గుంటూరు, ఫిబ్రవరి 11: గుంటూరు రేంజ్ పరిధిలో ఇటీవల 39 మంది సిఐల బదిలీల నేపథ్యంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పోస్టింగ్ లేకుండా ఉన్న 17 మంది సిఐలకు ఆయా స్టేషన్లను కేటాయిస్తూ రేంజ్ ఐజి సునీల్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిఐ వీరాంజనేయరెడ్డిని ఒంగోలు సిసిఎస్‌కు, సిఐ మహమ్మద్ మొయిన్‌ను ఒంగోలు సిసిఎస్‌కు, ఎం సురేష్‌కుమార్‌ను ఒంగోలు సిసిఎస్‌కు, మహమ్మద్ మహబూబ్ బాషాను ఒంగోలు మహిళా పోలీసుస్టేషన్‌కు, సిఐ కరుణాకర్‌రావును నెల్లూరు సిసిఎస్‌కు, సిఐ ఎ శివశంకర్‌ను నెల్లూరు సిసిఎస్‌కు, సిఐ ఎన్ రామారావును గిద్దలూరు సర్కిల్‌కు, సిఐ ఎం హైమారావును పొదలకూరు సర్కిల్‌కు, వివి రమణకుమార్‌ను అద్దంకి సర్కిల్‌కు,పోస్టింగ్ ఇచ్చారు. సిఐ సిహెచ్ విజయభాస్కరరావును ఉదయగిరి సర్కిల్‌కు బదిలీ చేశారు.
గుంటూరు రేంజ్ పరిధిలో ఇటీవల 39 మంది సిఐల బదిలీల
english title:
17 ci's got postings
Date:
Wednesday, February 12, 2014