Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

దళిత, బలహీన వర్గాల ప్రజలు బిజెపికి అండగా నిలవాలి

$
0
0

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 5: దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు బిజెపికి అండగా నిలవాలని, అందుకు గాను దళిత మోర్చా నాయకులు, కార్యకర్తలు ఇక గ్రామాలలో ఇదే పనిగా పని చేయాలని బిజెపి దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాములు తెలిపారు. బుధవారం బిజెపి జిల్లా కార్యాలయంలో జిల్లా దళిత మోర్చా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాములు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల నుండి వచ్చినటువంటి ఓ సామాన్య వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కావాలంటే బడుగు, బలహీన వర్గాల ప్రజలు బిజెపికి అండగా నిలవాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఉన్నత పదవులు ఒకే కుటుంబానికి కట్టబెడుతున్నారని, వారసత్వ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాలంటే నరేంద్ర మోడీ ప్రధాని కావాలన్నారు. బిజెపిలోని అన్ని వర్గాల ప్రజలు రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారు. రాబోయే 2014 ఎన్నికల్లో దళితులందరిని ఏకం చేసి బిజెపి వైపు మళ్లించాలని, ఇందుకు జిల్లాలోని బిజెపి దళిత మోర్చా నాయకులు నిరంతరంగా కృషి చేయాలని అన్నారు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పార్లమెంట్‌తో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు. తెలంగాణ విషయంలో బిజెపి వెనకడుగు వేయలేదని, సుష్మాస్వరాజ్ మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరించారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీలను ఏ విధంగా అదుపులో పెట్టుకుంటారని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సుష్మాస్వరాజ్ ప్రశ్నించారని అన్నారు. ఈ వ్యాఖ్యలను వేరే విధంగా వక్రీకరించి బిజెపి విధానాన్ని తప్పుబట్టడానికి చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాదిరిగా గల్లీకో విధానం, జిల్లాకో విధానం బిజెపిలో ఉండదని, జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బిజెపిలో ఒకే విధానం ఉంటుందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి బిజెపి అనుకూలమని ఆయన తెలిపారు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే బేషరత్తుగా బిజెపి మద్దతు ఇస్తుందని అన్నారు. ఈ విషయాన్ని తమ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పార్లమెంట్ నాయకురాలు సుష్మాస్వరాజ్ పలు సందర్భాలలో వెల్లడించిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తించుకోవాలని హితవుపలికారు. కాంగ్రెస్ పార్టీది కుటిల విధానమని, నరేంద్ర మోడీ ప్రభంజనాన్ని తట్టుకోలేక దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు. రాష్ట్రంలోని అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతంలో బిజెపి అనూహ్య ఫలితాలను సాధించబోతుందని, మరో 20 రోజుల తర్వాత పలు పార్టీల నాయకులు పెద్దఎత్తున బిజెపిలో చేరబోతున్నారని వెల్లడించారు. భవిష్యత్తు రాజకీయమంతా బిజెపి చేతిలోకి వస్తుందని తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దళితులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు బిజెపికి అండగా నిలుస్తారని, దాంతో కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి, మాజీ మంత్రి పుష్పలీల, మాజీ ఎమ్మెల్యే ఇందిర, నాయకులు ప్రతాప్, సాయిరాం, లక్ష్మణ్, ఎడ్ల కృష్ణయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

44వ జాతీయ రహదారిపై కాల్పులు జరిపిన
దోపిడీ దొంగల ముఠా అరెస్టు
* రెండు పిస్తోళ్లు, మందుగుండు సామాగ్రి స్వాధీనం
* హర్యాన, యూపికి చెందిన దొంగలుగా గుర్తింపు
* విలేఖరుల సమావేశంలో ఎస్పీ నాగేంద్రకుమార్ వెల్లడి

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 5: జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై జనవరి 31వ తేదీన లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపి పరారీ అయిన దారి దోపిడీ దొంగల ముఠాను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అరెస్టు చేసిన దొంగల ముఠా సభ్యులను విలేఖరుల ముందు ఉంచారు. అనంతరం ఎస్పీ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ రాజధాని హైదరాబాద్‌లో ఎన్నో దొంగతనాలకు పాల్పడేందుకు సిద్ధమైన ఆరుగురితో కూడిన దొంగల ముఠాను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన పోలీసులు రెక్కీ నిర్వహించి చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని అన్నారు. దాంతో హైదరాబాద్‌లో పెను ముప్పే తప్పిందని ఆయన వెల్లడించారు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై దారి దోపిడీకి పాల్పడుతూ లారీ డ్రైవర్‌ను పిస్తోల్‌తో కాల్చిన ఘటనలో ఆరుగురు దొంగల ముఠాను అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జాతీయ రహదారులనే ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్న హర్యాన, ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠా సభ్యులుగా గుర్తించడం జరిగిందని అన్నారు. మహ్మద్ జాహిద్, షబ్బీర్ ఖాన్, మహ్మద్ అక్తర్, మహ్మద్ షహిద్‌లు హర్యాన రాష్ట్రంలోని నహామెవెట్ జిల్లాలోని పూహానా తహశీల్ పరిధిలోని సింగర్, తిర్వాద్, ఫిర్జాపూర్ గ్రామాలకు చెందిన దొంగలు అని వెల్లడించారు. అదేవిధంగా మహ్మద్ అస్లాం మాత్రం ఉత్తరప్రదేశ్‌లోని మావాన తహశీల్ పరిధిలోని నాగాల హరిలు గ్రామానికి చెందిన వాడిగా గుర్తించడం జరిగిందని అన్నారు. వీరికి హైదరాబాద్‌లోని షహీబ్‌ఖాన్‌తో పరిచాయాలు ఉన్నాయని, గతంలో వీరంతా కలిసి పలు జాతీయ రహదారులపై దారి దోపిడీ చేశారని ఎస్పీ తెలిపారు. షహిద్‌ఖాన్‌ది రాజస్తాన్ రాష్ట్రంలోని లక్ష్మణ్‌గాడ్ తహశీల్ పరిధిలోని కఫన్‌వాడ గ్రామం అని తెలిపారు. షహిద్‌ఖాన్ హైదరాబాద్‌లోని మెహిదిపట్నం, సులేమాన్‌నగర్, చింతలమేట్, రాజేంద్రనగర్‌లలో తరచూ ఇళ్లు మారుస్తూ నివాసం ఉంటున్నారని తెలిపారు. హర్యాన, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పలు దొంగతనాలలో ప్రధాన నిందితులుగా ఉన్న ఈ ఆరుగురు ముఠా జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై కనె్నశారని ఎస్పీ వెల్లడించారు. జనవరి 29వ తేదీన హైదరాబాద్‌కు చేరుకున్నారని, అంతకుముందు 26వ తేదీన హెచ్‌ఆర్ 769967 నంబర్ గల బొలెరా వాహనాన్ని హర్యానలో దొంగిలించుకుని ఇక్కడికి తీసుకువచ్చారని అన్నారు. 27, 28వ తేదీలలో ముంబాయి జాతీయ రహదారిపై, విజయవాడ జాతీయ రహదారిపై కూడా దొంగతనాలకు పాల్పడ్డారని అన్నారు. అయితే జనవరి 31వ తేదీన వీరి దృష్టి బెంగుళూర్ రహదారిపై పడిందని, అదే రాత్రి హైదరాబాద్ నుంచి రెక్కీ నిర్వహించి జాతీయ రహదారిపైకి వచ్చారని అన్నారు. జడ్చర్ల దగ్గరలోని పోలేపల్లి సమీపంలో ఆగి ఉన్న లారీ దగ్గరకు వెళ్లి డ్రైవర్‌ను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లారీ డ్రైవర్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఎస్పీ వెల్లడించారు. అయితే వీరిని హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ పోలీసులు బృందాలుగా ఏర్పడి పట్టుకోవడం జరిగిందని అన్నారు. దొంగల ముఠా నుండి రెండు పిస్తోళ్లు, 15 రౌండ్ల మందుగుండు సామాగ్రి, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులకు రివార్డులు అందిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* నరేంద్ర మోడీని ప్రధానిని చేయడంలో కీలక భూమిక పోషించాలి * బిజెపి దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాములు
english title: 
d

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>