Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి

$
0
0

మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 3: పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సోమవారం ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, వెల్ఫేర్ యూనియన్ (సిఐటియు అనుబంధ సంఘం) ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సిఐటియు కార్యాలయం నుంచి ప్రారంభమై బెల్లంపల్లిచౌరస్తా మీదుగా తహశిల్దార్ కార్యాలయానికి చేరుకుంది. కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ తిరుపతికి అందజేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షులు జి.ప్రకాష్, వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు పద్మ, సురేఖ మాట్లాడుతూ మంచిర్యాల పరిధిలో పని చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసం రూ.10వేల వేతనాలు చెల్లించాలని, ఇతర బిల్లులు, పెరిగిన సెంటర్ల అద్దెలను, కేంద్రాలలో వౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనేక చోట్ల కమీషన్ల పేరుతో బిల్లులు సకాలంలో చేయకుండా సంబంధిత అధికారులు నిరాకరిస్తున్నారని అన్నారు. పెన్షన్‌తో సహా రిటైర్‌మెంట్ బెన్‌ఫిట్స్‌ను కల్పించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో జోక్యం కల్పిస్తూ ప్రథమ ఎడ్యుకేషన్, ఫౌండేషన్, ఐటిసి సంస్థలకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాలని, ప్రైవేటీకరణ చర్యలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఐకెపి జోక్యాన్ని నివారించాలని, అమృతహస్తం, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, వర్కర్స్‌కు రూ.2వేలు, హెల్పర్స్‌కు రూ.1000లు అదనంగా చెల్లించాలని, షరతులు లేకుండా పెంచిన కేంద్రాల అద్దెను చెల్లించి బిఎల్‌వో విధులను నిర్ణయించాలని కోరారు. మెను చార్జీలు, కట్టెలు, వంటకు సరిపడే గ్యాస్‌ను సబ్సిడీతో ఇవ్వాలని, వౌళిక వసతులు కల్పిస్తూ ఐసిడిఎస్‌ను సంస్థాగతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు విజయలక్ష్మి, కారత కృష్ణ, స్వరూప, పాపమ్మ, సరస్వతీ, జయ, రమాదేవి, విజయ, ఓదెమ్మ, స్వర్ణలత, పద్మ, శ్రీలక్ష్మి, కృష్ణవేణి, అరుణ పాల్గొన్నారు.
అంగన్‌వాడీల ధర్నా
ఆసిఫాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు అంగన్‌వాడీ వర్కర్ యూనియన్ కార్యకర్తలు సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమకు 10 వేల రూపాయల వేతనాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేస్తు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సువర్ణ, రమాదేవి, సరోజ, శ్రావణి పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర
నిర్మల్, ఫిబ్రవరి 3: నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడవంతో పాటు గత ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాలంలో అభివృద్ది ఏవిధంగా కుంటు పడిందో ప్రజలకు వివరించేందుకే ఈనెల 10 నుంచి పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ ఎంపి అల్లోల ఇంద్రకకరణ్‌రెడ్డి తెలిపారు. నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని నిర్మల్ మండలంలో పూర్తయిన తరువాత సారంగాపూర్, దిలావర్‌పూర్, లక్ష్మణచాంద, మామడ మండలాల్లో కొనసాగుతుందన్నారు. సోమవారం నియోజకవర్గంలోని తన ముఖ్య అనుచరులతో కలిసి నిర్మల్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న 2004-2009 వరకు నియోజకవర్గంలో చేపట్టిన అబివృద్దిని ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు గుర్తుచేస్తానన్నారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది జరుగలేదని, కనీసం నాయకులు గ్రామాలను సందర్శించి పాపాన కూడా పోలేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇప్పటి ఎమ్మెల్యే ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమేరకు నెరవేర్చారో ప్రజలనే అడిగి తెలుసుకుంటానన్నారు. ఇదిలా ఉంటే త్వరంలోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారం కాబోతోందని, ముఖ్యమంత్రి సహా ఎవరెన్ని అడ్డకుంలు సృష్టించినా తెలంగాణ ఆగదన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందని, బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తరువాత ఘనంగా సంబరాలు చేసుకుందామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోనే జరుగుతాయని ఆయన ఆశాబావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అల్లోల అనుచరులు అప్పాల మహేశ్, ధర్మాజీగారి రాజేందర్, వాజిద్ హైమద్‌ఖాన్, కోటగిరి అశోక్, బాస్కర్‌రావ్, మాదవరావ్, ముత్యం రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.
, నవీన్‌రావ్, వంజర్ శ్రీనివాస్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వచ్చే ఏడాది
తెలంగాణ రాష్ట్రంలో నాగోబా జాతర
* మంత్రి సారయ్య
ఉట్నూరు/ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 3: గిరిజనుల ఆరాధ్యదైవం అయిన నాగోబా జాతర వచ్చే సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బసవరాజు సారయ్య తెలిపారు. ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో నాగోబా జాతరను పురస్కరించుకొని సోమవారం దర్బార్ నిర్వహించగా మంత్రితో పాటు కలెక్టర్ అహ్మద్ బాబు, పిఓ జె నివాస్, ఎమ్మెల్యేలు సుమన్‌బాయి, ఆత్రం సక్కు పలు శాఖల అధికారులు, ఆదివాసులు, పలు పార్టీల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రికి దర్భార్‌కు రాగా సాంప్రదాయ రీతిలో మెస్రం భక్తులు స్వాగతం పలికారు. అనంతరం నాగోబా దేవాలయంలో మంత్రి పూజలు నిర్వహించి అనంతరం పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం దర్బార్‌లో మాట్లాడుతూ నాగోబా ఆశీస్సులతో తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పాసు అవుతుందని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని అన్నారు. వచ్చే సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలోనే పండగ నిర్వహించబడునని అన్నారు. మెస్రం వంశీయులు కోరిన విధంగా కెస్లాపూర్‌లో శివాలయం ఏర్పాటు చేస్తూ ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, గిరిజన యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేస్తామని అన్నారు. సమ్మక్క సారక్క జాతరకు కోటి 50 లక్షలు కేటాయించామని రాష్ట్ర పండగ అయినటువంటి నాగోబా జాతర ఏర్పాటుకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించామని అన్నారు. శివాలయం నిర్మాణంకు వేతనం అందిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరు సహకరించడం ద్వారానే అభివృద్ధి సాధించగలుగుతున్నామని అన్నారు. అటవీ హక్కుల చట్టం కింద 37 వేల మందికి 4 లక్షల 39 ఎకరాలు అటవీ భూములకు పట్టాలు ఇచ్చామన్నారు. గోవాడ నిర్మాణంకు రూ.30 లక్షలు, వాటర్ ట్యాంకు నిర్మాణానికి 15 లక్షలు, సిసి రోడ్లకు 10 లక్షలు కేటాయించినట్లు, పిఎంఆర్‌సిలో అదనపు గదుల కోసం 50 లక్షలు కేటాయించామని అన్నారు. సోమ్నిలో కోటి రూపాయలతో ఆశ్రమ పాఠశాల అదనపు గదుల కోసం నిధులు కేటాయించామని మంత్రి అన్నారు. అభివృద్ధితో పాటు జాతరలో సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కలెక్టర్ అహ్మద్ బాబు మాట్లాడుతూ నాగోబా పవిత్రతను చరిత్రలో తెలుసుకొని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని తాను నివేదికలు పంపించినట్లు తద్వారానే నాగోబా పండగతో పాటు కొమరంభీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామన్నారు. తాగునీటి సౌకర్యం కోసం కొమరంభీం ప్రాజెక్టు ద్వారా 63 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 శాతం పనులు పూర్తి చేశామన్నారు. మరో 15 కోట్లతో మార్చి వరకు పూర్తి చేయిస్తామన్నారు. ఇప్పటికే అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయన్నారు. గుంజాలలో ఐటిడిఎ ద్వారా గోండి లిపి అధ్యయన కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. నిరుద్యోగుల కోసం 5 యూత్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పిఓ జె నివాస్ మాట్లాడుతూ ఇంద్రవెల్లిలో రింగ్ రోడ్డు నిర్మాణంకు కృషి చేయడంతో పాటు 35 లక్షలతో ముత్నూర్ నుండి కెస్లాపూర్ వరకు రోడ్డు నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే సక్కు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూ కాపాడుకోవాలన్నారు. దేవాలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని వాటిని పరిరక్షించుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ మాట్లాడుతూ ఉట్నూరులో ఏరియా ఆసుపత్రి, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలని అన్నారు. పలువురు గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ సర్ట్ఫికెట్లు అడగడం ద్వారా గిరిజన యువకులు ముందుకు వెళ్ళలేక పోతున్నారని, 1970లో ఎస్టీలుగా చెలామణి అవుతున్న వారికి అధికారులు 1950 సర్ట్ఫికెట్లు ఇవ్వడం ఖండిస్తున్నామని అన్నారు. కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచి తాగునీరు అందించాలన్నారు. కెస్లాపూర్ ఆలయం వద్ద విశ్రాంతి భవనంతో పాటు కమ్యూనిటీ హాల్‌ను భక్తుల సౌకర్యార్థం నిర్మించాలన్నారు. అనంతరం పలు సమస్యలను మంత్రి, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పలు ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ భూపాల్, ఇఇ శంకర్‌రావు, ఆర్డీఓ రామచంద్రయ్య, ఎఎస్పీ జూయెల్ డేవిస్, నాయకులు రవీందర్‌రావు, అజ్మీర హరి, టిఎన్‌జిఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్, నేతలు రేఖ నాయక్, సర్పంచ్‌లు, దేవదాయ ప్రత్యేక కమిషనర్ విజయ్‌కుమార్, నేతలు తుకారాం, యాదవ్‌రావు, సిడాం శంభు, సోయం బాపురావ్, ఆచార్య జయధీర్ తిరుమల్‌రావు, మనోజ గిరిజనులు పాల్గొన్నారు.
నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలి
* రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న డిమాండ్
జన్నారం, ఫిబ్రవరి 3: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంలో విద్యార్థులకు సరఫరా చేస్తున్న బియ్యం గత కొంత కాలంగా గిడ్డంగులలో వున్న ముక్కిపోయిన నాణ్యత లోపించిన బియ్యాన్ని పంపిణీ చేస్తుండడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో జిల్లాలోని పలు మండలాల్లో గల పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం బియ్యం సక్రమంగా లేక పోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారని అన్నారు. ప్రభుత్వం నాణ్యత గల బియ్యాన్ని సరఫరా చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. విద్యాహక్కు చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలతో పాటు పాదరక్షలు కూడా అందిజేయాలని, అదే విధంగా ప్రభుత్వం రిజర్వేషన్ విధానాన్ని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులు అమలు చేసి జీఓ నెం.2లోని లోపాలను సవరించాలని అన్నారు. భాషా పండితులను గుర్తించి వారికి న్యాయం చేయాలని అన్నారు. భాషా పండితులను గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం మభ్య పెడుతుందని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. ఈ విలేఖర్ల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి మురళీ, మండల నాయకులు రాజలింగం, సిద్దార్థ, సురేష్ పాల్గొన్నారు.
ఎఐఎం మతఛాందసవాద పార్టీ కాదు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 3: ఎ ఐ ఎం ముస్లిం మత చాందసవాది పార్టీ కాదని కొందరు తమ పార్టీ పట్ల కుట్రలు పన్నుతున్నారని చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో ఆయన విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, ముస్లింలు ఉర్దూలోనే దరఖాస్తులను సమర్పించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉర్దూలో ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించడానికి ప్రభుత్వమే అనువాదకులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ఉర్దూ పట్ల చిన్న చూపు చూస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ను సరిగ్గా సరాఫరా చేయడం లేదని కేవలం 6 గంటలు మాత్రమే విద్యుత్‌ను సరాఫరా చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఫారూఖ్ ఆహ్మాద్, పట్టణ అధ్యక్షులు శేఖ్ చాంద్, హెచ్ ఎం సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. ఎం ఐ ఎం పార్టీలో చేరిన 20 మందిని కండువాలను కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
బాసరలో నేటి నుంచి
వసంత పంచమి ఉత్సవాలు
బాసర, ఫిబ్రవరి 3: సుప్రసిద్ద పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో మాఘ శుద్ద పంచమి నుండి మాఘ శుద్ద పంచమి వరకు వసంత పంచమి ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి జన్మదినం వసంత పంచమి మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మవారి చెంత అక్షర శ్రీకార పూజలు నిర్వహిస్తే చిన్నారు విద్యావంతులవుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ శుభసందర్బాన్ని పురస్కరించుకొని అమ్మవారి చెంత అక్షర శ్రీకార పూజలు నిర్వహించడానికి రాష్ట్రం నుండే కాకకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రంతాలనుంచి వచ్చే భక్తుల కోసం అధికారులకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రత్యేక అక్షరాభ్యసం, ధర్శనసేవలకై ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని ఉత్సవాల కోసం సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. ఆలయంతోపాటు గర్భాలయంలో సైతం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.్భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ప్రాంగణంలో శామియానాలు, తాగునీటి కొళాయిలు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే భక్తుల సౌకర్యార్థం వైద్య క్యాంపు, ఆర్టీసి ఆద్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఉత్సవాలకు భారీ బందోబస్తు
వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భైంసా డిఎస్‌పి రావుల గిరిధర్ ఆద్వర్యంలో ఇద్దరు సిఐలు, ఆరుగురు ఎస్‌ఐలతో పాటు 200 మంది కానిస్టేబుల్, హోంగార్డులతో బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రజాఫిర్యాదుల విభాగానికి స్పందన
మంచిర్యాల, ఫిబ్రవరి 3: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగానికి మంచి స్పందన వచ్చింది. సోమవారం స్థానిక ఆర్‌డిఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో భాగంగా ప్రజల నుంచి ఆర్‌డిఓ చక్రధర్‌రావు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందన్నారు. వివిధ శాఖల అధికారులు ప్రజా సమస్యలపై స్పందిస్తూ సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, భూసమస్యలు తదితర వాటిపై ఫిర్యాదులందగా, ఆయా శాఖల అధికారులకు పంపించడం జరిగిందని, ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా కృషి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల విభాగానికి
ఆరు దరఖాస్తులు
జైపూర్: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి 6దరఖాస్తులు వచ్చిన్నట్లు తహసీల్దార్ మధుసూదన్ తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు భూసమస్యలు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఫిర్యాదుల విభాగంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజాఫిర్యాదులో అర్జీల స్వీకరణ
కడెం: కడెంలోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజాఫిర్యాదుల విభాగాన్ని తహశీల్దార్ లోకేశ్వర్‌రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ విభాగంలో గృహ నిర్మాణంకు సంబంధించిన మూడు దరఖాస్తులను లబ్ధిదారులు సమర్పించారు. అలాగే పెద్దూర్ గ్రామ సర్పంచ్ చిట్యాల చిన్నయ్య తమ గ్రామ పంచాయతీలో తాగునీటికి సంబంధించిన పథకం నిర్మాణం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, ఈ పనులు త్వరగా పూర్తయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌కు సర్పంచ్ చిన్నయ్య వినతిపత్రం అందజేశారు.
అలాగే దోస్త్‌నగర్ ఎస్సీ కాలనీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు కాగా, ఆ రోడ్డు వేయకుండా స్థానిక సర్పంచ్ డాకూరి లచ్చవ్వ బిసి కాలనీలో రోడ్డు వేస్తూ నిధులు దుర్వినియోగం చేస్తుందని దోస్త్‌నగర్ వార్డు సభ్యురాలు కలమడుగు అనసూయ, స్థానిక నాయకులు డాక్టర్ అవునూరి శంకర్, కలమడుగు బాణయ్య, తాటిపెల్లి గంగన్న, ఆవునూరి శ్రీను, అవునూరి కిష్టయ్య, పాత రాజు ఆశన్నతోపాటు పలువురు గ్రామస్తులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సోమవారం ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, వెల్ఫేర్
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles