Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అదీ లెక్క!

$
0
0

సహజంగా నటీనటులు షూటింగ్ స్పాట్‌లోకెళ్ళాక ఎటువంటి యాక్షనైనా చేయక తప్పదు. ఇక్కడ అసౌకర్యంగా వుంది, ఇబ్బందులున్నాయి అని చేయను అని మొరాయిస్తే ఆ తరువాత ఆయా నటీనటులకు ఇబ్బందులు ఎదురవుతాయి. తరువాతి చిత్రాల్లో నిర్మాతలు తీసుకోవడానికి మరోసారి ఆలోచిస్తారు. ఈ సంగతి గ్రహించే నటీనటులు ఎలాంటి ఫీట్ అయినా షూటింగ్‌లో చేయడానికి ఒప్పుకుంటారు. అదే బాధ ఇప్పుడు ‘1’ చిత్ర కథానాయిక కృతిసనన్‌కు ఎదురైంది. జాకీష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్, కృతిసనన్ జంటగా ఓ చిత్రాన్ని కాశ్మీర్ లోయలో చిత్రీకరిస్తున్నారు. అక్కడ వాతావరణం తట్టుకోలేనంతగా చల్లగా ఉండడంతో అందరూ ఉన్ని బట్టలతో షూటింగ్ చేస్తున్నారు. కానీ కెమెరాముందు డాన్సులు చేసే హీరో హీరోయిన్లుమాత్రం అందరిలా కాస్ట్యూమ్స్ వేసుకోవడానికి వీల్లేదు కదా. ఓ పక్క చలికి వణికిపోతూ, ముఖ్యంగా చిన్నచిన్న డ్రెస్సులు వేసుకొని బయటికి ఇబ్బందిలేకుండా కనిపిస్తూ డాన్సులు చేయడం ఎవరికైనా నరకప్రాయమే. దానికితోడు ఇద్దరికీ ఊగుతున్న ఉయ్యాల ఊడి దెబ్బలు కూడా తగిలాయి. ఆ దెబ్బలను కూడా లెక్కచేయకుండా కృతిసనన్ షూటింగ్ చేసేసిందట. అక్కడున్న యూనిట్ వాళ్ళంతా హీరోయిన్ అంటే ఇలా వుండాలి, అదీ లెక్క అనుకున్నారట. మొత్తానికి నిర్మాతలకు షూటింగ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఓ మంచి నిర్ణయమే తీసుకుంది ఆమె. ఇటువంటి సమయాల్లోనే కథానాయికల ఓర్పు, సహనం బయటపడతాయి.

సహజంగా నటీనటులు షూటింగ్
english title: 
adee lekka

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>