శ్రీకాకుళం, ఫిబ్రవరి 4: ఈనెల 8,9 తేదీల్లో ఆన్‌లైన్ దరఖాస్తు మేళా నిర్వహిస్తున్నట్లు విశాఖ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి ఏ.టి.మూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పాస్‌పోర్టు దరఖాస్తుదారులు ముందస్తు అనుమతులు దొరక్క పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారి సౌకర్యార్థం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను పాస్‌పోర్టు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న అనంతరం 5వ తేదీ సాయంత్రం నుండి స్లాటులు అందుబాటులో ఉంటాయన్నారు. స్లాటు పొందిన వారు ఎఆర్‌ఎన్ కాపీ, అసలు ధృవపత్రం, నకళ్లు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో మేళా కేంద్రాలకు రావాలన్నారు. నూతన, రెన్యువల్ పాస్‌పోర్టు తీసుకోవాలనుకునేవారికి మాత్రమే మేళాలో స్లాటులు లభిస్తాయని వివరించారు. మేళా విశాఖ మురళీనగర్‌లోని బొత్స స్క్వేర్ భవనంలో నిర్వహించనున్నామన్నారు.
ఈనెల 8,9 తేదీల్లో ఆన్‌లైన్ దరఖాస్తు మేళా నిర్వహిస్తున్నట్లు
english title:
passport mela
Date:
Wednesday, February 5, 2014