కడప, ఫిబ్రవరి 2: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండవ ప్లీనరీలో భాగంగా కడప జిల్లా ఇడుపులపాయలో వైకాపా అధినేత జగన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటు పట్టణ, నగర పార్టీ అధ్యక్షులను కూడా సంస్థాగత ఎన్నికల రాష్ట్ర కన్వీనర్ ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు ప్రకటించారు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేస్తున్న జిల్లా కన్వీనర్లనే అధ్యక్షులుగా ప్రకటించారు. కడప జిల్లా అధ్యక్షుడుగా కె సురేష్‌బాబు, అనంతపురం జిల్లా అధ్యక్షునిగా ఎం శంకర్ నారాయణ, కర్నూలు జిల్లా అధ్యక్షునిగా గౌరు వెంకటరెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షునిగా నారాయణ స్వామి, నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా మేరిగ మురళీధర్,ప్రకాశం జిల్లా అధ్యక్షునిగి ఎన్ బాలాజీ, విజయవాడ (కృష్ణాజిల్లా) అధ్యక్షుడిగా పి ఉదయభాను, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఎం రాజశేఖర్, తూర్పుగోదారి జిల్లా అధ్యక్షునిగా కె చిట్టాబ్బాయ్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షునిగా టి బాలరాజు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా బి వెంకటరావు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా ధర్మాన క్రిష్ణదాస్, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎం సోమేశ్వరరావు, అదిలాబాద్ జిల్లా అధ్యక్షునిగా వినాయక్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడిగా వై క్రిష్ణారెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎ విజయకుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా శేఖర్‌గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుగా ఎస్ భాస్కర్‌రెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడిగా బి.జగపతి, నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా జి శ్రీకాంత్‌రెడ్డి, నిజామాబాద్ అధ్యక్షునిగా విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా పి సాంబశివరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పి వేంకటేశ్వర్లు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ మధుశేఖర్‌ల పేర్లను ప్రకటించారు.
ప్రకటించిన ఉమ్మారెడ్డి
english title:
y
Date:
Monday, February 3, 2014