భీమవరం, ఫిబ్రవరి 8: సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయాలని భీమవరం జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కేంద్ర ప్రభుత్వం టి.బిల్లును ఆమోదిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలో భారీ ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలు చేశారు. ముందుగా రవీంద్ర కానె్వంట్, వండర్‌కిడ్స్ స్కూల్, శ్రీ విద్య ఒకేషనల్ కళాశాలలోని సుమారు 2 వేల మంది విద్యార్థులతో పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రకాశం చౌక్‌లో జెఎసి నాయకులు మోకాళ్లపై నిలబడి ప్రదర్శన చేశారు. అలాగే ఎపిఎన్జీఒలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడవ రోజు రిలే నిరాహారదీక్ష కొనసాగింది. చెరుకువాడ రంగసాయి, ఎన్‌విఆర్ దాస్, జంపన ఫణిబాబు, అల్లు శ్రీనివాస్, బాబ్జి, మురళి, గొంట్లా సత్యనారాయణ, ఆయా విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదే విధంగా స్థానిక ప్రకాశం చౌక్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి భీమవరం శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ గడ్డిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వడ్డి సుబ్బారావు, గంటా సుందర్‌కుమార్, నసీమా బేగం, కంభంపాటి బాబ్జీ, జంపన ఫణిబాబు, గోపు రమాభారతి, ఎంవిఆర్ అప్పాజీ, నల్లం గంగాధర్, గొంట్లా సత్యనారాయణ, ఆలీషా, ఎస్ సాదిక్ బాషా పాల్గొన్నారు.
పదవులు కావాలా... ప్రజలు కావాలా
ఏలూరు: పదవులు కావాలో, ప్రజలు కావాలో నాయకులే తేల్చుకోవాలని ఉపాధ్యాయ జెఎసి కన్వీనర్ పి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. సమైక్యాంధ్ర సాధనలో భాగంగా ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో శనివారం స్థానిక జడ్పీ వద్ద ఉపాధ్యాయులు రాష్ట్ర విభజన వ్యతిరేక నినాదాలు చేస్తూ మోకాళ్లపై నిలబడి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కోట్లాది మంది దేశం కోసం, దేశ సమగ్రత కోసం ఆలోచిస్తూ రోడ్లపై రాష్ట్ర విభజన వ్యతిరేక నినాదాలు చేస్తూ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా వుంటే కేంద్ర మంత్రులు ఇంకా ఆలోచిస్తున్నారన్నారు. వారికి తమ పదవులు కావాలో, ప్రజలు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో నాయకులు జి రాంబాబు, శుభాకరరత్నం, పూర్ణశ్రీ, భాస్కరలక్ష్మి, ఎన్‌కెడి శ్రీనివాసరావు, విజయకుమార్, హనుమంతరావు, తామాడ అప్పారావు, కెవివి సత్యనారాయణ, అనిల్, విద్యార్దినులు రమాదేవి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయాలని భీమవరం జెఎసి నాయకులు డిమాండ్
english title:
b
Date:
Sunday, February 9, 2014