. ఫోన్ 8800313131 నెంబర్‌కు సంప్రదించి ఏ సమయానికి ఏ రైల్వేస్టేషన్‌లో అందించాలో వివరాలను తెలియజేస్తే ఇష్టమైన ఆహారం అందుతుంది.
రైలు ప్రయాణంలో కోరుకున్న చోట కోరిన ఆహారం అందిస్తోంది ట్రావెల్ ఖానా
english title:
travel khana
Date:
Monday, February 3, 2014