నల్లగొండ, ఫిబ్రవరి 5: ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి రుణ పథకాల యూనిట్లను మంజూరు చేసే మండల కమిటీల ఎంపిక రాజకీయాల నేపధ్యంలో అడ్డగోలుగా సాగడంతో జిల్లాల ఆ వర్గాల రుణ సహాయ పథకాలు దారితప్పుతున్నాయని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. మండల కమిటీలలో స్థానిక ఎమ్మెల్యే సూచించిన ముగ్గురు సభ్యులను జిల్లా ఇన్‌చార్జీ మంత్రి ఆమోదంతో మండల స్థాయి లబ్ధిదారుల ఎంపిక కమిటీలో సభ్యులవుతారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిడివో నేతృత్వంలోని ఈ కమిటీలో కార్పొరేషన్ సభ్యుడు, బ్యాంకు మేనేజర్, మండల సమాఖ్య అధ్యక్షురాలితో పాటు మరో ముగ్గురిని ఎమ్మెల్యే నామినేట్ చేయాల్సివుంది. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల్లో ముగ్గురు సభ్యులలో ఒకరు తప్పనిసరిగా మహిళ ఉండాలని సూచించినప్పటికి మిగతా ఇద్దరు పురుషులలో ఎలాంటి రిజర్వేషన్ ప్రమాణికత సూచించలేదు. దీంతో కమిటీలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మెజార్టీ మండలాల్లో స్థానం దక్కడం లేదన్న విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్టీ జనాభా అధికంగా ఉన్నా దేవరకొండ, చందంపేట, డిండి, పెద్దవూరా, చింతపల్లి, ఏపిపల్లి వంటి మండలాల్లో సైతం లబ్ధిదారుల ఎంపిక కమిటీల్లో ఎస్టీలకు తగిన చోటు లభించకపోవడం కమిటీల నిర్మాణంలోని లోపాలను ప్రశ్నార్ధం చేస్తుంది. ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన దేవరకొండకు సంబంధించి దేవరకొండ మండలం లబ్ధిదారుల ఎంపిక కమిటీలో ఒక్క ఎస్టీని కూడా స్థానిక ఎమ్మెల్యే సభ్యుడిగా ప్రతిపాదించకపోవడం విడ్డూరం. అలాగే రాజకీయ నేపధ్యంతో ఎంపికైన ముగ్గురు సభ్యులు తమ రాజకీయ వర్గానికి సంబంధించిన వారినే ఎక్కువగా లబ్ధిదారులుగా ఎంపిక చేసేలా కమిటీలోని ఇతర సభ్యులను ప్రభావితం చేస్తుండటంతో నిజమైన అర్హులకు పెద్దగా న్యాయం జరుగడం లేదన్న వాదన బలంగా వినిపిస్తుంది. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ వారికే అధికంగా కార్పొరేషన్ల రుణ పథకాలు దక్కుతున్నాయంటు విపక్షాలు సైతం గగ్గోలు పెడుతున్నాయి.
రుణాల మంజూరులో బ్యాంకర్ల మొండిచేయి..!
కార్పొరేషన్ల ఉపాధి రుణ సహాయ పథకాల మంజూరులో మండల స్థాయి కమిటీల నిర్మాణంలో జరుగుతున్న లోపాలతో నెలకొంటున్న సమస్యలు ఒక ఎత్తయితే బ్యాంకర్ల వైఖరి మరో ఎత్తుగా ఉందంటు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంఘాలు వాపోతున్నాయి. సాక్షాత్ కలెక్టర్, కార్పొరేషన్ జిల్లా అధికారులు సైతం లక్ష్యాల మేరకు లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని తెస్తున్న ఒత్తిడి బ్యాంకర్ల ముందు అరణ్యరోదనే అవుతుంది. చివరకు అత్యాచారాలకు, ప్రకృతి వైపరిత్యాలకు తీవ్రంగా నష్టపోయిన ఎస్సీ, ఎస్టీలకు సైతం రుణాలు అందించడంలో బ్యాంకర్లు కనీస సామాజిక స్పృహ పాటించడం లేదంటు రుణ సమీక్ష సమావేశాల్లో కార్పొరేషన్ ఉన్నతాధికారులే వాపోయిన వైనం రుణ మంజూరు పంపిణీలో బ్యాంకర్ల మొండివైఖరిని వెల్లడిస్తుంది. జిల్లాలో ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ రుణాల గ్రౌండింగ్ ఈ నెల 5వ తేదీ నాటికి పూర్తి చేయాల్సివుండగా నిర్దేశించిన లక్ష్యాల్లో సగం కూడా చేరుకోలేదు. 25.77కోట్ల బిసి కార్పొరేషన్ రుణ యూనిట్ల గ్రౌండింగ్‌లో, 77.22లక్షల మైనార్టీ యూనిట్ల గ్రౌండింగ్‌లో, 15కోట్ల 55లక్షల ఎస్టీ యూనిట్ల గ్రౌండింగ్‌లో సగం లక్ష్యాలను కూడా పూర్తి చేయలేదంటు ఆయా సంఘాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి రుణ పథకాల
english title:
r
Date:
Thursday, February 6, 2014