అజిత్‌సింగ్‌నగర్, ఫిబ్రవరి 8: రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విభజనను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లారుూస్ నిరవధిక సమ్మెకు సిద్ధవౌతున్నారు. ఈనెల 12 నుండి సీమాంధ్ర జిల్లాలలోని 104 మున్సిపాల్టీలతోపాటు 14 కార్పొరేషన్‌లలో పనిచేసే సుమారు యాభై వేల మంది ఉద్యోగ, కార్మికులు ఈ సమ్మె చేపట్టనున్నారు. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం నగరంలోని మున్సిపల్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన ఎపి మున్సిపల్ ఎంప్లారుూస్ యూనియన్ జెఎసి కార్యవర్గ సమావేశంలో యూనియన్ నాయకులు తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.
ఈసందర్భంగా భీమవరానికి చెందిన ఎస్ కృష్ణమోహన్ ను కన్వీనర్‌గాను, కెఎల్ వర్మ (తిరుపతి) కార్యదర్శిగాను, స్టేట్ కో కన్వీనర్‌గా విజయవాడ నగర పాలక సంస్థకు చెందిన డి ఈశ్వర్‌ను నియమిస్తూ కార్యవర్గం తీర్మానించింది. సీమాంధ్ర ప్రజల భవిష్యత్తును, ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా ఉన్న విభజన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ చేపడుతున్న ఎపి ఎన్‌జీవోల నిరవధిక సమ్మెకు బాసటగా ఇప్పటికే విధుల బహిష్కరణ చేసిన మున్సిపల్ ఎంప్లారుూస్ ఆందోళనలతోనే పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పౌర సేవలు నిలచిపోగా ఈనెల 12 నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెతో పౌర సేవలతోపాటు పారిశుద్ధ్య సేవలను సైతం నిలిపివేసి ప్రజా పాలనను స్థంభింపచేసి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకు చేపడుతున్న ఈ సమ్మెకు ప్రజలు కూడా తమకు మద్దతు పలికి సహకరించాలని జెఎసి నాయకులు కోరుతున్నారు.
* మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నిలిచిపోనున్న పౌరసేవలు * 12 నుండి మున్సిపల్ ఎంప్లారుూస్ నిరవధిక సమ్మె
english title:
a
Date:
Sunday, February 9, 2014