భీమవరం, ఫిబ్రవరి 8: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై ఆదివారం తొలిసారిగా జిల్లాకు వస్తుండడంతో ఆ పార్టీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా జిల్లా అంతటా భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి విమానం ద్వారా సీతారామలక్ష్మి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వస్తారు. అక్కడినుండి హనుమాన్‌జంక్షన్‌కు చేరుకుని ఆంజనేయస్వామికి పూజలు చేస్తారు. అక్కడ నుండి మోటారు సైకిల్ ర్యాలీ, భారీ వాహనాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తారు. ప్రతి నియోజకవర్గంలోను పార్టీ నాయకులను, కార్యకర్తలను స్వయంగా కలుసుకుని నారాయణపురం, గణపవరం మీదుగా భీమవరంలోని ఆమె స్వగృహానికి చేరుకుంటారు.
భీమవరం నేతల అభినందనలు
రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి భీమవరం ప్రాంత నేతలు అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న ఆమెను భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెంటే పార్థసారథి, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి తోట భోగయ్య, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి గనిరెడ్డి త్రినాథ్, జిల్లా నాయకులు మామిడిశెట్టి ప్రసాద్ తదితరులు కలిసి పుష్పగుచ్ఛాలు అందచేసి శుభాకాంక్షలు తెలియచేశారు. వారితోపాటు జిల్లాలోని 15 నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కన్వీనర్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెంటే పార్థసారథి మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందనడానికి సీతారామలక్ష్మికి రాజ్యసభ సభ్యత్వం లభించడమే నిదర్శనమన్నారు.
తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై ఆదివారం తొలిసారిగా
english title:
n
Date:
Sunday, February 9, 2014