గొలుగొండ, ఫిబ్రవరి 2: సమైక్యాంధ్ర ముసుగులో మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయం చేస్తున్నారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన విశాఖపట్నం జిల్లా, గొలుగొండ మండలం సాలికమల్లవరం గ్రామంలో ఆదివారం ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై, ఇక్కడి విలేఖర్లతో మాట్లాడారు. మంత్రి గంటా కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కాజేస్తున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర ముసుగులో ముఖ్యమంత్రి గంటాకు అనుకూలంగా వ్యవహరిస్తూ రాజకీయం చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు.
అయ్యన్న మండిపాటు
english title:
s
Date:
Monday, February 3, 2014