వెల్లింగ్టన్, ఫిబ్రవరి 18: ట్రిఫుల్ సెంచరీ చేసిన తొలి న్యూజిలాంఢ్ బ్యాట్స్‌మన్‌గా చరిత్రపుటల్లోకి ఎక్కిన కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ఈ ఇన్నింగ్స్ తన జీవితకాలమంతా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నాడు. భారత్‌పై జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో తాను చేసిన 302 పరుగుల ఇన్నింగ్స్ గురించి మ్యాచ్ ముగసిన అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో మెక్‌కలమ్ సుదీర్ఘంగా వివరించాడు. ‘94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో నేను బాగా ఆడాల్సిన అవసరం ఉండింది. చివిరకి మేము టెస్టును కాపాడుకోవడమే కాక సిరీస్‌ను దక్కించుకోగలిగాం. ఒత్తిడిలో కూడా కొన్ని మంచి భాగస్వామ్యాలు సాధించగలిగాం. ఓపిగ్గా గంటల తరబడి బ్యాటింగ్ చేయగలిగాం. అందువల్ల జట్టును ఇబ్బందుల్లోంచి బైటపడేసి, సిరీస్‌ను దక్కించుకోగలిగినందుకు ఎంతో సంతృప్తిగా ఉంది’ అని మెక్‌కలమ్ అన్నాడు. మెక్‌కలమ్ సాధించిన 302 పరుగులు టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఒక న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇంతకు ముందు 1991లో ఇదే మైదానంలో మార్టిన్ క్రో శ్రీలంకపై చేసిన 299 పరుగులే ఇప్పటివరకు రికార్డుగా ఉండింది. అంతేకాదు టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన 21వ బ్యాట్స్‌మన్‌గా కూడా మెక్‌కలమ్ రికార్డు సృష్టించాడు.
ట్రిఫుల్ సెంచరీ చేసిన తొలి న్యూజిలాంఢ్ బ్యాట్స్‌మన్‌గా
english title:
life long
Date:
Wednesday, February 19, 2014