వీరవాసరం, ఫిబ్రవరి 8: వీరవాసరం శ్రీ వీరేశ్వర విశే్వశ్వర, శ్రీ కనకదుర్గ శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో నూతన నవగహ్ర మండప ప్రతిష్ఠ కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. గ్రామానికి చెందిన మద్దాల సత్యనారాయణ (మందుల కొట్టు సత్యం), దేవి సరోజిని దంపతుల ఆర్థిక సహాయంతో నూతన నవగ్రహ మండపాన్ని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేస్తున్నారు. నూతనంగా నిర్మించిన నవగ్రహ మండపంలో సోమవారం నవగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇందులో భాగంలో శనివారం గణపతి హోమం, పూజలు ప్రారంభించారు. ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు వేదమంత్రాలతో గ్రామం పులకించిపోయింది. ఆలయ ఇఒ సిహెచ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
పోలవరం, ఫిబ్రవరి 8: పాపికొండలు అభయారణ్యం టెరిటోరియల్, వన్యప్రాణి విభాగం పర్యవేక్షణలో ఉందని, దానిని పూర్తిగా వన్యప్రాణి విభాగానికి అప్పగించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వైల్డ్‌లైఫ్ కన్జర్వేటర్ ఎస్ శ్రీ్ధర్ అన్నారు. పోలవరం అటవీ శాఖ కార్యాలయానికి శనివారం విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పాపికొండలు అభయారణ్యాన్ని జాతీయ పార్కుగా ప్రకటించారని, అందులోని జంతువులను గుర్తించేందుకు ట్రాప్ కెమారాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. వీటి కోసం రూ.5లక్షలు వెచ్చించి ఇన్‌ఫ్రాయిడ్ కెమెరాలు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. తన పరిధిలోని గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఖమ్మం జిల్లాల్లోని సేంచరీ ఏరియా ఉన్నట్లు ఆయన తెలిపారు. కొల్లేరులో 210 రకాల పక్షులు ఉన్నాయని, 20శాతం పక్షులు మార్చి నెలాఖరుకు ఇతర దేశాలకు వలస వెళ్లతాయన్నారు. గతంలో జరిగిన జంతు గణనలో దేశంలో 1700 పులులు ఉన్నట్లు గుర్తించామన్నారు. పాపికొండలు అభయారణ్యంలో పులులు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి తప్పిస్తే, చూసిన వారెవరూ లేరని, వాటిని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఆయన వెంట డిఎఫ్‌ఒ కెవిఎన్ కుమార్, రంపచోడవరం రేంజర్ పివి కుమార్, డిఆర్వో అబ్బాస్ తదితరులు ఉన్నారు.
మైక్రోగ్రిడ్ టెక్నాలజీతో
విద్యుత్ సవాళ్లకు పరిష్కారం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 8: మైక్రోగ్రిడ్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగంలో తీసుకువస్తే విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్, సరఫరా, వినియోగాల్లో ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించవచ్చని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, ఆపరేషన్స్ ఎడిఇ ఆర్ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ సౌజన్యంలో శనివారం తుందుర్రు జివిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో చాలెంజెస్ అండ్ అప్రోచెస్ ఇన్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఇన్ మైక్రోగ్రిడ్స్ (ఎన్‌సిఎపిఐఎంజి-2014) జాతీయ సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ ఎన్‌జికె మూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ళ క్రితం విద్యుత్ విలాస వస్తువు అని, కొద్దిమందికే అందుబాటులో ఉండేదని, కానీ నేడు నిత్యావసర సరుకుగా, ప్రాథమిక అవసరంగా మారిందన్నారు. ప్రతి పౌరుడికి విద్యుత్ అందించాలని ప్రభుత్వం 1991, 2003 సంవత్సరాల్లో చట్టాలు చేసిందన్నారు. కానీ విద్యుత్ ఉత్పత్తికి, డిమాండ్‌కు, సరఫరాకు వ్యత్యాసాలు ఒకవైపు, గ్రిడ్ వైఫల్యాలు మరోవైపు సవాళ్ళుగా ఉన్నాయన్నారు. వీటన్నింటినీ అధిగమించాలంటే మైక్రోగ్రిడ్ టెక్నాలజీని అందుబాటులోకి రావాలన్నారు. ఈ దిశగా కృషిచేయాలన్నారు. మరో అతిథి విజయవాడ సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్. పద్మనాభరాజు మాట్లాడుతూ మైక్రోగిడ్స్‌పై జరుగుతున్న జాతీయ సదస్సుకు సరికొత్త ప్రాజెక్టులకు దిశానిర్దేశం కల్పించాలన్నారు. సదస్సులో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గ్రంధి సురేష్, జాయింట్ సెక్రటరీ ఆరేటి కాశీవిశే్వశ్వరరావు, డైరెక్టర్ వైవిఎస్ అప్పారావు, ట్రిబుల్ ఇ హెడ్ వై వీర్రాజు, సదస్సు కన్వీనర్ సిహెచ్ వీరభద్రరావు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు వివిధ అంశాల్లో న్యాయమూర్తుల సమక్షంలో పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, క్విజ్, టెక్నికల్ ప్రజెంటేషన్‌లు ప్రదర్శించారు.
ఎన్జీవోల భవనం వారికే అప్పగించడానికి కృషి
పాలకొల్లు, ఫిబ్రవరి 8: పార్కుకు కేటాయించిన స్థలంలో ఉన్న ఎన్జీవోల భవనం ఎన్జీవోలకు తిరిగి అప్పగించడానికి కృషిచేస్తామని ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఎన్జీవోలకు హామీ ఇచ్చారు. శనివారం విఆర్వో భవనంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొన్నారు. 1992లో ఎన్జీవోలు సొంత భవన నిర్మాణం చేసుకున్నారని, అప్పటి ఎమ్మెల్యే చేగొండి వెంకట హరిరామజోగయ్య, జిల్లా కలెక్టర్ కల్లాం చేతుల మీదుగా ప్రారంభించారని ఎన్జీవో సంఘ నాయకుడు గుడాల హరిబాబు వివరించారు. ఉద్యోగుల సమస్యలు చర్చించటానికి భవనం అససరముందని ఆయన చెప్పారు. ఈ భవనం, దానిలో ఉన్న ఫర్నీచర్ పాడైందని, వాటిని పునురుద్ధరించడానికి అవకాశం కల్పించాలని వారు కోరారు. రామగుండం పార్కు ఏర్పాటుకు ఈ భవనాన్ని స్టోరు రూమ్‌గా వినియోగించుకున్నారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కెవిఆర్‌ఆర్ రాజు, తహసీల్దార్ పి వెంకట్రావు, ఎఎంసి ఛైర్మన్ కపర్ధి, ఎన్జీవో ఎమ్మార్కె రాజు, ఎవి రామాంజనేయులు, దాక్షాయని, జె శ్రీనివాస్, షేక్ లాల్ భాషా, పుష్పలత, మోహనరావు, మేడికొండ రాందాసు, సిహెచ్.శ్రీనివాస్, వెంకటలక్ష్మి, కె.సత్యనారాయణ, శివరామాంజనేయులు, వి.ఆంజనేయులు, మండెల నరసింహారావు, డాక్టర్ వర్మ తదితరులు పాల్గొన్నా