తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 8: గూడెం రైల్వే స్టేషన్‌లో మరిన్ని సూపర్‌ఫాస్ట్ రైళ్లకు త్వరలో హాల్ట్‌లు రానున్నాయని ఎమ్మెల్యే ఈలి నాని పేర్కొన్నారు. శనివారం ఉదయం యశ్వంత్‌పూర్- హౌరా రైలుకు హాల్ట్ ఇచ్చిన సందర్భంగా పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు కూడా త్వరలో హాల్ట్ ఇవ్వనున్నారన్నారు. సాయంత్రం హౌరా నుండి యశ్వంత్‌పూర్ వేళ్లే రైలుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకోట తాతాజీ జెండా ఊపారు.
మార్పిడితోనే లాభాల పంట
ఏలూరు, ఫిబ్రవరి 8: పంట మార్పిడి విధానాన్ని అమలు చేసినప్పుడే రైతులు లాభాల బాటలో ముందుంటారని జిల్లా కలెక్టరు సిద్ధార్ధ్‌జైన్ అన్నారు. స్ధానిక కలెక్టరేట్‌లో శనివారం రాత్రి మహారాష్టల్రోని నాగపూర్‌లో జరిగే జాతీయస్ధాయి వ్యవసాయ సదస్సుకు జిల్లా నుండి వెళ్లే 120మంది రైతుల బృందంతో కలెక్టరు మాట్లాడారు. ఎంతోకాలం నుండి వరి పంటకు అలవాటుపడి తరచు తుపాన్లు, వరదలతో నష్టాల ఊబిలో చిక్కుకుంటూ కష్టాలతో కాలం గడుపుతున్న రైతుల ఆలోచనావిధానంలో మార్పు రావాలని అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. ఒకే పంట వేయటం వల్ల భూసారం తగ్గి పంట దిగుబడి రాక రైతు ఆర్ధికంగా నష్టపోతున్నాడని, ఈ పరిస్ధితి నుండి బయటపడాలంటే విదిగా పంటమార్పిడి విధానాన్ని దశలవారీగా అమలు చేయాలని కలెక్టరు రైతులను కోరారు. జిల్లాలో భూముల సారంపై మట్టి నమూనాలను అధికారులు సేకరించి ఏడాదికో, రెండేళ్లకో దాని నివేదికలను రైతుకు అందించటం వల్ల లాభం లేదని, మట్టి నమూనాలను సేకరించి వెంటనే నివేదిక ఇస్తే రైతులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వీలు ఉంటుందన్నారు. జిల్లాలో భూసార పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో ఇందిరాక్రాంతిపధం సభ్యులతో రసాయినిక ఎరువుల వాడకాన్ని ఏవిధంగా తగ్గించాలనే విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. మార్కెట్‌లో చిరుధాన్యాలకు మంచి గిరాకీ ఉందని, మెట్టప్రాంతంలో మొక్కజొన్న ఇతర చిరుధాన్యాల పంటల పెంపకంపై రైతులను చైతన్యపర్చాలన్నారు.
ఏకైక కలెక్టరును నేనే
జిల్లా చరిత్రలో స్వల్పకాలంలో భారీవర్షాలు, మూడు తుపాన్లు చవిచూసిన ఏకైక కలెక్టరును నేనే అవుతానని, నాలుగు గంటల వ్యవధిలో మూడులక్షల ఎకరాల్లో పంటలు సర్వనాశనం అయిన తీరు తాను కళ్లారా చూసానని, రైతు బాధ ఏమిటో అర్ధమైందన్నారు. ఇటువంటి పరిస్దితి జిల్లా రైతాంగానికి మరో 40 ఏళ్లలో రాకుండా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నానని సిద్ధార్ధ్‌జైన్ పేర్కొన్నారు. జిల్లాలో దాళ్వా పంట కోసం బంగారు భవిష్యత్‌ను రైతులు నాశనం చేసుకుంటున్నారని, డెల్టా ఆధునీకరణకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి అయిదుసంవత్సరాలు అవుతున్నా జిల్లాలో ఈపనులు జరగటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే దాళ్వా పంట ఖచ్చితంగా రైతులు వదులుకుని తీరితే డెల్టా ఆధునీకరణ పనులు 90శాతం పూర్తి చేసి ఎటువంటి తుపాను వచ్చినా త్వరితగతిన నీరు సముద్రంలో కలిసేలా చేయవచ్చునన్నారు. జిల్లాలో మార్చి 31న కాల్వలు కట్టివేయటం జరుగుతుందని, రైతులు ఈలోగానే తమ పంటలను పూర్తి చేసుకోవాలని కలెక్టరు సూచించారు. జూన్ 1వ తేదీన కాల్వలకు సేద్యపునీరు విడుదల చేసి అక్టోబర్ 15వ తేదీనాటికి ఖరీప్ పంట పూర్తి చేసుకునేలా చర్యలు చేపడతామని, అక్కడ నుండి డెల్టా ఆధునీకరణ పనులు ఆలస్యం లేకుండా పూర్తి చేస్తామని, ఇందుకు రైతులు సహకరించాలన్నారు.
యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌కు హాల్టు
english title:
g
Date:
Sunday, February 9, 2014