మెదక్, ఫిబ్రవరి 11: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు గత నాలుగు రోజులుగా నిరవదిక సమ్మెలో ఉన్నారు. ఇందులో భాగంగా మెదక్ పురపాలక సంఘంలో పనిచేస్తున్న 80 మంది మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు నిరవదిక సమ్మెలో పాల్గొనడంతో మెదక్ పట్టణం దుర్గందంగా మారింది. 26 స్కరయ్ కిలోమీటర్ల విస్తిర్ణంలో ఉన్న మెదక్ పట్టణంలో 28 మెట్రిక్ టన్నుల గార్బెజీని తొలిగించాల్సి ఉంది. వర్కర్స్ తగ్గడం వలన ఎక్కడి చెత్తకుప్పలు అక్కడే పేరుకుపోయాయి. మురికి కాలువలు శుభ్రపరచకపోవడంతో దుర్గందంగా మారాయి. దీంతో దోమలు జనాభ పెరిగిపోయింది. దాంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన పురపాలక సంఘాల కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన నిరవదిక సమ్మె ఉద్ధృతంగా మారింది. మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలనేది ప్రధాన డిమాండ్, నెలకు కనీసం 12500 రుపాయలు వేతనం ఇవ్వాలని రెండవ డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా 19 కార్పోరేషన్లు, 142 మున్సిపాలిటీల్లో కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన సమ్మె విజయవంతమైందని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ బట్టి జగపతి మాట్లాడుతూ తెలిపారు. ఆ ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని ఆయన విమర్శించారు. కనీస వేతనం 12500 ఇవ్వాలని, రెగ్యులర్ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు జారీ చేయాలన్నారు. కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ కార్మికులకు ఏడాదికి 75 సెలవులు కెటాయించాలని బట్టి జగపతి డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమ కాంట్రాక్టు కార్మికులకు సిఐటియు నాయకులు మల్లేశం, గీతా సంఘీభావం ప్రకటించారు.
బిసిల సంక్షేమంపై నిర్లక్ష్యం
-సదస్సులో బిసి సంఘర్షణ సమితి నేతల ధ్వజం
గజ్వేల్, ఫిబ్రవరి 11: జనాబాలో 80శాతానికి పైగా ఉన్న బిసిలను పాలకు లు నిర్లక్ష్యం చేస్తూ ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నట్లు బిసి సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చీపురు మల్లేష్ యాదవ్, టీఆర్‌ఎస్ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొట్టాల యాదగిరి ముదిరాజ్‌లు స్పష్టం చేశారు. గజ్వేల్‌లోని టివైఆర్ గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బిసి సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరై వారు ప్రసంగించారు. బిసిలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాల ని, ఇందులోభాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తూ చైతన్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా బిసి సబ్‌ప్లాన్ ఆమలు చేయడంతోపాటు దామాషా పద్ధతిన బడ్జెట్‌లో పెద్దపీట వేసి అభ్యున్నతి కోసం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీ రాజ్ సంస్థలలో 56శాతానికి రిజర్వేషన్లు పెంచి రాజ్యాంగ సవరణ చేయాల ని, అన్ని పార్టీలు బిసి డిక్లరేషన్ ప్రకటించాలని, చట్టసభలలో 56శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులోబిల్లుపెట్టాలని, బిసి సర్పంచ్‌లకు రూ,10వేలు, వార్డు సభ్యులకు రూ,2వేల గౌరవ వేతనం ఇవ్వాలని, మండల్ కమీషన్ సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆమలు చేయాలని, జిల్లాలో 6అసెంబ్లీ, 1పార్లమెంటు సీటును బిసిలకు కెటాయించాలని, ఇంటర్ విద్యార్థులకు ఫీజురీయంబర్స్‌మెంటు వర్తింప జేస్తూ సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కోరారు. ముఖ్యంగా ఉద్యమాల ద్వారానే బిసిల సమస్యలకు పరిష్కారం లభించనుండగా, హక్కులు, నిధులు, ఉద్యోగాల కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని వివరించారు. కార్యక్రమంలో నేతలు కొండపాక కనకయ్య, దానమోయిన యాదగిరి, బరిగె నర్సింలు, పాండవులు సత్యనారాయణ, బోయిని రమేష్, భాస్కర్‌గౌడ్, సురేష్, బల్సుకూరి నర్సింలు, అంజాగౌడ్, నక్కరేగొండలు పాల్గొనగా, అనంతరం బిసి ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు.
వ్యవసాయేతర భూములుగా మార్చకుండా
వెంచర్లు చేయడం నేరం:ఆర్డీఓ
పటన్‌చెరు, ఫిబ్రవరి 11: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండా లేఅవుట్ గాని వెంచర్లుగాని చేయడం చట్టరీత్యా నేరమని సంగారెడ్డి ఆర్డీఓ హెచ్చరించారు. వ్యవసాయేతర భూములుగా మార్చకుండా వెంచర్లు చేసిన సదరు వ్యక్తులపై చట్టరీత్యా చర్యలకు సైతం వెనుకాడబోమని ఆయన అన్నారు. మంగళవారం స్థానిక తహసీల్దారు కార్యాలయాన్ని సందర్శించిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ అమాయకప్రజలు అక్రమ లేవుట్లలో ప్లాట్లు కొని మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక తహసీల్దారు మహిపాల్‌రెడ్డిని ఆదేశించారు. పటన్‌చెరు మండలం ముత్తంగి, ఇస్నాపూర్, చిట్కుల్ తదితర గ్రామ పంచాయతీల పరిధిలో అక్రమ లేవుట్లు వెలుస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకురావడంతో పై విధంగా ఆర్డీఓ ధర్మారావు స్పందించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి, శిఖం భూములు ఆక్రమించి వెంచర్లు చేసినా క్షమించేది లేదని తేల్చిచెప్పారు.