విశాఖపట్నం, ఫిబ్రవరి 4: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతున్నట్టు ఎపి ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కొఠారి ఈశ్వరరావు తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సమ్మె విజయవంతానికి సంబంధించి అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులతో బుధవారం మధ్యాహ్నం తమ సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సమైక్య రాష్ట్ర పరిరరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు తాము మళ్ళీ బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పడుతున్నామని, ఇందులో దాదాపు 40 ప్రభుత్వ సంస్థలకు చెందిన 25 వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొంటారన్నారు. ఉద్యమం తీవ్రతరం చేయడంలో భాగంగా సీమాంధ్ర జిల్లాలకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేల ఇళ్ళ ముట్టడి, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ రెవెన్యూ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతున్నట్టు ఎపి రెవెన్యూ సర్సీసెస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్తి నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సంఘ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ జిల్లాలో ఉన్న అయిదు వేల మంది రెవెన్యూ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారన్నారు. విఆర్‌ఒ, విఆర్‌ఎ నుంచి తహశీల్దార్ స్థాయి వరకు ఈ సమ్మెలో పాల్గొంటారన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు తాము ఈ సమ్మెలోకి దిగుతున్నామన్నారు. ఎటువంటి పరిస్థతుల్లోను రాష్ట్రాన్ని విభజిస్తే సహించబోమని, ఉద్యమం ఉద్ధృతం అవుతుందని హెచ్చరించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ
english title:
strike from midnight
Date:
Wednesday, February 5, 2014