
కుబానీలు - 100 గ్రా.
పాలు - 1 లీటర్
పంచదార - 50 గ్రా.
యాలకులపొడి - 1/2 టీ.స్పూ.
జీడిపప్పు- 6-8
బాదాం పప్పు - 6-8
కుబానీలను ఎండినవైతే గోరువెచ్చని నీళ్లలో రెండు గంటలు నానబెట్టి లోపలి గింజలు తీసేయాలి. లేదా తాజావి దొరికితే అలాగే చేసుకోవచ్చు. జీడిపప్పు, బాదాం పప్పు సన్నగా తరిగి పెట్టుకోవాలి. పాలు మరిగించి కాస్త చిక్కబడిన తర్వాత తరిగిన జీడిపప్పు, బాదాం పప్పు, పంచదార, యాలకులపొడి వేసి కలుపుతూ నిదానంగా ఉడికించాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత కుబానీలు వేసి కలుపుతూ ఉడికించాలి. మొత్తం ఉడికి చిక్కబడుతున్నప్పుడు దింపి వేడిగా లేదా చల్లగా సర్వ్ చేయాలి.
కుబానీలు - 100 గ్రా. పాలు - 1 లీటర్
english title:
payasam
Date:
Sunday, February 23, 2014