చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 6: నగరంలో జరుగుతున్న ఆలిండియా సీనియర్ మహిళల టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్, రైల్వేస్ జట్లు ప్రత్యర్థులపై విజయం సాధించింది దూసుకెళుతున్నాయి. సికింద్రాబాద్ జింఖాన మైదానంలో హైదరాబాద్-ఒడిశా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన మమత కానోజీయా 73 పరుగులతో అర్థ సెంచరీ పూర్తి చేయగా, జి.సింధుజారెడ్డి 27 పరుగులు చేసింది. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేసిన ఒడిశా జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి ఓటమి పాలైంది. సికింద్రాబాద్‌లోని ఎఒసి మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ 4 వికెట్ల తేడాతో మహారాష్టప్రై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 60 పరుగుల స్వల్ప స్కోరు చేసింది. ఆనంతరం బ్యాటింగ్ చేసిన రైల్వేస్ 18.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమించింది.
కిషన్ ప్రసాద్ వనే్డ క్రికెట్ టోర్నీ
గౌలిపురాపై పోస్టల్ గెలుపు
హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న కిషన్ ప్రసాద్ వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో వంద పరుగుల తేడాతో పోస్టల్ క్రికెట్ క్లబ్ ప్రత్యర్థి గౌలిపురాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పోస్టల్ జట్టులో నవిన్ కుమార్‌చారి 74, లెనిన్ 48, ఎం.సురేష్ 33 పరుగులు చేయడంతో నిర్ణీత ఒవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. గౌలిపురా జట్టు బౌలర్లు రోహన్‌బాబు 52 పరుగులకు 5, రఘువీర్ 53 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నారు. ఆనంతరం బ్యాటింగ్ చేసిన గౌలిపురా క్రికెట్ క్లబ్ 159 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌లో హెచ్‌యుసిసి 11పరుగుల తేడాతో ప్రత్యర్థి షాలిమార్ క్రికెట్ క్లబ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హెచ్‌యుసిసి 210 పరుగులు చేయగా, అందుకు జవాబుగా బ్యాటింగ్ చేసిన షాలిమార్ జట్టు 189 పరుగులకు ఆలౌటై విజయ లక్ష్యాన్ని అధిగమించలేక పోయింది.
హెచ్‌సిఎ వనే్డ నాకౌట్ క్రికెట్ బిడిఎల్‌పై ఎన్స్‌కోన్స్ సిసి విజయం
హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న వనే్డ నాకౌట్ (మూడు రోజుల)క్రికెట్ టోర్నమెంట్‌లో ఎన్స్‌కోన్స్ క్రికెట్ క్లబ్ తొమ్మిది వికెట్ల తేడాతో బిడిఎల్‌పై గెలుపొందింది. బిడిఎల్ ముందుగా బ్యాటింగ్ చేసి 191 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ చేసిన ఎన్స్‌కోన్స్ సిసి వికెట్ నష్టానికి 196 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఇతర మ్యాచ్‌ల్లో దక్కన్‌క్రానికల్ 149 పరుగుల తేడాతో ఇఎంసిసిపై, ఎస్‌బిహెచ్ 44 పరుగులతో ఎఒసిపై, ఆంధ్రాబ్యాంక్ 77 పరుగులతో దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ జట్టుపై విజయం సాధించింది.
విద్యుత్ కార్యాలయం ముందు ఉద్యోగుల ధర్నా
కెపిహెచ్‌బి కాలనీ, ఫిబ్రవరి 6: కెపిహెచ్‌బి కాలనీ 3వ ఫేజ్‌లోని డిఇ కార్యాలయం ముందు తమ సమస్యలను పరిష్కరించాలంటూ పలు ఉద్యోగ సంఘాలు రంగారెడ్డిజిల్లా నార్త్ సర్కిల్ జెఎసి ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా జెఎసి చైర్మన్ రాంమోహన్, కన్వీనర్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఉద్యోగస్తుల డిమాండ్లను పరిష్కరించాలని, పిఆర్‌ఎసి కమిటీని వేయడంలోవిఫలమైందంటూ విమర్శించారు. కార్యక్రమంలో కోచైర్మన్ బి.ఆనంద్, ఎఇ గౌరిశంకర్, బాబుసింగ్, మల్లేషం, పి.విఠల్, ప్రమీలారాణి, ఆర్.యాదయ్య, రవి, కుమారస్వామి పాల్గొన్నారు.