Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

జిల్లా టిడిపి నేతల మధ్యవిబేధాలు లేవు

$
0
0

మందస, ఫిబ్రవరి 4: జిల్లాలో టిడిపి నేతల మధ్య ఎటువంటి విబేధాలు లేవని ఆ పార్టీ యువనేత కింజరాపు రామ్మోహననాయుడు పేర్కొన్నారు. సైకిల్‌యాత్రలో భాగంగా మంగళవారం మందసలో ఆయన విలేఖర్లతోమాట్లాడారు. నేతల మధ్య అసంతృప్తి ఉన్నట్లు చేస్తున్న ప్రచారం ఎంతమాత్రం వాస్తవం కాదన్నారు. తమ పార్టీ కుటుంబం వంటిదని అన్నారు. కుటుంబంలో సమస్యలు పరిష్కారామైనట్లే, తమ మధ్య కూడా విబేధాలు ఉన్నా, పరిష్కారమవుతాయన్నారు. మేధావులు, యువత తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీకి సేవ చేసి టిక్కెట్లు అడగడంలోతప్పులేదని ప్రజాసేవ చేసే నాయకులనే ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు. టిడిపి బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నారు. తన తండ్రి ఆశయ సాధన కోసం సిక్కోలు వాణి ఢిల్లీలో వినిపించాలంటే టిడిపి ఎంపిగా ప్రజలు తనను ఎన్నుకోవాలని కోరారు.
అనంతరం సైకిల్ యాత్ర మందస నుండి సిద్దూరు, కొత్తపల్లి, తొండిపుడి గ్రామాల మీదుగా సాగింది. దారి పొడుగున ఆయనకు ఆఖండ స్వాగతం పలికారు. సొండిపుడి వద్ద ఆయన బహిరంగ సభలో రామ్మోహననాయుడు మాట్లాడుతూ రాష్ట్ర సంపదను ఆలీబాబు 40 దొంగలుగా ఎమ్మెల్యేలు, మంత్రులు దొచుకుతిన్నారని ధ్వజమెత్తారు. టిడిపిలో అవినీతి పరులు లేరని అందరూ ప్రజాసేవకులేనని విజ్ఞతతో ఓట్లు వేసి పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, వైసిపిలను ప్రజలు నమ్మోదని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, జిల్లా షణ్ముకరావు, సుబ్బలక్ష్మి, డి తిరుపతి, డి తాతారావు, రట్టి లింగరాజు, ఎల్ కామేష్, పి విఠల్, ఉదయ్‌కుమార్, కగేశ్వరరావు, దేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

జిల్లాలో టిడిపి నేతల మధ్య ఎటువంటి విబేధాలు లేవని
english title: 
ratha sapthami

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>