
పానీపూరీలు- 10-15
పళ్ల ముక్కలు - 1 కప్పు
తాజా క్రీమ్ - 1/2 కప్పు
పంచదార పొడి - 5 టీ.స్పూ.
యాలకుల పొడి - 1/4 టీస్పూ.
మార్కెట్లో దొరికే పానీపూరీలు తీసుకోవచ్చు లేదా మైదా, రవ్వ కలిపి చపాతీ పిండిలా తడిపి చిన్న చిన్న పూరీలు చేసి కాల్చుకోవచ్చు. నచ్చిన పళ్ల ముక్కలను చాలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. క్రీంలో పంచదార పొడి, యాలకుల పొడి వేసి పూర్తిగా కరిగేవరకు నురగ వచ్చేలా గిలక్కొట్టాలి. క్రీమ్, పళ్ల ముక్కలు ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేసే ముందు బయటకు తీయాలి. పూరీలు, క్రీం, పళ్ల ముక్కలను విడివిడిగా ప్లేటులో పెట్టుకోవాలి. పూరీ మధ్యలో నొక్కి పళ్ల ముక్కలు పెట్టి పైన చెంచాడు పంచదార కలిపిన క్రీమ్ వేసి వెంటనే తినడానికి సర్వ్ చేయాలి.
చపాతీ పిండిలా తడిపి చిన్న చిన్న
english title:
paani poori
Date:
Sunday, February 23, 2014