తార్నాక, ఫిబ్రవరి 6: తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమావేశాలను నిర్వహించి ఎన్నికల నగరాను మోగించడానికి సిద్థంగా ఉంది. ఇందులో భాగంగా నగర అధ్యక్షుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ కార్యాచరణను రూపొందించారు. అంతకుముందు నగర కమిటీతోపాటు అనుబంధ కమిటీలను యువతను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకుని ఎన్నికల బరిలోకి దిగాలని కసరత్తు ముమ్మరం చేశారు. మరికొంత మందికి నగర ప్రధాన కమిటీలో చోటు కల్పిస్తూ గురువారం లిస్టును విడుదల చేశారు. ఇందులో నల్లెల కిశోర్‌కు అదనంగా మీడియా కన్వీనర్‌గా బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా యువత అధ్యక్ష పదవికోసం రేస్‌లో నిలిచిన బిల్డర్ ప్రవీణ్‌ను నగర అధికార ప్రతినిధిగా నియమించారు. అదే విధంగా గంగాధర్‌గౌడ్‌ను కె.శేఖర్‌రెడ్డిలను ప్రచార కార్యదర్శులుగా, కె.నర్సింగ్‌రావు, అరుణగౌడ్, ఎం.ఎ.రజాక్, ఫహీమ్, దినేశ్‌యాదవ్‌లను కార్యనిర్వాహక కార్యదర్శులుగా,పి.చంద్రశేఖర్‌గౌడ్, నగేశ్‌లను కార్యదర్శులుగా నియమిస్తున్నట్లు నగర ఉపాధ్యక్షులు గుర్రం పవన్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శులు ఎం.ఎన్.శ్రీనివాస్, వనం రమేశ్ వెల్లడించారు.
కాగా, ఈనెల 11 నుంచి నిర్వహించ తలపెట్టిన నియోజకవర్గాల సమావేశాలకు పరిశీలకులను నియమించడంతోపాటు ఆయా నియోజకవర్గాల సమావేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇటు జిల్లా కార్యాలయంతోపాటు రాష్టప్రార్టీ కార్యాలయానికి అందించాలన్నారు. గ ఇన్‌చార్జ్‌లుగా ముషీరాబాద్‌కు జి.పవన్‌కుమార్‌గౌడ్, నల్లెలకిశోర్, సుంకరి రవీందర్‌లు, నాంపల్లి నియోజకవర్గానికి భజరంగ్‌శర్మ, విద్యాధర్ అగర్వాల్, యాదగిరిగౌడ్, అంబర్‌పేట్ నియోజకవర్గానికి పి.సాయిబాబా, సామప్రభాకర్‌రెడ్డి, బద్రీనాథ్ యాదవ్, ఖైరతాబాద్‌కు మల్ల్లిఖార్జునగౌడ్, ముప్పిడిమధుకర్, టి.ఎన్.శ్రీనివాస్, మలక్‌పేట్‌కు బి.ఎన్.రెడ్డి, ఎంఎ బాసిత్, పి.బాల్‌రాజ్‌గౌడ్, సికింద్రాబాద్‌కు సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పి.ఎల్.శ్రీనివాస్, శ్రీపతి సతీశ్, జూబ్లీహిల్స్‌కు వనంరమేశ్, ప్రకాశ్ ముదిరాజ్, షాబాజ్ అహ్మద్‌ఖాన్, గోషామహల్‌కు డిపిరెడ్డి, తొలుపునూరిక్రిష్ణాగౌడ్, విజయలక్ష్మీ, చార్మినార్‌కు అంజద్ అలీఖాన్, పి.సత్యనారాయణ, కె.శేఖర్‌రెడ్డి, చాంద్రాయణగుట్టకు ఎం.ఎన్.శ్రీనివాస్, గంగాధర్‌గౌడ్, హేమలత, సికింద్రాబాద్ కంటోనె్మంట్‌కు ఎం. ఆనంద్‌కుమార్‌గౌడ్, కొమురయ్య, సుధాకర్‌గుప్త, బహదూర్‌పురాకు ఎండి అస్లాం, ఎంఎ రజాక్, ఫహీమ్, కార్వాన్‌కు వెంకటరమణ, సదాశివయాదవ్, ఏసూరిసావిత్రి పరిశీలకులుగా వ్యవహరిస్తారని పవన్‌కుమార్‌గౌడ్, ఎం.ఎన్.వనం వివరించారు.
నగర తెలుగుదేశం మరింత బలోపేతం
english title:
tdp
Date:
Friday, February 7, 2014