
ఆపిల్ ముక్కలు - 1/2 కప్పు
దానిమ్మ గింజలు - 1/4 కప్పు
జామకాయ ముక్కలు - 1/2 కప్పు
బంగాళదుంప ముక్కలు - 1/2 కప్పు
కొత్తిమీర తరుగు - 1 టీ.స్పూ.
నిమ్మరసం - 1 టీ.స్పూ.
నిమ్మరసం - 1 టీ.స్పూ.
చాట్ మసాలా పొడి - 1/4 టీ.స్పూ.
జీలకర్ర పొడి - 1/2 టీ.స్పూ.
ఉల్లిపాయ - 1 చిన్నది
టమాటా - 1
క్యారట్ తురుము - 3 టీ.స్పూ.
ఉప్పు - చిటికెడు
పంచదార - 2 టీ.స్పూ.
బంగాళా దుంపలను ఉడికించి పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పళ్లన్నీ చెక్కు తీసి చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక గినె్నలో పళ్ల ముక్కలు, బంగాళా దుంప ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, క్యారట్ తురుము వేసి కలపాలి. ఇందులో ఉప్పు, పంచదార, చాట్ మసాలా పొడి నిమ్మరసం వేసి కలిపి వెంటనే తినొచ్చు లేదా ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడ్డాక తినొచ్చు.
ఆపిల్ ముక్కలు - 1/2 కప్పు
english title:
veg fruit chat
Date:
Sunday, February 23, 2014