Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

భారీ పల్స్‌పోలియో ర్యాలీ

$
0
0

నెల్లూరు, ఫిబ్రవరి 22: పల్స్‌పోలియో రెండో విడత కార్యక్రమం ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. పోలియోరహిత దేశంగా తీర్చిదిద్దాలని కోరుతూ నగరంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ బోసుబొమ్మ వద్ద జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ నుండి నగరంలోని ప్రధాన సెంటర్ల మీదుగా టౌన్‌హాల్ వరకు ర్యాలీ చేరింది. ఈ ర్యాలీలో విద్యార్థిని విద్యార్థులతో పాటు జిల్లా అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్స్‌పోలియోకు 3.28 లక్షల మంది చిన్నారులను గుర్తించామన్నారు.
నిర్వాసితులకు న్యాయం చేస్తాం
జెన్‌కో సిఇ సత్యనారాయణ
ముత్తుకూరు, ఫిబ్రవరి 22: నిర్వాసితులైన నక్కలమిట్ట గ్రామస్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తానని జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రం సిఇ సత్యనారాయణ తెలిపారు. శనివారం మూడో రోజున నక్కలమిట్ట గ్రామస్థుల దీక్షను విరమింప చేసేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ కె సుజాత నిర్వాసితుల వద్దకు వచ్చి, వారి డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిఇ సత్యనారాయణతో కలిసి గ్రామస్థుల డిమాండ్లను నాయకులతో చర్చించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని, వౌలిక వసతుల కల్పన కోసం నిధులు కలెక్టర్ వద్ద జమచేసి ఉన్నట్లు సిఇ సత్యనారాయణ తెలిపారు. సిఇ, తహశీల్దార్ల హామీలతో నిర్వాసితులు తాత్కాలికంగా దీక్షను విరమించారు. నిర్వాసితుల నాయకులు నెల్లూరు వెంకటకృష్ణయ్య, గండవరపు సూరి, తాండ్ర బాపురెడ్డి, కొప్పోలు దయాకర్, తాండ్ర మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
గూడూరు, ఫిబ్రవరి 22: వెంకటగిరి వైపు నుండి గూడూరుకు అప్పీ ఆటోలో అక్రమంగా 20 ఎర్రచందనం దుంగలను శనివారం రాత్రి తరలిస్తుండగా బాలాయపల్లి పోలీసులకు సమాచారం అందడంతో కాపుకాసి వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 20 ఎర్రచందనం దుంగలను కనుగొన్నారు. ఆటోను వదిలి డ్రైవర్ పారారీ కాగా ఆటోను, దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 4 లక్షల రూపాయలుంటుందని పోలీసులు తెలిపారు.
నీతివంతంగా ఎన్నికలు నిర్వహించాలి
నెల్లూరు రూరల్, ఫిబ్రవరి 22: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలు నీతివంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ అన్నారు. కలెక్టరేట్‌లోని గోల్డెన్ జూబ్లీ హాల్లో శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పోటీచేసే అభ్యర్ధులపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అభ్యర్ధులు గెలుపు కోసం ఓటర్లను పలువిధాలుగా ప్రలోభాలకు గురిచేసే అవకాశాలు వెతుకుతారని, అలా చేస్తున్న వారి పట్ల ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో వర్గాలుగా విభజించి స్థానిక నాయకులు పెత్తనం చెలాయిస్తూ ఓటర్లను గంపగుత్తగా పంపకాలు చేసే విధానానికి స్వస్తి పలకాలని అన్నారు. ఓటర్లను లోబరుచుకోవడం కోసం మద్యం, నగదు, ఆడవారికి బహుమతులు, దినపత్రికలు సరఫరా చేసే బాయ్‌లపై, పాల ప్యాకెట్స్ వేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల నియమాలకు విరుద్ధంగా గ్రామాల్లో సొంత అభివృద్ధి పనులు చేస్తామంటూ ముందుకు రావడం, ఎన్నికల సమయంలో అలా చేయడం నేరమేని అన్నారు. ఓటర్లు వారికి నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాలలో బెల్టుషాపుల విషయంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దినపత్రికలలో పెయిడ్ ఆర్టికల్ పట్ల కూడా నిఘా ఉంటుందని అని అన్నారు. ఎక్కువ నగదును ఒక ప్రాంతాని నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో ఆ నగదుకు సంబంధించిన పత్రాలు కచ్చితంగా వారి వద్ద ఉంచుకోవాలని అన్నారు. సుమారు 50 వేలకు మించిన నగదుతో పట్టుబడితే ఆధారాలు లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగదు లావాదేవీలు జరుపువారు డిడిలు, చెక్కుల రూపంలో జరపాలని తెలిపారు. గ్రామాలలో కొంత మంది రైతులకు బంగారు వస్తువులపై రుణాన్ని మాఫీ చేస్తామంటూ, రుణాలు ఇప్పిస్తామంటూ హామీ ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల కాలనీలలో వారిని మభ్యపెట్టడానికి నాయకులు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని అన్నారు. 23, 24, 25 తేదీలలో జరుగు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని గుర్తించి పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రేఖారాణి మాట్లాడుతూ విఆర్‌ఓ, విఆర్‌ఎ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ నెల 28వ తేదీలోపు సర్ట్ఫికెట్ల తనిఖీ కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో విఆర్‌ఓ పోస్టులు 48, విఆర్‌ఎ పోస్టులు 145 ఉద్యోగులకు గాను ఫలితాలు వెల్లడించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ చంద్రవౌళి, డిఎం అండ్ హెచ్‌ఓ కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.

విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి
తోటపల్లిగూడూరు, ఫిబ్రవరి 22: విద్యుత్ షాక్‌తో ఓ ప్రైవేటు ఎలక్ట్రిషియన్ శనివారం మృతి చెందారు. మండలంలోని కొత్తకోడూరు గ్రామంలో పొలాల్లో చోటుచేసుకుంది.
మహాలక్ష్మి గ్రామానికి చెందిన ప్రైవేటు ఎలక్ట్రిషియన్ షేక్ జమీర్ (26) స్థానిక లైన్‌మెన్ ఖయ్యంతో కలిసి లైన్ క్లియరన్స్ 272 తీసుకుని 15 కెవి ట్రాన్స్‌ఫార్మర్ బిగిస్తున్నారు. పని పూర్తి అవుతుండగా విద్యుత్ సరఫరా కావటంతో జమీద్ విద్యుత్ షాక్‌తో స్తంభంపై మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎడి సుధాకర్, ఎఇ అనీల్ సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. లైన్ క్లియరెన్స్ ఉండగానే సరఫరా విడుదల కావటంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. రిటన్ సప్లయ్ రావటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎల్‌సిని గమనించకుండా విద్యుత్ సరఫరా చేయడం వల్లనే ఇది జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యుత్ అధికారులు స్థానిక ఎస్సై నాగరాజుకు ఫిర్యాదు చేయడంతో జమీర్ మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టంకు తరలించారు.

సీమాంధ్రలో గుజరాత్ తరహా అభివృద్ధి: బిజెపి
ఆంధ్రభూమిబ్యూరో
నెల్లూరు,్ఫబ్రవరి 22: సీమాంధ్రను గుజరాత్ తరహా అభివృద్ధి చేస్తామని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణకు తమ పార్టీ మద్దతు పలికినా సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడుతూ చట్టబద్ధత కోసం పార్లమెంటులో కృషి చేశామన్నారు. సీమాంధ్ర ప్రయోజనాల కోసం ఒక్క బిజెపి ఒక్కటే పార్లమెంటులో పోరాటం చేసిందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి విభజన కోరుకుంటునే సమైక్యాంధ్ర ముసుగులో ఉత్తర కుమార ప్రగాల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీతో లోపాయికారిగా ఒప్పందాన్ని కుదుర్చుకుని విభజన ప్రక్రియకు సుగమం చేశారని విమర్శించారు. విభజన జరగకుండా అడ్డుకుంటామని, చివరి మ్యాచ్ ఉందని సీమాంధ్ర ప్రజలను కిరణ్‌కుమార్‌రెడ్డి మోసం చేశారని తెలిపారు. చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతం వల్ల ఇరుప్రాంతాలకు చెందిన ప్రజలు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. సమన్యాయంపై స్పష్టత తెలపకుండా ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. బాధ్యతయుత ప్రతిపక్షంగా పార్లమెంటులో బిజెపి పోరాటం చేసి సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూసిందన్నారు. రాజ్యాంగ బద్ధంగా హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రజలకు గవర్నర్ ద్వారా రక్షణ కల్పిచేందుకు బిల్లులో చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. పోలవరం సాధించడం, ప్రాజెక్టు అవసరమైన ముంపు గ్రామాలన్ని సీమాంధ్ర పరిధిలోకి వచ్చే విధంగా బిల్లులో పొందుపరిచేట్టు చర్యలు తీసుకున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రామాలయం తప్ప మిగతా ప్రాంతాలన్ని సీమాంధ్ర ప్రాంతానికే చెందుతాయన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి వచ్చే విధంగా చూశామన్నారు. శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు వల్ల రాయలసీమ ప్రాంతం అంత అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సీమాంధ్రలో కోస్టల్ కారిడార్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి సదుపాయాలు ఉండటం వల్ల సీమాంధ్ర ప్రాంతం రాబోయే రోజులలో బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. లోక్‌సభ, రాజ్యసభలో బిజెపి సూచించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం నుండి సాధించుకున్నప్పటికీ చేయాల్సిన మరికొన్ని డిమాండ్స్‌పై పోరాటం చేయాలన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి మాట్లాడుతూ లోక్‌సభలో సూచించిన సవరణలు, బిల్లులో మిగిలిన డిమాండ్స్‌ను రాజ్యసభలో ఆమోదం అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చామన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పటికి సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడటంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించామని చెప్పారు. ఈ సమావేశంలో బిజెపి నాయకుడు భాస్కర్ గౌడ్, ఆంజనేయరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ కోతల వేళలు ప్రకటించాలి
కోవూరు, ఫిబ్రవరి 22: అప్రకటిత విద్యుత్ కోతలను ప్రకటించాలని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఇంటింటికి టిడిపిలో భాగంగా పట్టణంలోని రాళ్లమిట్టలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేళాపాల లేని విద్యుత్ కోతలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కృష్ణయ్య, శ్రీహరిరెడ్డి, పద్మనాభం, అంకబాబు, వెంకటరమణమ్మ, బుజ్జమ్మ పాల్గొన్నారు.
అంగన్‌వాడీలు 23 నుంచి నిరవధిక సమ్మె
కోవూరు, ఫిబ్రవరి 22: తమ సమస్యల పరిష్కారం కోసం 23 నుంచి నిరవధిక సమ్మెను చేపట్టనున్నట్లు అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కోవూరు ప్రాజెక్టు కమిటీ అధ్యక్షురాలు కె విజయమ్మ తెలిపారు.రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 17 నుండి 22వ తేదీ వరకు సమ్మె చేశామని, మరలా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 23వ తేదీ నుండి సమ్మె చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగే ధర్నాకు వెలుతున్నట్లు ఆమె తెలిపారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
నెల్లూరు కల్చరల్, ఫిబ్రవరి 22: స్థానిక మూలపేటలోని భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రి బాలాత్రిపుర సుందరి నృత్య నికేతన్ చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 3వ తేదీ వరకు జరుగుతాయి. ఈసందర్భంగా ప్రతిరోజూ మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, అలంకారం, పూజలు జరుగుతాయి. ఉదయం, రాత్రి ఉత్సవాలు జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ధ్వజారోహణ, రాత్రి 7 గంటలకు సింహవాహనోత్సవం జరుగుతాయి. అన్నపూర్ణాసమేత నీలకంఠేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. సిఎఎం హైస్కూల్ రోడ్డులోని ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో ఈసందర్భంగా ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి పూజలు ప్రసాద వినియోగం జరిగాయి. విఘ్నేశ్వర నృత్యనికేతన్ విజయలక్ష్మి బృందం ప్రదర్శించిన కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వీటితోపాటు నవాబుపేట భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి, ఉస్మాన్ సాహెబ్‌పేట నాగలింగేశ్వరాలయం, కాశీవిశ్వనాధస్వామి ఆలయం, సంతపేట శివాలయం, వేదాయపాళెం, పప్పులవీధి, ఉమ్మారెడ్డిగుంటతోపాటు పలు శివాలయాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. పేదల సంక్షేమం కోసం పాటు పడేది
యుపిఎ ప్రభుత్వమే
గూడూరు, ఫిబ్రవరి 22: కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటు పడిందని, వారి కోసం ఎన్నో పథకాలను అమలు చేసిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి పేర్కొన్నారు. శనివారం ఆమె గూడూరులోని డిఎన్‌ఆర్ కమ్యూనిటీ హాలులో రోటరీ, లయన్స్, వైజెపి లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో ఓఎన్‌జిసి, సిఎస్‌ఆర్ నిధులతో 16 లక్షల రూపాయల విలువ చేసే ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు, చంక కర్రలను దాదాపు 350 మందికి అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం నిరుపేదలకు వడ్డీ లేని రుణాలు, వ్యవసాయానికి సంబంధించి రైతులకు రుణమాఫీ, చేనేత రుణాల రద్దు, రైతు విద్య, పేదలకు ఆహారభధ్రత, ఉపాధి హామీ పనులు వంటివి ప్రవేశ పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పించిందన్నారు. తన పార్లమెంటు నియోజక వర్గ పరిధిలోని పలు ఎస్సీ, ఎస్టీ కాలనీలోని ప్రజలకు మినరల్ వాటర్ సౌకర్యం ఉచితంగా కల్పించామన్నారు. పార్లమెంటు పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో కూడా వికలాంగులకు సంబంధించి పరికరాలను అందజేశామన్నారు. వికలాంగులకు అందజేసిన ఉపకరణాలు వారు అమ్ముకున్నట్టు తమ విచారణలో తేలితే పోలీసు కేసు నమోదు చేస్తామన్నారు. గూడూరులో ఉన్న 1500 మంది వికలాంగుల సౌలభ్యంకోసం గూడూరులో ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేసి సర్ట్ఫికెట్‌లు ప్రదానం చేయాలని వికాలంగ సంఘ నాయకుడు నారాయణ పనబాక లక్ష్మి దృష్టికి తీసుకొని పోగా, అర్హులైన వారందరికి గూడూరు మండలంత గాంధీనగర్‌లో వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కాలనీ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీఇచ్చారు. శిబిరానికి సంబంధించి ఆర్డీవో చొరవ తీసుకొని గూడూరులో వైద్యులతో శిబిరాన్ని ఏర్పాటు చేసి అర్హులైన వికలాంగులకు సర్ట్ఫికెట్‌లు ప్రదానం చేయాలని ఆమె సూచించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజక వర్గ ఇన్‌చార్జీ పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ గూడూరు నియోజక వర్గాన్ని 850 కోట్ల రూపాయల ప్యాకేజితో ఐదేళ్ల కాలంలో అభివృద్ధి చేశామన్నారు. ఒక్క గూడూరు పట్టణానికి సంబంధించి 25 కోట్ల రూపాయలతో పలు సిమెంటు రోడ్లు, కల్వర్టులు, డ్రైన్లు నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హరిబాబుయాదవ్, జగన్మోహనరెడ్డి, ఎకె రస్తోగి, కెవి భాస్కరరావు, తులసీ చంద్రశేఖర్, రోటరీ ప్రెసిడెంట్ మయూరీ శ్యామసుందర యాదవ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో వేణురెడ్డి, ఎన్ రవి, వై చంద్రశేఖరరెడ్డి, పి మురళీనాయుడు, కె మునిగిరీష్, ఆర్‌వి రావు, క్యాంప్ కో ఆర్డినేటర్ బి దశరధరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదిలావుండగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గ్రామీణ మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పనబాక లక్ష్మీ అన్నారు. శనివారం ఆమె డిఎన్‌ఆర్ కమ్యూనిటీ హాలులో భారత పెట్రోలియం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు, కోట, వాకాడు, గూడూరు, మండలాలల్లోని గ్రామీణ నిరుపేద మహిళలకు ఆరు వేల గ్యాస్ కనక్షన్‌లను మంజూరు చేశామన్నారు. మొదటి విడతగా 300 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఉచిత గ్యాస్ పంపిణీ చేశామన్నారు. ఇప్పటి వరకు 13వేల కుటుంబాలకు దీపం పధకం కింద గ్యాస్ కనెక్షన్‌లు ఇప్పించామన్నారు. ఈ సందర్భంగా భారత పెట్రోలియం సంస్థ రోటరీ క్లబ్‌కు మంత్రి చేతుల మీదుగా లక్ష రూపాయలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎన్ మదుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.
గూడూరులో మథర్ తెరిస్సా విగ్రహ ఏర్పాటుకు అనుమతివ్వండి
గూడూరులో మథర్ తెరిస్సా విగ్రహ ఏర్పాటుకు కేంద్రమంత్రి చొరవ తీసుకొని అనుమతి మంజూరు చేయించాలని వైజెపి లయన్స్ సభ్యురాలు కె మంజులాదేవి కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.

పల్స్‌పోలియో రెండో విడత కార్యక్రమం ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. పోలియోరహిత
english title: 
b

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>