విశాఖపట్నం, ఫిబ్రవరి 4: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌తో లింకు పెట్టొద్దంటూ న్యాయస్థానాలు తీర్పునిస్తున్నాయి. ఆధార్‌తో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ ప్రభుత్వ ప్రతినిధులు హామీలిస్తున్నారు. అయితే సామాన్యుడికి మాత్రం ఆధార్ అవరోధాలు తప్పట్లేదు. వంటగ్యాస్ సబ్సిడీ, రేషన్ సరుకులు, విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇలా సంక్షేమం ఏదైనా అన్నీ ఆధార్ చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా రేషన్ సరకుల విషయంలో కూడా ఆధార్ కార్డు ఉండాలంటూ డీలర్లు వినియోగదారులకు స్పష్టం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలకోటా సరకులను విడిపించుకోవాలంటే ఆధార్ కార్డు ప్రతిని తప్పనిసరిగా ఇవ్వాలంటూ డీలర్లు మెలిక పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి కోటా సరకులు విడిపించుకునే వారంతా ఆధార్ కార్డులను విధిగా ఇవ్వాలంటూ డీలర్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆధార్ కాపీని అందజేసిన వారు మినహాయించి మిగిలిన వారంతా ఈనెల కోటా సరుకులతో పాటు ఆధార్ ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో 1513 రేషన్ దుకాణాలుండగా, అన్ని కేంద్రాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. విశాఖ నగరపరిధిలో 413 రేషన్ డిపోలుండగా, 3.31లక్షల మంది రేషన్‌కార్డు దారులున్నారు. వీరికి ప్రతినెలా 5330 టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకూ రేషన్ డిపోల్లో ఆధార్ నమోదు 65 శాతం మాత్రమే జరిగింది. కొంతమంది ఆధార్ అందజేసినప్పటికీ చేతి ముద్రలు, ఫొటో గుర్తింపు సక్రమంగా లేకపోవడంతో వారి వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 80వేల ఆధార్ కార్డులు ఈవిధంగా పెండింగ్‌లో పడినట్టు పౌరసరఫరాల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పౌరసరఫరాల అధికారుల వద్ద ప్రస్తావిస్తే అబ్బే అలాంటిదేం లేదంటున్నారు. డీలర్లు మాత్రం ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాతే రేషన్ సరకులు అంటూ పట్టుబడుతున్నారు.
ఇప్పటికే సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల కోటాను సంవత్సరానికి 9 నుంచి 12కి పెంచుతూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుతానికి ఆధార్ యూనిక్ నెంబర్‌తో సిలిండర్ల సబ్సిడీని ముడిపెట్టకూడదన్న నిర్ణయం కూడా ఇదే కేంద్రమంత్రి మండలి నిర్ణయమే. అయితే క్షేత్రస్థాయిలోకి వచ్చే సరికి సబ్సిడీ సిలెండర్లను 12 పెంచుతున్నట్టు ఆదేశాలు అందాయని, ఆధార్‌తో సంబంధం లేదన్న విషయంలో చమురు కంపెనీల నుంచి తమకు సమాచారం లేదంటూ గ్యాస్ ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో వినియోగదారుల్లో గందరగోళం తప్పట్లేదు. గ్యాస్ బుకింగ్ చేసే సందర్భంలో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడంతో పాటు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలంటూ సమాచారం వస్తోంది. దీంతో విని
‘మద్య నిషేధానికి మహిళలు కృషి చేయాలి’
విశాఖపట్నం , ఫిబ్రవరి 4: మహిళలు చైతన్యవంతమై మద్య నిషేధానికి తమ వంతు కృషి చేయాలని ఆంధ్రా యూనివర్శిటీ ఉప కులపతి ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు అన్నారు. మంగళవారం ఉదయం ఎయు దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా అధ్యయన కేంద్రంలో ‘రానున్న ఎన్నికల్లో మద్యపాన ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మద్యం కోసం ఓటు హక్కును అమ్ముకోవడం వల్ల నాయకత్వంలో సమర్థత లోపిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో మద్యపాన సరఫరాను పూర్తిగా నిలిపివేయాలన్నారు. ఫోరం ఫర్ బెటర్ విశాఖ కన్వీనర్ ఇఎఐ శర్మ మాట్లాడుతూ ప్రజలకు నేతలు జవాబుదారీగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.యోగదారులు డీలర్లను సంప్రదిస్తున్నారు. ఈవిషయంలో జిల్లా యంత్రాంగం కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. ఎప్పటికైనా ఆధార్ తప్పదు కాబట్టి ఇప్పుడే నమోదు చేసుకోండంటూ సలహా ఇస్తున్నారు. దీంతో ఆధార్ లింకు వినియోగదారులను వలిలేదిగా కన్పించట్లేదు.
టెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
విశాఖపట్నం, ఫిబ్రవరి 4: ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (టెట్)కు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ముందుగానే తెలుసుకొని, నిర్ణీత సమయంలో కేంద్రాలకు చేరుకోవాలని అదనపు జాయింట్ కలెక్టర్ వై.నరసింహారావు అన్నారు. ఈ నెల 9వ తేదీన జరుగనున్న టెట్ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 22,464 మంది అభ్యర్థులు టెట్ పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష మొదటి పేపరుకు ఉదయం 9.30 నుండి 12 గంటల వరకు, రెండవ పేపర్ మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 97 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, నిర్వహణ సిబ్బందిని నియమించడం జరుగుతుందన్నారు. టెట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నిర్థిష్టమైన నిబంధనలు విధించిందన్నారు. పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయా అధికారులకు ఆదేశించామన్నారు. ఈ సమావేశంలో ఉప విద్యాశాఖాధి కారిణి రేణుక, డిఎంహెచ్‌ఓ శ్యామల, జివిఎంసి, ఎపి ట్రాన్స్‌కో, రవాణా శాఖ, పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.