సరూర్‌నగర్, ఫిబ్రవరి 6: టిడిపి హయాంలోనే మహిళలకు రక్షణ, ఆర్థికాభివృద్ధి జరిగిందని మహేశ్వరం టిడిపి ఇన్‌చార్జి తీగల కృష్ణారెడ్డి అన్నారు. మీర్‌పేటలో గురువారం జరిగిన మహిళా సదస్సులో తీగల మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలోనే డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారని గుర్తుచేశారు. అదేవిధంగా టిడిపి హయాంలో మహిళలపై ఎటువంటి అత్యాచారం వంటి సంఘటనలు చోటుచేసుకోలేదని కాంగ్రెస్ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
నిర్భయ చట్టం వచ్చిన తరువాతనే మహిళలపై లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నిర్భయ, ముంబయిలో అనుహ్య సంఘటనల నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుణపాఠం నేర్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పొదుపుకు సంబంధించిన రుణాలను మంజురు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తీగల అమర్‌నాథ్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, పల్లెపాండ్‌గౌడ్, రవినాయక్, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
-- తీగల కృష్ణారెడ్డి --
english title:
teegala
Date:
Friday, February 7, 2014