Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సిఎంది పిరికి చర్య

$
0
0

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 5: నేడు కేంద్ర మంత్రివర్గం ముందుకు తెలంగాణ బిల్లు రానుంది. 10న రాజ్యసభ ముందుకు, ఆ తదుపరి పార్లమెంట్ ముందుకు తెలంగాణ బిల్లు వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు కమలనాథులు మెలిక పెట్టినట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరి చూపు దేశ రాజధాని ఢిల్లీపైనే పడింది. మొత్తం మీద తెలంగాణ ఫైనల్ ఫైట్ తీవ్ర ఉత్కంఠను, ఆసక్తిని రేపుతోంది.
సుదీర్ఘ ఉద్యమాల అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం చివరి ఘట్టానికి చేరుకుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ముందుకు సాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలు చాలామార్లు పత్రికల ద్వారా ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్టుకోవాలని సీమాంధ్ర ప్రాంత నాయకులు, సుదీర్ఘ ఉద్యమాల అనంతరం ఏర్పడబోతున్న తెలంగాణను ఏలా అడ్డుకుంటారో చూస్తామని, వారి ఎత్తుగడలను చిత్తుచేస్తామని తెలంగాణ ప్రాంత నాయకులు ఢిల్లీ బాటపడ్డి అక్కడే మకాం వేశారు. జనవరి 30వ తేదీ వరకు రాష్ట్ర శాసనసభలో తెలంగాణ బిల్లుపై గగ్గొలు పెట్టిన ఇరు ప్రాంతాల నాయకులు ఇప్పుడు ఢిల్లీ గల్లీల్లో గగ్గొలు పెట్టేందుకు వ్యూహాప్రతివ్యూహాలతో ముందుకు కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లాకు చెందిన మంత్రి శ్రీ్ధర్‌బాబు, ప్రభుత్వ విఫ్ ఆరెపల్లి మోహన్, అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, డిసిసి అధ్యక్షుడు కొండూరు రవీందర్‌రావు తోపాటు మరికొందరు నాయకులు, టిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్‌లతోపాటు పలువురు నాయకులు రెండు రోజుల కిందటే ఢిల్లీకి వెళ్లారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా, ఆందోళనలు, ప్రతి ఆందోళనలకు ఢిల్లీ వేదికగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే క్రమంలో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వౌన దీక్ష చేపట్టేందుకు ఎపి భవన్ నుంచి బస్సులో బయలుదేరుతున్న క్రమంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్, టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అడ్డుకుని హల్‌చల్ చేశారు. ఢిల్లీలో జిల్లా నాయకులు చేస్తున్న హల్‌చల్ దృశ్యాలను తెలంగాణవాదులు టివిలలో చూస్తూ టివిలకు అతక్కుపోయారు. 2004 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో జతకట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత కేంద్రంలో ఏర్పడిన యుపిఏ-1 ప్రభుత్వం కామన్‌మినిమమ్ ప్రొగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చడమే కాకుండా అప్పటి రాష్టప్రతి అబ్దుల్‌కలాం ప్రసంగంలో కూడా చేర్చింది. ఆ తరువాత కూడా వివిధ పార్టీలతో సమావేశాలు నిర్వహించింది. సమావేశాలతో కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోగా, కెసిఆర్‌ను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించడం, ఆ తరువాత రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలతో కేంద్రం దిగివచ్చి 2009 డిసెంబర్ 9వ తేదీ రాత్రి అప్పటి హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేశారు. కేంద్రం ప్రకటనతో ఖంగుతిన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా రాజీనామాలు చేసేందుకు సిద్ధపడగా, తిరిగి కేంద్రం వెనకడుగేసి 2009 డిసెంబర్ 23న తెలంగాణ ప్రకటనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత జస్టిస్ శ్రీకృష్ణ కమిటిని వేసింది. ఆ కమిటి సంవత్సరం పాటు రాష్టమ్రంతటా తిరిగి కేంద్రానికి నివేదిక సమర్పించింది.

జోరుగా వన్యప్రాణుల సంచారం
* అడవిలోని సిసి కెమెరాల్లో రికార్డయన జంతువులు
కడెం, ఫిబ్రవరి 5: ఆదిలాబాద్ జిల్లా కడెం ఫారెస్టు రేంజి పరిధిలో గల కడెం అడవుల్లో గత కొనే్నళ్ళ నుండి అటవీ జంతువులు సంచరిస్తుండడంతో వన్యప్రాణుల సందడి ఎక్కువైంది. కడెం అటవీ ప్రాంతంలో అనేక రకాల అటవీ జంతువులున్నాయి. కడెం అడవుల్లో పెద్దపులి, చిరుత పులులు, మనబోతులు, నీలుగాయిలు, జింకలు, దుప్పులు, ఇతర జంతువులు కూడా ఇటీవల సిసి కెమెరాకు చిక్కాయి. అడవుల్లో వున్న అటవీ జంతువుల కదలికలను సమాచారం తెలుసుకొనేందుకు కడెం అటవీ శాఖ సిబ్బంది అడవుల్లో ఇటీవలే సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. గత రెండు మూడు రోజుల క్రితం దస్తురాబాద్ ఎఫ్‌ఎస్‌ఓ కింగ్‌ఫిషర్ స్థానిక ఎఫ్‌బిఓ కృష్ణచైతన్యలు అడవుల్లో అమర్చిన కెమెరాలకు చిరుత పులి ఆడ, మగ, నీలుగాయిలు, దుప్పులు, అడవి పందులు పలు రకాల పక్షులు, జింకలు చిక్కాయి. దీనితో ఈ ప్రాంతంలో వన్యప్రాణుల, పక్షుల సంచారం తీవ్రంగానే వున్నట్లు అధికారులు గుర్తించారు. మరో పక్క కేంద్ర ప్రభుత్వం జన్నారం మండలం కవ్వాల్ టైగర్ జోన్‌గా ఏర్పాటు చేయడం కడెం అటవీ ప్రాంతాన్ని టైగర్ జోన్‌లో కలపడంతో అభయారణ్యం తయారు కావడంతో పర్యాటక కేంద్రం వలే తయారు కానుంది. దీనితో సందర్శకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. వన్యప్రాణులు, పక్షులు సంచరిస్తుండడంతో వీటిని తిలకించేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా అటవీశాఖ నిర్వహించిన సర్వే పూర్తి స్థాయిలో విజయవంతం కావడం సరైన ఫలితాలు కనిపించడంతో అధికారులు సంతోషంవ్యక్తం చేస్తున్నారు.

హడలెత్తిస్తున్న దొంగనోట్ల చెలామణి..!
* ఆందోళనలో వ్యాపారులు, ప్రజలు * విచారణకు మహారాష్టక్రు వెళ్ళిన పోలీసులు
సిర్పూర్(టి), ఫిబ్రవరి 5: సిర్పూర్ తదితర ప్రాంతాల్లో గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా దొంగనోట్ల చెలామణి కొనసాగుతుండటంతో వ్యాపారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఒక దుకాణంలో వస్తువు కొనుగోలు చేసి ఒకవ్యక్తి రూ.1000, రూ.500, రూ.100 నోట్లు ఇచ్చాడు. అదే రోజు ఆ వ్యాపారి డబ్బులను బ్యాంకులో డిడి కట్టేందుకు వెళ్ళగా బ్యాంకు అధికారులు దొంగ నోటు అని తేల్చడంతో వ్యాపారి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. దీంతో ఏమి చేయాలో పాలుపోక లోలోన మదనపడి రూ.1000 నష్టపోయినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కాగా సిర్పూర్ మండల కేంద్రానికి చుట్టు పక్కల పల్లెల్లోని ప్రజలు నిత్యావసర వస్తువులు, ఇతర వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే రైల్వే స్టేషన్ దగ్గరే ఉండటంతో ప్రజలు, ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపధ్యంలో దొంగనోట్లు చెలామణి చేసే వ్యక్తులు ఇదే అదునుగా భావించి హోటళ్లు, ఎలక్ట్రానిక్, పంపుసెట్ల దుకాణాల్లో దొంగనోట్లను చెలామణి చేస్తుండటంతో ప్రజలు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దొంగనోట్లు అసలు, నకిలీకి పెద్ద తేడా లేకపోవడంతో ప్రజలు, వ్యాపారులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం, వాటిని తీసుకున్న ప్రజలు, వ్యాపారులు బ్యాంకుల్లో వేసేందుకు వెళితే బ్యాంకు అధికారులు దొంగనోట్లుగా తేల్చడంతో మండల వాసులు తలలు పట్టుకున్నారు. ఏమైనప్పటికి దొంగనోట్ల చెలామణితో మండల ప్రజలతో పాటు వ్యాపారులు ఆందోళన చెందడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా రెండు రోజుల క్రితం కౌటాల మండలానికి చెందిన పత్తి రైతు పత్తి విక్రయించేందుకు రాగా అతనికి సైతం దొంగనోట్లు రావడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సిర్పూర్ పోలీసులు పత్తి కొనుగోలు చేసిన వ్యాపారిని విచారించేందుకు మహారాష్టక్రు వెళ్ళారు. గత కొంతకాలంగా దొంగనోట్ల చెలామణి గుట్టు చప్పుడు కాకుండా జోరుగా సాగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కూడా విచారణపై దృష్టిసారించారు.

సీమాంధ్రులు దీక్షలు చేసినంత మాత్రాన తెలంగాణను ఆగదు.. తెలంగాణ నేతలపై దాడులు చేయించడం సిగ్గుచేటు వేములవాడ దేవస్థాన చైర్మెన్ బొమ్మ వెంకటే టి.ఫైనల్ ఫైట్..!
english title: 
cm

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>