
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: తెలంగాణ అనుకూల,ప్రతికూల నినాదాల హోరులో పార్లమెంటు ఉభయ సభలు శుక్రవారం కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. కేంద్ర ప్రభుత్వంపై ఎంపిలు హర్షకుమార్ (కాంగ్రెస్), మేకపాటి రాజమోహన్ రెడ్డి (వైకాపా), వేణుగోపాల్ రెడ్డి (టిడిపి) అవిశ్వాస తీర్మానాలు ఇచ్చినప్పటికీ గందరగోళం కారణంగా లోక్‌సభలో చర్చకు అవకాశం లేకుండా పోయింది. తెలంగాణ, సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం, వైకాపా సభ్యులు పోడియంకు ఇరువైపులా నిలబడి బిగ్గరగా ఇవ్వటంతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. వీరు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన గళం వినిపించడంతో సభా కార్యక్రమాలు స్తంభించిపోయాయి. తొలుత లోక్‌సభ ఒక సారి, రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడినా పరిస్థితులు అదుపులోకి రాకపోవటంతోపాటు సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభలో స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభలో అధ్యక్షుడు హమీద్ అన్సారీ పోడియం వద్ద నినాదాలు ఎంపీలను శాంతింపజేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లోక్‌సభలో నినాదాలు చేస్తున్న సీమాంధ్ర, తెలంగాణ ఎంపిలు ఒకరినొకరు తోసుకోవడం కనిపించింది.
ఉదయం పదకొండు గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. మొదటి ప్రశ్నను చర్చకు చేపట్టగానే సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపిలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట రామిరెడ్డి, సాయి ప్రతాప్, టిడిపికి చెందిన నారాయణ రావు, నిమ్మల కిష్టప్ప, వేణుగోపాల్ రెడ్డి, శివప్రసాద్, వైకాపా సభ్యులు జగన్‌మోహన్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఎస్‌పివై రెడ్డి పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేయాలంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వటంతో సభలో గందరగోళం నెలకొని, ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఆగిపోయింది. దీంతో స్పీకర్ మీరాకుమార్ సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగానే ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేశారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే కాంగ్రెస్, తెలుగుదేశం, వైకాపా సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులను చర్చకు చేపట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజయ్య, సురేశ్ షేట్కర్, అంజన్ కుమార్ యాదవ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందా జగన్నాథం తదితరులు పోడియం వద్దకు వచ్చి ‘జై తెలంగాణ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మరోవైపు సమాజ్‌వాదీ, అన్నా డిఎంకె సభ్యులు కూడా పోడియం వద్ద నిలబడి తమ డిమాండ్లపై నినాదాలు ఇవ్వటంతో సభలో గందరగోళం నెలకొంది. సభ అదుపులో లేనందున అవిశ్వాస తీర్మానాలను చర్చకు చేపట్టలేకపోతున్నామని మీరాకుమార్ ప్రకటించారు. ఆ తరువాత ఆమె ఇతర కార్యక్రమాలు చేపట్టేందుకు యత్నించగా, సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకటరామిరెడ్డి, సాయిప్రతాప్, రాయపాటి సాంబశివరావు,సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, తెలుగుదేశం సభ్యులు నారాయణ రావు, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, వైకాపాకు చెందిన జగన్‌మోహన్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి,ఎస్‌పివై రెడ్డి పోడియం వద్ద ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూనే సీమాంధ్ర, తెలంగాణ ఎంపిలు పరస్పరం తోసుకున్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు, టిఆర్‌ఎస్ సభ్యుడు కె.చంద్రశేఖర రావు, విజయశాంతి తమ సీట్ల వద్ద నిలబడ్డారు. ఈ గందరగోళంలోనే స్పీకర్ ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేశారు. ఆ తరువాత ఆమె సభను సోమవారానికి వాయిదా వేసి వెళ్లిపోయారు.
రాజ్యసభలో కూడా ఇదే తంతు కొనసాగింది. టిడిపి ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్ పోడియం వద్ద నినాదాలు ఇవ్వటంతో గందరగోళం ఏర్పడింది. రాజ్యసభ ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే ఇద్దరు తెలుగుదేశం సభ్యులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు ఇచ్చారు. అన్నా డిఎంకె సభ్యులు కూడా వారి డిమాండ్లపై ఆందోళనకు దిగడంతో చైర్మన్ హమీద్ అన్సారీ సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా ఇదే తంతు కొనసాగి మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. మధ్యాహ్నం కూడా తెలుగుదేశం సభ్యులు గొడవ చేయటంతో రాజ్యసభ సోమవారం ఉదయానికి వాయిదా ప
లోక్‌సభలో శుక్రవారం చోటుచేసుకున్న గందరగోళ దృశ్యం