Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అండగా నిలిచే ఆ నేత ఎవరు?

$
0
0

విశాఖపట్నం, ఫిబ్రవరి 7: కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ మాదిరిగా ఉంది. రాష్ట్ర విభజనకు కావల్సిన సరంజామాను పార్టీ అధిష్ఠానం సిద్ధం చేస్తోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై తుది నిర్ణయం వెలువడబోతోంది. ఇదే జరిగితే, కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే, నిండా మునిగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర విభజన అంశం ఈమధ్య తెర మీదకు వచ్చింది. అంతకు ముందు నుంచే పార్టీకి నాయకత్వ సమస్య తీవ్రంగా ఉంది. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి దారి వారు చూసుకుని, పార్టీకి జవసత్వాలు లేకుండా చేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు. పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకుల హవా ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీలోని నాయకులే సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఇతర పార్టీలోకి కొంత సమయం తలదాచుకునేందుకు వచ్చిన వారు, వారి అజమాయిషీ విపరీతంగా ఉందని భావించిన కాంగ్రెస్ నాయకులు పార్టీ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా గాలికొదిలేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన బిల్లు తెర మీదకు వచ్చింది. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి పూనుకున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజలే కాదు., పార్టీలోని నాయకులు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. నిద్రలో కూడా కాంగ్రెస్ కండువాను మెడ మీద నుంచి తీయని నాయకులు కూడా పార్టీని విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. వారి వెంట క్యాడర్ ఏమేరకు వెళుతుందో తెలియదు కానీ, పార్టీ మాత్రం దాదాపూ ఖాళీ అయిపోతోంది. ఏదారీ లేని వారు కొంతమంది కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోతున్నారు. మరి వీరి సంగతేంటి? వీరిని ఎవరు పట్టించుకుంటారు? అసలు ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిపెట్టిందా? వచ్చే ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి తగిన అభ్యర్థులే లేరన్నది వాస్తవం.
పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి బాలరాజు ఇదే పార్టీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరో మంత్రి, ఆయన బృందం పార్టీని వీడి వెళ్ళిపోడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టేస్తున్నారు. ఇక పార్టీలో మిగిలిన పాతకాపులలో ద్రోణంరాజు శ్రీనివాస్, బాలరాజు. వీరి భుజస్కందాలపై పార్టీ భారం పడబోతోంది. పూర్తిగా దెబ్బతిన్న పార్టీకి జవసత్వాలు నింపడం అంత సులువు కాదు. కానీ పార్టీనే నమ్ముకుని ఉన్న వారికి మనో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఎవరు నడుంబిగిస్తారో వేచి చూడాలి.

మరో ఆర్నెల్లు కొనసాగ వచ్చా!
విశాఖపట్నం, ఫిబ్రవరి 7: రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన అనివార్యం. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా విభజన జరిగిపోతుంది. అదే జరిగితే, రానున్న సాధారణ ఎన్నికలతోపాటు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. అసెంబ్లీని మరో ఆరు నెలలపాటు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు విడి విడిగా ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. అప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే, ఎమ్మెల్యేగా మిలగలచ్చు. ఇంకా మిగిలిన పనులేవైనా ఉంటే చక్కబెట్టుకోవచ్చని కొంతమంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారట.

సమైక్య ఉద్యమం తీవ్రం
విశాఖపట్నం, ఫిబ్రవరి 7: విశాఖ నగరంలో సమైక్య ఉద్యమం తీవ్రతరమైంది. వరుసగా రెండో రోజు వివిధ రూపాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. విద్యార్థులు, రెవెన్యూ, ఎన్జీవో ఉద్యోగులు రోడ్డెక్కారు. విధులు బహిష్కరించి సమైక్య నినాదాలతో పలు కార్యక్రమాలు చేపట్టారు.
ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో: ఏపీ ఎన్జీవోల సంఘం ఆధ్వర్వంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను తగులబెట్టి మరీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు మాట్లాడుతూ విభజన బిల్లు రాష్టప్రతి నుంచి క్యాబినెట్‌కి రాకుండానే యుపిఏ ప్రభుత్వం విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రచారం చేస్తూ, సీమాంధ్రతోపాటు తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. విభజన బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, తప్పులు, తడకలతో కూడి ఉందని శాసనసభలో వ్యతిరేకించి పంపించిన బిల్లును రాష్టప్రతి న్యాయ సమీక్షకు పంపించాలని క్యాబినెట్‌కి పార్లమెంటుకు పంపించరాదని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
క్యాబినెట్‌లో శుక్రవారం సీమాంధ్ర కేంద్ర క్యాబినెట్ మంత్రులు వ్యతిరేకించేలా తప్పు సవరణలకు లొంగరాదని డిమాండ్ చేశారు. అంతే కాకుండా సీమాంధ్ర కేంద్రమంత్రులు, యమ్‌పిలు పార్లమెంటుకి బిల్లు వస్తే సవరణలు పక్కనపెట్టి, సమైక్యానికి కట్టుబడి వాదనను వినిపించి బిల్లును వ్యతిరేకించాలని లేనిపక్షంలో ప్రజలు వారి నియోజకవర్గాల్లో తిరగనివ్వరని, రాబోయే ఎన్నికల్లో రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తారని హెచ్చరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.రవిశంకర్ మాట్లాడుతూ సవరణలు ప్రజలు కోరలేదని, సమైక్యాన్ని కోరుకుంటున్నారని సమైక్యానికి కట్టుబడి పార్లమెంటులో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. పలు శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులతోపాటు నగర అధ్యక్షుడు కెవి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పివి సత్యనారాయణ, ఎన్‌ఆర్‌ఎం రాజు, డి.శంకర్రావు, ఆర్.రాంబాబు, నిర్వాహక కార్యదర్శి రవికుమార్, సంయుక్త కార్యదర్శి ఐ.ఈశ్వరరావు, కెవి నారాయణరావు, బివియస్ నాయుడు, కోశాధికారి రమేష్‌బాబు, జిల్లా కార్యవర్గం జిల్లా కార్యదర్శి రవికుమార్, ఎల్.కృష్ణమూర్తి, సత్తిబాబు, నిర్మలకుమారి, పిఎం జవహర్‌లాల్ పాల్గొన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది తమ నిరసనను తెలియజేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది సంఘ ప్రతినిధి ఎస్.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలు, ఆయా విభాగాల ఉద్యోగులు, సిబ్బంది పెద్దఎత్తున సమైక్య నినాదాలు చేస్తూ దీనిని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు సత్తి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లోను విధులకు హాజరయ్యేదిలేదని, రెండు రోజుల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులు, ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏయులో సంతకాల సేకరణ: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో విద్యార్థులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి ఆధ్వర్యంలో ఏయు గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన సంతకాల సేకరణలో భాగంగా జెఏసి రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవింద్ మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన పార్లమెంటులో టి-బిల్లును సమైక్యాంధ్ర నేతలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా టి-బిల్లును అడ్డుకుని పార్లమెంటు పార్లమెంటు ఆమోదం పొందకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు. జెఏసి నాయకులు సురేష్‌మీనన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల చలో ఢిల్లీ: ప్రత్యేక తెలంగాణను అడ్డుకుని, రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని కోరుతూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామని సమైక్యాంధ్ర విద్యార్థి, యువజన జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్‌కుమార్ తెలిపారు. జిల్లా పౌరగ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లోను రాష్ట్ర విభజన జరిగితే సహించమని, విడిపోకుండా పోరాడతామన్నారు. తెలంగాణ బిల్లును మూజువాణి ఓటుతో అసెంబ్లీలో ఓడించినా కాంగ్రెస్ దొడ్డిదారిన బిల్లును పాస్ చేయించే ప్రయత్నం చేయడం ఆవివేకమన్నారు. విభజన వల్ల విద్యార్థులు, యువజనులు నష్టపోతారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎప్పటికీ కోలుకోలేని దెబ్బను ప్రజలు కొడతారన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవితతో ఆడుతోందన్నారు. ఢిల్లీ చేరనున్న విద్యార్థులు అక్కడి కార్యాలయాన్ని ముట్టడిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో శకుంతల, ఆర్.సత్యనారాయణ, ఎన్ గోపి, కిరణ్‌కుమార్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంగీతం మోక్షమార్గ సాధనం
ఆరిలోవ, ఫిబ్రవరి 7: శాస్ర్తియ, సంగీత, నృత్య కళలు మోక్షమార్గ సాధనాలని, వీటి రక్షణ అందరి బాధ్యతని భీమిలి ఆనందవనం యోగి సద్గురు కందుకూరి శివానందమూర్తి అన్నారు. ఆంధ్రా మ్యూజిక్ అకాడమీ 14వ వార్షిక సంగీత నృత్యోత్సవాలు శుక్రవారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలను సద్గురు శివానందమూర్తి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిస్టర్స్‌గా ఖ్యాతిపొందిన ప్రఖ్యాత కర్నాటక గాత్ర సంగీత కళాకారిణులు లలిత, హరిప్రియలను సంగీత విద్యానిధి పురస్కారం, బంగారు పతకాలతో సద్గురు, మండలి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్‌వి.సుబ్రహ్మణ్యం ప్రశంసా పత్రాన్ని, అతిథులు సంగీత కళానిధి, సంగీత విద్యానిధి నేదునూరి కృష్ణమూర్తి నూతన వస్త్రాలను, అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ప్రభాకర్‌రావు నగదు పురస్కారాన్ని, అకాడమీ కార్యదర్శి అకాడమీ విశేష వస్త్రాలను, రాఘవేంద్రన్, డాక్టర్ జి.ప్రభాకర్, అయ్యగారి ప్రసన్నకుమార్ శాలువ, జ్ఞాపిక, పుష్పగుచ్ఛాలను లలిత, హరిప్రియలకు అందజేసి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సద్గురు, అకాడమీ కార్యదర్శి పివిఎస్.శేషయ్యశాస్ర్తీ రచించిన సంగీత మంజరి (కర్నాటక శాస్ర్తియ సంగీతలక్ష్య గ్రంథం) పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివానందమూర్తి అనుగ్రహ భాషణ చేశారు. కళ, విద్యలో నిష్ణాతులైన నేదునూరి కృష్ణమూర్తి భారతీయ సంగీత కళానిధి అని ప్రశంసించారు. వాగ్గేయకారుల సేవ కంటే రామదాసు సేవ గొప్పదని అన్నారు. లలిత, హరిప్రియలను సత్కరించడం సంగీత సరస్వతిని గౌరవించడమేనని అన్నారు. మండలి మాట్లాడుతూ తెలుగుభాషా రంగాల పరిరక్షణ సేవలకు సంబంధించి సద్గురు చేసిన సూచనలను తాను పాటిస్తున్నట్లు తెలిపారు. సంగీత జ్యోతి ఆరిపోకుండా సద్గురువు కాపాడుతున్నారని అన్నారు. సద్గురు ఆశీస్సులతో 14 ఏళ్ళుగా అకాడమీ కళాసేవను ఆయన ప్రశంసించారు. సంగీత, లలిత కళ, సాహిత్య అకాడమీలను సిఎం ఏర్పాటు చేసి, జిల్లాకు కోటి రూపాయలు కేటాయించారన్నారు. తెలుగుభాషా వికాస సంవత్సరంగా ప్రకటించారన్నారు. సంగీత కళానిధి నేదునూరి మాట్లాడుతూ తెలుగులో సంగీత కళాకారులు అధికంగా ఉన్నారని అన్నారు. భజన సాంప్రదాయం తాళ్ళపాకలో పుట్టిందని, వాగ్గేయకారులు అక్కడే పుట్టారని అన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్‌వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగువారు సహజ సంగీతానికి వారసులని అన్నారు. దైవసన్నిధిని చేరుకోవడానికి సంగీతం మార్గమని అన్నారు.
అమృతమయం
హైదరాబాద్ సిస్టర్స్ గానం
జలజాక్ష....హంసధ్వని రాగవర్ణంతో లలిత, హరిప్రియల కర్నాటక గాత్ర సంగీత కచేరి ప్రారంభమైంది. అనంతరం నీకేల దయరాదూ...., బాగాయనయ్యా....వంటి కృతులు, కీర్తనలను అమృతమయంగా గానం చేసి సంగీత ప్రియులను అలరించారు.
ద్వారం సత్యనారాయంరావు వయోలిన్‌పై, డిఎస్‌ఆర్.మూర్తి మృదంగంపై, బి.జనార్థన్ ఘటంపై చక్కని లయవాద్య సంగీతం అందించి ఆహూతులను అలరించారు. డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అధికసంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు.

స్వార్ధ ప్రయోజనాలతో సమైక్యాంధ్రకు తూట్లు
* మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు
కొయ్యూరు, ఫిబ్రవరి 7: ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ రాజకీయ ఆర్ధిక, స్వార్థ ప్రయోజనాలతో సమైక్యవాదానికి తూట్లు పొడుస్తూ ముఖ్యమంత్రి, రాష్ట్ర,, కేంద్ర మంత్రులు బాధ్యతలను విస్మరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. కాకరపాడులో స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వ లోపంతో పరిపాలన కరవైందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర మంత్రులు వారివారి ప్రాంతాలకే మంత్రులుగా వ్యవహరిస్తున్నారు తప్పితే రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించడం లేదని విమర్శించారు. అధికారులు సైతం మంత్రుల అదుపు తప్పి పని చేస్తున్నారన్నారు. రోజుకు నాలుగైదు గంటలు కూడా విద్యుత్ ఇవ్వలేని పరిస్థితుల్లో మన రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు, పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, తద్వారా చదువుకున్న వారంతా నిరుద్యోగులై ఆటోలు నడుపుకొనే పరిస్థితి వచ్చిందన్నారు. సమైక్యవాదులుగా రాజ్యసభకు బలపర్చిన ప్రభాకర్‌రెడ్డి, చైతన్యరాజులను పోటీ నుండి విరమింప చేశారన్నారు. నిజంగా ముఖ్యమంత్రి సమైక్యవాదే అయితే ప్రభాకర్‌రెడ్డిని గెలిపించినట్లైతే సోనియాకు చెంప పెట్టులా ఉండేదన్నారు. కేంద్ర మంత్రులు కూడా వివిధ కుంభకోణాల్లో చిక్కుకున్నారన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ఫలితం శూన్యమన్నారు. వేసవి సమీపిస్తుండడంతో తాగునీటి ఎద్దడికై అధికారులతో సమీక్షించి చర్యలు చేపట్టాల్సిన మంత్రులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు సి.ఎం. కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, మండల అధ్యక్షుడు బకీర్‌ఖాన్ తెలుగు యువత నేత చిరంజీవి పాల్గొన్నారు.

కోతి స్వైరవిహారం
* 15 మందికి గాయాలు
దేవరాపల్లి, ఫిబ్రవరి 7: దేవరాపల్లిలో కోతి స్వైరవిహారం చేసి 15 మందిని గాయాలపాలు చేసింది. గత నాలుగు రోజులుగా ఎక్కడినుండో ఊ ర్లోకి వచ్చిన కోతి స్థానికులను భయాందోళనలకు గురిచేస్తుంది. కోతి దాడిలో నమ్మి అ ప్పలనాయుడు (8), మనోహర్ (8), ఎ.్భవానీ (16). సిహెచ్ గౌరినాయుడు, బి. మనోహర్ కుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. మరో పదిమంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. కోతి గ్రా మాల్లో బీభత్సం సృష్టిస్తున్నా ఎవరూ నివారించలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు కోతి చేష్టలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

టెన్త్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి
* డిఇఒ లింగేశ్వరరెడ్డి
చోడవరం, ఫిబ్రవరి 7: పదవ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయ సిబ్బంది కృషిచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి బి. లింగేశ్వర రెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే నవోదయ పరీక్షల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నవోదయా పరీక్షలకు ఎంతమంది హాజరవుతున్నారు, పదవ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది సిలబస్‌ను పూర్తిచేశారా? లేదా అన్న విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాశీవిశ్వనాథం మాట్లాడుతూ డిసెంబర్ నాటికే సిలబస్ పూర్తిచేశామని తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను సి,డి గ్రేడ్‌లుగా గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా శ్రద్ధచూపాలన్నారు. అనంతరం విలేఖరులతో డిఇఒ మాట్లాడుతూ ఈ ఏడాది పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 50 వేల మంది రెగ్యులర్, ఐదువేల మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, దీనికోసం 265 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మరింత నైపుణ్యతను పెంపొందించేందుకు స్టడీమెటిరియల్ అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేరీరత్నం, ఎంఇఒ ఎన్‌ఎల్‌వి ప్రసాద్ పాల్గొన్నారు.

రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బిజెపి రైల్‌రోకో
అనకాపల్లి, ఫిబ్రవరి 7: గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కావాలంటే గ్రామాల్లో రైతులు సుభిక్షంగా ఉండాలని, రైతులు పండించే పంటను ఎక్కడైనా అమ్ముకునే హక్కు కల్పించాలని, రైతుహక్కుచట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కోరుతూ యుపిఎ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రైతు ఆగ్రహ రైల్‌రోకో నిర్వహించారు. గిట్టుబాటు ధరలు లేక రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపురించాయని, చాలా ప్రాంతాల్లో రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరలేక, అప్పులు చేసి పంటలను పం డించలేక క్రాఫ్ హాలీడేను ప్రకటించుకుంటున్నారని కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు గంగుపాం సన్యాశిరావు, కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కొణతాల సత్యనారాయణ అన్నారు. 60ఏళ్లు నిండిన ప్రతీ రైతుకు పెన్షన్ కల్పించాలని, పత్తి, చెరకు, జీడి, మా మి డి, దుంప, పామాయిల్ వాణిజ్య పం టలు పండించే రైతుల సమస్యలపై కలెక్టర్ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. ఉపాధి హామీ పధకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, రెవెన్యూ రికార్డులు పారదర్శకంగా ఉండి వాటిద్వారా భూమి వివరాలు రైతులకు క్షేత్ర పరిశీలన ద్వారా తెలియజేసి వారికి హక్కును కల్పించాలని, లక్షల ఎకరాల్లో భూ పంపిణీ చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎంత భూమి పంపిణీ చేశారో మండలాల వారీగా మండల ఆఫీసుల్లో పేర్లతో కూడిన బోర్డులు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈగల వెంకటేశ్వరరావు, జి.్భక్తసాయిరాం, కొణతాల అప్పలరాజు పాల్గొన్నారు.

రెల్లి కాలనీలో 30 మందికి అస్వస్థత
పాయకరావుపేట, ఫిబ్రవరి 7: పట్టణంలోని రెల్లికాలనీలో శుక్రవారం 30 మంది కాలనీ వాసులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి నుంచి వీరికి అనుకోకుండా జ్వరం, వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు మాత్రం ఇంటివద్దనే చికిత్స పొందుతున్నారు. అంద రూ ఒకేసారి అస్వస్థతకు గురి కావడానికి కారణాలు తెలియరాలేదు. వాటర్ ట్యాంకు నీటివల్ల, మురికికాలువలు, కబేళా, పందులు,కుక్కలు కారణంగా రోగాల బారిన పడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో మామిడి నాగమణి, కశింకోట అప్పలనర్స, భూపతి సత్యవతి, కారింగి అప్పలనర్స, కారింగి సాయమ్మ, తుమ్మి చాముండి, బంగారి సింహాచలం, ఎం.విజయ, ఎం.కుమారి, ఎం.జ్యోతి, బంగారి భవాని, తుమ్మి రాజు, తుమ్మి తారకరామారావు, మామిడి దుర్గ వాంతులు, విరోచనాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డి.వెంకటరమణ ఆధ్వర్యంలో సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ మాదిరిగా ఉంది. రాష్ట్ర విభజనకు కావల్సిన
english title: 
anda evaru?

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles