సిరిసిల్ల, ఫిబ్రవరి 3: వేళ పాలలేని కరెంటు కోతను నిరసిస్తూ సిరిసిల్ల సోమవారం ఆవునూరు రైతులు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆవునూరు గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ప్రజలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సిరిసిల్లలో ధర్నా, రాస్తారోకో, నిరసన ప్రదర్శన, సెస్ కార్యాలయాల ముట్టడించారు. ఈమేరకు రైతులు అగ్రహానికి గుర య్యే ప్రమాదం ఉండడంతో పోలీసులు మందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు నిర్వహించారు. అప్రకటిత విద్యుత్ కోతలు ఎత్తివేయాలని, సింగిల్ విండో ఫేస్ పునరుద్దరించాలని, ఏడు గంటలు కరెంటు సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని ఇక్కడ రాస్తారోకో,్ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఇక్కడి నుండి భారీ ర్యాలీగా గాంధీచౌక్ మీదుగా తరలి వెళ్ళి సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించారు. అయితే పోలీసులు కార్యాలయ గేట్లు మూసివేసి, ఎవరూ లోనికి చొరబడకుండా బందోబస్తు నిర్వహించారు. దీనితో ఆందోళన కారులు సెస్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా కొనసాగించారు. సి ఎం కిరణ్‌కుమార్, సెస్ మేనేజింగ్ డైరెక్టర్‌లక వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సెస్ చైర్మన్ కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డికి ఆవునూరు గ్రామ సర్పంచ్ ఏనుగుల సత్తమ్మ చేతుల మీదుగా వినతి పత్రం సమర్పించారు. ఆవునూరు గ్రామానికి వచ్చే ఇన్ కమింగ్ కరెంటులో త్రీ-ఫేస్ కరెంటులో అప్రకటితంగా కోతలు విధిస్తున్నారని, దీనితో రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతున్నదన్నారు. ఈ త్రీ ఫేస్ కరెంటును నిరవధికంగా ఏడు గంటలు సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. తమ గ్రామంలో ఉన్న సింగిల్ ఫేస్ సరఫరాలో సబ్ స్టేషన్ ఫీడర్ ఆగడం లేదని, ఈ ఫీడర్‌ను పునరుద్దరించి గ్రామంలో సింగిల్ ఫేస్ కరెంటును ఆందించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు. ఆవునూరు సర్పంచ్ ఏనుగుల సత్తమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగగా ఇందులో రైతులు, మహిళలతో పాటు బి ఎస్పీ జిల్లా అధ్యక్షులు అంకని భాను, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
అవినీతిపై బ్రహ్మాస్త్రం సహ చట్టం..
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 3: ప్రత్యేక తెలంగాణ పునర్నిర్మాణంలో సమాచార హక్కు చట్టం అమలు కీలకపాత్ర పోషిస్తుందని, పేద ప్రజలకు సామాజిక న్యాయం అందేలా ఈ చట్టం దోహదపడుతుందని కేంద్ర సమాచార కమీషనర్ ప్రొఫేసర్ మాడభాషి శ్రీ్ధర్ అన్నారు. సోమవారం స్థానిక ఫిలిం భవన్‌లో లోక్‌సత్తా ఉద్యమ సంస్థ, సహరక్షణ వేదిక, వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సహకార్యకర్తల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిన గొప్ప చట్టాల్లో మహిళలకు ఆస్తిలో హక్కునిచ్చిన హిందూ పౌరసత్వ చట్టం-2005, సమాచార హక్కు చట్టం -2005లు పేర్కొనబడ్డాయని అన్నారు. ప్రజల చేతిలో పాశుపతాస్త్రంగా, అవినీతికి వ్యతిరేకంగా, బ్రహ్మాస్త్రంగా ఆ చట్టాలను అభివర్ణించారు. ఇతరులకోసం బ్రతికే వృక్షంలా, నిజాయితికి మారుపేరైన జంతువుల్లా మనిషి సామాజిక సేవలో సహచట్టం ద్వారా భాగస్వాములు కావాలని సూచించారు. రాజస్థాన్‌లో ఆరంభమైన సహ ఉద్యమ చరిత్రను సోదాహరణంగా వివరించి రెండవ స్వాతంత్య్ర పోరాటంగా అభివర్ణించారు. సహకార్యకర్తలకు సామాజిక సంస్థలు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రక్షణగా నిలువాలని, లేనిచో దేశం అధమస్థాయికి చేరుకుంటుందని అన్నారు. వేములవాడ దేవస్థానం వారు సహచట్ట పరిధిలోకి వస్తారని, సహకార సంస్థలు రావని ఆయన స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్శిటి వారు జవాబుపత్రాన్ని సహచట్టం కింద కావాలంటే వేయి రూపాయల ఫీజు చెల్లించుకున్నారని ఒకరు కమీషనర్ దృష్టికి తీసుకురాగా పేజికి రెండు రూపాయల చొప్పున చెల్లించాలే తప్ప, పైసా ఎక్కువ అడిగే అధికారం యూనివర్శిటికి లేదని శ్రీ్ధర్ తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాము సహచట్టంపై అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నామని, కార్యకర్తలకు వచ్చే నెలలో శిక్షణ ఏర్పాటు చేస్తామని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన లోక్‌సత్తా ఉద్యమ సంస్థ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో కొన్ని అసాంఘీక శక్తులు సమాజహితం కోరేవారిపై భోగస్ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం సహకార్యకర్తలకు అండగా ఉండాలని కోరారు. కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సమాచార హక్కుచట్టం అమలుపై తీసుకుంటున్న చర్యలపై శ్రీ్ధర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార కమీషనర్ శ్రీ్ధర్‌ను వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఘనంగా సత్కరించాయి. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా, వినియోగదారుల మండలి, సహరక్షణ వేదిక బాధ్యులు ప్రకాష్ హొల్లా, కె.సి.రెడ్డి, ఆర్.చంద్రప్రభాకర్, వెంకటేశ్వర్లు, కె.ఎస్.నారాయణ, లక్ష్మణ్‌కుమార్, ముజఫర్, గోపాల్, గంగారావు, గంగాధర్, శంకర్, రాజయ్య, కృపాదానం, చక్రధర్, సోమలక్ష్మి, వీరాల మహేష్, ఆర్.వి.రావు తదితరులు పాల్గొన్నారు.
అప్రకటిత కరెంటు కోతకు నిరసనగా రైతుల రాస్తారోకో సిరిసిల్లలో ఆవునూరు ప్రజల భారీ నిరసనలు ‘సెస్’ ముట్టడి, ధర్నా, పట్టణంలో భారీ ప్రదర్శన
english title:
c
Date:
Tuesday, February 4, 2014