ఒంగోలు, ఫిబ్రవరి 11: జిల్లాలో పనిచేస్తున్న 34 మంది తహశీల్దార్లను గుంటూరు, నెల్లూరు జిల్లాలకు బదిలీచేస్తూ జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లాకు 26 మందిని, నెల్లూరు జిల్లాకు ఎనిమిదిని బదిలీ చేశారు. కొరిశపాడులో పనిచేస్తున్న పి మరిమమ్మను, మద్దిపాడులో పనిచేస్తున్న ఆర్ ప్రభాకర్‌ను, మార్టూరులో పనిచేస్తున్న ఎస్‌వి సుధాకర్‌రావు, పర్చూరు పనిచేస్తున్న పివి సుబ్బారావును, యద్దనపూడిలో పనిచేస్తున్న కె నాగేశ్వరరావును, సిఎస్ పురంలో పనిచేస్తున్న సిహెచ్ నాగభూషణంను, గుడ్లూరులో పనిచేస్తున్న యు అశోక్‌వర్ధన్‌ను, కొనకనమిట్లలో పనిచేస్తున్న సిహెచ్ పద్మావతిని, కందుకూరులో పనిచేస్తున్న ఎం రాజ్‌కుమార్‌ను, కురిచేడులో పనిచేస్తున్న ఎన్ వెంకటేశ్వర్లును, లింగసముద్రంలో పనిచేస్తున్న యు మల్లికార్జునప్రసాదును, పొదిలిలో పనిచేస్తున్న పి సరోజిని, తర్లుపాడులో పనిచేస్తున్న పి విద్యాసాగరుడిను, ఉలవపాడులో ఎస్ శ్యాంబాబును, వలేటివారిపాలెంలో పనిచేస్తున్న ఎస్‌విఎస్ కామేశ్వరరావును, దోర్నాలలో పనిచేస్తున్న బి దీలిప్‌కుమార్‌ను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. అదేవిధంగా గిద్దలూరులో పనిచేస్తున్న పి సాంబశివరావును, యర్రగొండపాలెంలో పనిచేస్తున్న బి చంద్రలీల, మార్కాపురం ఆర్‌డిఒ కార్యాలయంలో ఎఒగా పనిచేస్తున్న ఎం రత్నకుమారి, ఒంగోలులో హెచ్ సెక్షన్‌లో పనిచేస్తున్న కె రాజ్యలక్ష్మి, కందుకూరు ఆర్‌డిఒ కార్యాలయంలో పనిచేస్తున్న వివి బాలసుబ్రహ్మణ్యం, మార్కాపురం ఆర్‌డిఒ కార్యాలయంలో స్పెషల్ తహశీల్దార్‌గా పనిచేస్తున్న టి చిరంజీవి, దొనకొండలో పనిచేస్తున్న పి చంద్రశేఖర్‌ను, కందుకూరు ఆర్‌డిఒ కార్యాలయంలో పనిచేస్తున్న కెవిఆర్‌వి ప్రసాదును, ఒంగోలులోని కలెక్టరేట్‌లోని సి సెక్షన్‌లో పనిచేస్తున్న షేక్ మహమ్మద్ హుస్సేన్‌ను, కొండెపిలో పనిచేస్తున్న కె వెంకటేశ్వర్లును గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. అదేవిధంగా పొన్నలూరులో పనిచేస్తున్న ఎస్ ఉషారాణిని, నాగులుప్పలపాడులో పనిచేస్తున్న వై మెర్సీకుమారిని, మర్రిపూడిలో పనిచేస్తున్న ఇ చంద్రావతిని, బేస్తవారిపేటలో పనిచేస్తున్న జి సావిత్రిదేవిని, కొమరోలులో పనిచేస్తున్న షౌకత్ మొహిద్దీన్‌ను, వేటపాలెంలో పనిచేస్తున్న కెఎల్ మహేశ్వరరావును, సంతనూతలపాడులో పనిచేస్తున్న ఎం గాంధీని, కనిగిరిలో పనిచేస్తున్న బివి రమణారావును నెల్లూరు జిల్లాకు బదిలీ చేస్తూ జిల్లాకలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో పనిచేస్తున్న 34 మంది తహశీల్దార్లను
english title:
transferred
Date:
Wednesday, February 12, 2014