విశాఖపట్నం, ఫిబ్రవరి 21: సీమాంధ్ర ప్రాంతానికి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ తనకే సంతృప్తిగా లేదని, ఇక జనానికేం చెపుతామని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ ప్యాకేజీల గురించి మొదటి నుంచి పోరాడితే, ఇంకా మెరుగైన ఫలితాలు సాధించి ఉండేవారమన్నారు. అప్పుడు ఎందుకు అడగలేదని విలేఖరులు ప్రశ్నించగా, ఆ ప్రభావం ఉద్యమంపై పడుతుందన్న ఆలోచనతో ఆగిపోయామన్నారు. అయితే సీమాంధ్రకు ఇచ్చిన ప్యాకేజీ గుడ్డిలో మెల్ల అని వ్యాఖ్యానించారు. ఈ ప్యాకేజీ వల్ల సీమాంధ్ర కొంతవరకూ అభివృద్ధి చెందుతుందన్నారు. సీమాంధ్రలో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని మళ్లీ బతికించుకునేందుకే తాను ఇక్కడికి వచ్చానని బొత్స తెలియచేశారు. రాష్ట్ర విభజన కేవలం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదని, అన్ని పార్టీలూ ఇందుకు మద్దతు తెలిపాయన్నారు.
సీమాంధ్ర ప్యాకేజీపై బొత్స
english title:
n
Date:
Saturday, February 22, 2014