Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మసాలా గూండా!

$
0
0

** గూండే (పర్వాలేదు)
తారాగణం:
రణవీర్ సింగ్, అర్జున్ కపూర్, ప్రియాంకా చోప్రా
ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్, సౌరభ్ శుక్లా తదితరులు
సంగీతం: సోహైల్ సేన్, నిర్మాణం: యష్‌రాజ్ ఫిలిమ్స్
దర్శకత్వం: అలీ అబ్బాస్ జఫర్

ఈ కథకి తిక్క - లెక్క రెండూ ఉన్నాయ్. ఈక్వేషన్ ప్రకారం - కథని ‘బ్రొమాన్స్’ (ఎ క్లోజ్ బట్ నాన్-సెక్సువల్ రిలేషన్‌షిప్) ‘రొమాన్స్’ ‘సాంగ్ సీక్వెన్స్’ ‘ట్రాజిక్ బ్యాక్‌గ్రౌండ్’ - ఇలా విడగొట్టి విభజించి పాలించినట్టు.. ఏ శాఖకి దాన్ని అప్పగించేసి.. టోటల్‌గా ‘కమర్షియల్’ మమ అనిపించేశాడు దర్శకుడు. కథని ’70ల్లోకి తీసుకెళ్లాడు. ఎన్నాళ్లని చూస్తాం? ఒకట్రెండు అంటే ఫర్వాలేదుగానీ - కానీ ఎందుకో ఈ సినిమా చూడక్కర్లేదనటానికి కారణం ప్రత్యేకించి లేదు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లోనే యాక్షన్, ఎమోషన్స్, మెలోడ్రామా - మిళితం చేసి ‘గూండే’ని గుదిగుచ్చి.. గుదిబండలా కాకండా - ‘మసాలా’ గులాబీలా అలంకరించారు. గులాబీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే- వేలంటైన్స్ డే నాడు విడుదలై.. ప్రేమికుల్ని మళ్లీ ’70ల్లోకి తీసుకెళుతుంది కాబట్టి.
బంగ్లాదేశ్ ఏర్పడిన రోజులు. కలకత్తా -’70 ప్రాంతం. విభజన ప్రక్రియ మొదలైంత్తర్వాత - ఆ నేపథ్యంలోంచి 12ఏళ్ల బిక్రం (రణవీర్ సింగ్) - బాలా (అర్జున్ కపూర్) కథ ఆరంభం. 1971 యుద్ధం తర్వాత కొత్త ప్రపంచంలో అడుగుపెడతారు వీరిద్దరూ. గన్ కొరియర్స్‌గా జీవితాన్ని ప్రారంభించి - ముందంజ వేసి - బొగ్గు దొంగతనం చేయటం.. లాంటి బడా దందాలకు పాల్పడటం.. ‘కోల్ మాఫియా’కి నాయకత్వం వహించటం.. చుట్టూ ఉన్నవారిని ప్రేమించటం - స్కూళ్లు హాస్పిటళ్లకు డబ్బు డొనేట్ చేయటం -ఇదీ వారికి జీవితం నేర్పిన పాఠం. జీవితం పట్ల నిర్లక్ష్యం.. భయం అంటే ఏమిటో తెలీకపోవటం.. నచ్చితే ఎంత కష్టమైన పనైనా చేయటం - ఇదీ వారి ప్రవృత్తి. బిక్రం - బాల అంటే పోలీసు వ్యవస్థకు హడలు. శిక్షించాలంటే బెదురు. ఇద్దరినీ విడదీయాలంటే భయం. ఆఖరికి ఎసిపి సత్యజీత్ సర్కార్ (ఇర్ఫాన్‌ఖాన్) ఎత్తుగడతో వారిద్దరి మధ్య చిచ్చు బయల్దేరుతుంది. అదీ కేబరే డాన్సర్ నందిత (ప్రియాంకా చోప్రా) రూపేణా. ఆ తర్వాత ఏమైందన్నది క్లైమాక్స్.
కథ ఎక్కడా ప్రేక్షకుల్ని ఆలోచించనివ్వదు. ఇంటర్వెల్‌కి ముందు ఎన్ని ట్విస్ట్‌లూ.. మలుపులు ఉన్నాయో - అన్నీ కూడా కథని సజావుగా క్లైమాక్స్ చేర్చటానికి తోడ్పడ్డాయి. కథ సగభాగం పిల్లల మధ్య జరుగుతుంది. వీరిద్దరి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.
క్రిమినల్స్ కథ కొత్తేం కాదు. అలాంటిది - కథలో ఇన్‌వాల్వ్ చేయటానికి - ’70 నేపథ్యం ఉపకరించింది. ఒక్కసారిగా అమితాబ్ సినిమాలన్నీ కళ్ల ముందు మెదలుతాయి. మధ్యమధ్య అసందర్భంగా వచ్చి వెళ్లే పాటలూ.. బిక్రం - బాలా ఫైట్ చేసే సన్నివేశాలూ - ఒక్కో సందర్భంలో కథ జారిపోతూందనుకుంటున్న తరుణంలో దర్శకుడు జఫర్ కథని మళ్లీ మలుపు తిప్పుతూ వచ్చాడు. ప్రేక్షకులకు అదే రిలీఫ్. అందుకు తగ్గట్టు బోలెడన్ని కమర్షియల్ ఎలిమెంట్స్.
‘మేరే బ్రదర్ కీ దుల్హన్’ చిత్రంతో దర్శకుడిగా తన టేస్ట్‌ని వెలిబుచ్చిన జఫర్ ఈ చిత్రంతో కమర్షియల్‌గానూ తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. ఇక మాటలు గురించి చెప్పాలంటే - చెడుగుడు ఆడేశాడు. ‘పిస్టల్ కీ గోలీ ఔర్ లాన్‌దియా కీ బోలీ జబ్ చల్తీ హై.. తో జాన్ దోనో మే హి ఖత్రేమే హోతీ హై...’ లాంటి డైలాగ్స్ మచ్చుకి ఒక ఉదాహరణ. సంగీత పరంగా ‘జస్న్ ఇ ఇష్క్’ ‘తునే మరీ..’ పాటలు.. కేబర్ పాట ‘అసలామ్ -ఇ- ఇష్కామ్’ ఫర్వాలేదనిపిస్తాయి.
నటనాపరంగా - కమర్షియల్ మాటల్లో చెప్పాలంటే - ఇరగదీశారు. సినిమా అంతా ‘చుట్టూ చెంగావి చీర’లో ప్రియాంకా చోప్రా అలరించింది. రణవీర్ సింగ్ - అర్జున్ కపూర్ - ఇర్ఫాన్‌ఖాన్ చక్కగా నటించారు.
కొన్ని సన్నివేశాల్లో - కలకత్తా నగర ప్రాశస్త్యానికి అద్దం పట్టే రీతిలో - హౌరా బ్రిడ్జ్ సన్నివేశం.. దుర్గాపూజ సన్నివేశాలు, మెట్రోల్లో రద్దీ.. ఆకట్టుకొంటాయి. ఫస్ట్‌హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’ని తలపిస్తాయి.
-బిఎన్కె

ఈ కథకి తిక్క - లెక్క రెండూ ఉన్నాయ్. ఈక్వేషన్ ప్రకారం -
english title: 
gunday

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>