తాళ్లపూడి, ఫిబ్రవరి 8: మండలంలో నిర్మించబోయే చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం తమ రైతులకు చింతనే మిగులుస్తోందని పోచవరం రైతాంగం వాపోతోంది. హైకోర్టు నుండి తీర్పు వచ్చినా ఇంజనీరింగ్ అధికారులు తమని వదలిపెట్టడం లేదని వారు వాపోతున్నారు. పంప్ హౌస్ నిర్మాణంతోపాటు పైప్‌లైన్ ఎన్‌లైన్‌మెంట్లు కూడా పలుమార్లు మార్చి తమని ఇబ్బంది పెడుతున్నారంటూ దుగ్గిరాల వెంకట్రామారావు వాపోతున్నారు. ఇటీవల పైప్‌లైన్ ఎన్‌లైన్‌మెంట్‌కు సంబంధించి భూ సేకరణ విడుదల చేశారు. 2011లో వేరే ప్రాంతంలో భూమి స్వాధీనం చేసుకుంటామని నోటీసులు జారీచేసి, అప్పటి రైతాంగం ఆందోళనతో ఆ ప్లాన్‌ను, ఎలైన్‌మెంట్‌ను మార్పులు చేశారు. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు పూర్తిగా భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, దీనిపై కోర్టును ఆశ్రయించగా 2011లో చేసిన ఎన్‌లైన్‌మెంట్ ఆధారంగానే భూమిని తీసుకోవాలని కోర్టు ఆదేశించిందన్నారు. అయితే తాజాగా జారీ అయిన నోటీసులలో మాత్రం 2013 ఎన్‌లైన్‌మెంట్ ప్రకారమే జారీచేశారని రైతు కాకర్ల వెంకట సుబ్బారావు, దోసపల్లి నాగేశ్వరరావు తదితరులు వాపోయారు. ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి సన్న, చిన్నకారు రైతులను ఆదుకుని, చింతలపూడి పైప్‌లైన్ ఎలైన్‌మెంట్‌ను 2011 నోటీసులకు లోబడే పనిచేయాలని కోరుతున్నారు.
మండలంలో నిర్మించబోయే చింతలపూడి
english title:
r
Date:
Sunday, February 9, 2014