Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సోదరభావంతో పనిచేసేది పోలీస్ శాఖే

$
0
0

ఖమ్మం(స్పోర్ట్స్), ఫిబ్రవరి 22: ఎటువంటి వ్య త్యాసం లేకుండా సోదరభావంతో పనిచేసేది పో లీస్ శాఖేనని, అందుకే ఎన్ని ఓడుదొడుకులు వచ్చి న తట్టుకొని ఈ పోలీస్ వ్యవస్థ నిలబడుతుందంటే వారి ఐక్యతే కారణమన్నారు. శనివారం పోలీస్ పరే డ్ గ్రౌండ్స్‌లో జిల్లా స్థాయి పోలీస్ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా జడ్జి రమేష్, జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్‌లు క్రీడాకారుల నుంచి వందనాన్ని స్వీకరించారు. క్రీడల ప్రారంభ సూచికగా శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మా ట్లాడుతూ ఎటువంటి కష్టాలు వచ్చిన మేమంతా ఒ క్కటే, మేము ఉన్నది మీకోసమే అనే స్ఫూర్తిని ఈ క్రీడా దివాస్ ద్వారా ప్రజలోకి తీసుకపోవాలసిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఎప్పుడు విధి నిర్వహణ లో సతమతమవుతున్న పోలీస్ సిబ్బంది మానసిక ఉల్లాసంతో పాటు కొంత ఆటవిడుపు కావాలని, అ ప్పుడే మరింత విశ్వాసంతో విధి నిర్వహణలో పా ల్గొని రాష్ట్రంలోని జిల్లా పోలీస్ ఔన్నత్యాన్ని పెం పొందించుకోవచ్చన్నారు. జిల్లా ఎస్పీ ఎవి రంగనాథ్ మాట్లాడుతూ త్వరలో విశాఖపట్టణంలో జరిగే రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలకు జిల్లాలోని ప్రతిభ గల క్రీడాకారులు వారి నైపుణ్యతను చాటుకోవటానికి ఈ క్రీడ లు ఉపయోగపడతాయన్నారు. ఎలాంటి విబేధాల కు తావులేకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నా రు. అనంతరం వాలీబాల్ కోర్టులో సర్వీస్ చేసి జిల్లా జడ్జి పోటీలను లాంఛనంగా ప్రాంరంభించారు. అనంతరం క్రికెట్ పోటీలను పోలీస్ శిక్షణ కేంద్రంలో జిల్లా జడ్జి, ఎస్పీ బౌలింగ్, బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఆకట్టుకున్నారు. జిల్లాలోని ఏడు సబ్ డివిజన్లలోని సివిల్ పోలీస్, ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ ఫోర్స్, స్పెషల్ పార్టీలు, మినిస్టీరియల్ స్ట్ఫా, హోంగార్డ్స్‌కు చెందిన 400 మంది పురుష, మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎఆర్ కమాండెంట్ నాగేశ్వరరావు, కొత్తగూడెం ఓఎస్‌డి తిరుపతి, ఎఎస్‌పి ప్రకాష్‌రెడ్డి, ట్రైనీ ఐపిఎస్ ఆర్ భాస్కరన్, డిఎస్పీలు కుమారస్వామి, బాలకృష్ణ, సాయిశ్రీ, అశోక్‌కుమార్, కృష్ణ, భాస్కర్, రవీందర్, ఎస్‌బిఐ వెంకట్రావ్, ఆర్‌ఐ శంకర్, సిఐలు సారంగపాణి, రమణమూర్తి, రహమాన్, తిరుపతి, మధుసూదన్, ట్రాఫిక్ సిఐ రామోజీ రమేష్, వ్యాయామోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో భాగంగా వాలీబాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, అధ్లెటిక్స్ తదితర క్రీడాంశాలలో పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయి.

పోలియో చుక్కలకు చర్యలు
ఖానాపురం హవేలి, ఫిబ్రవరి 22: జిల్లాలో ఈనెల 23న 2,98,220మందికి పో లియో చుక్కలు వేసేందు కోసం అన్ని చర్యలు చేపట్టామని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బాబురావు స్పష్టం చేశారు. శనివారం పోలియో చుక్కల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లా ప్రభుత్వాసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2009 నుంచి ఇప్పటి వరకు ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతో ఇది సాధ్యమైందన్నారు. ఇదే స్పూర్తితో జిల్లాలో ఈ నెల 23నుంచి మూడు రోజుల పాటు పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, 0-5 సంవత్సరాల మధ్య వయస్సున్న అందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. 24, 25వ తేదీల్లో ప్రతి ఇంటికి వెళ్ళిపోలియో చుక్కలు వేయించటం జరుగుతుందన్నారు. ఇందుకోసం 3,327పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో 2,121 కేంద్రాలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. పోలియో చుక్కలు వేసేందుకు 13,328మంది సిబ్బందిని నియమించామని, కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 332మంది అధికారులను కూడా నియమించామన్నారు. సమావేశంలో డిఎం అండ్ హెచ్‌ఓ భానుప్రకాశ్, డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఉంజుపల్లి అడవిలో ఉద్రిక్తత
చర్ల, ఫిబ్రవరి 22: పూసుగుప్ప కాంట్రాక్ట్ నిర్వా కం ఇరు ఖాకీ డిపార్ట్‌మెంట్ల మధ్య చిచ్చు రేపింది. పూసుగుప్ప రోడ్డు పనులు రెండు సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అటవీశాఖ నుంచి క్లి యరెన్స్ అనుమతి చూపించండి అంటూ అటవీశాఖాధికారులు శనివారం అడ్డుకున్నారు. దీంతో దగ్గరుండి రోడ్డు పనులు చేయిస్తున్న పోలీసులు రోడ్డు పనులు ఆపవద్దంటూ అడ్డు తగిలారు.దీంతో అటవీశాఖాధికారులకు, పోలీస్ సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే చర్ల మం డల కేంద్రం నుంచి పూసుగుప్ప వరకు సుమారు 8కోట్ల రూపాయలతో తారురోడ్డు నిర్మాణానికి గత రెండేళ్ళ క్రితం నిధులు మంజూరయ్యాయి. ఈ ప నులను సంబంధిత వరంగల్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ పనులు చేజిక్కించుకొని పనులు నిర్వహిస్తుంటాడు. కాగా గతేడాది వద్దిపేట వద్ద మావోయిస్టులు ప్రొక్లెయిన్లను తగులబెట్టడంతో రోడ్డు పనులు నిలిచిపోయాయి. దీంతో ఈ రోడ్డు పనులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఖమ్మం ఎస్పీ రంగనాథ్ రోడ్డు పనులను ఏలాగైనా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. దీంతో సంబంధిత కాం ట్రాక్టర్ పోలీసుల సహకారం తీసుకొని రోడ్డు పను లు చేయిస్తున్నాడు. ఇంత వరకు బాగానే ఇప్పటి వరకు రోడ్డు పనులు జరిగి రెండేళ్ళు అవుతున్నా ఫా రెస్ట్ క్లియరెన్స్ ఇంత వరకు రాలేదు. దీంతో భద్రాచలం డిఎస్‌ఓ పూసుగుప్ప రోడ్డు పనులకు అనుమ తి లేదని, వాటిని ఏలాగైనా నిలుపుదల చేయాలని చర్ల అటవీశాఖాధికారులను ఆదేశించారు. దీంతో శ నివారం రోడ్డు పనులు చేస్తున్న ప్రాంతానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి సునీతతో పాటు తన సిబ్బందితో వె ళ్ళి రోడ్డు పనులను అడ్డుకున్నారు. అక్కడే ఉన్న పో లీసులు రోడ్డు పనులను అడ్డుకోవద్దని, కొద్ది రో జుల్లో ఫారెస్ట్ నుంచి అనుమతి తెప్పిస్తామని చర్ల ఎస్‌ఐ సంతోష్‌తో పాటు పోలీస్ సిబ్బంది తెలిపారు. అయినప్పటికీ ఫారెస్ట్ సిబ్బంది కేసులు పెడతామని హెచ్చరించారు. ఇదే క్రమంలో రెటిమిక్స్‌తో వచ్చిన ఐదు లారీలు ఉంజుపల్లి అటవీ ప్రాంతానికి వచ్చాయి. దీంతో ఫారెస్ట్ సిబ్బంది అనుమతి లేకుండా రోడ్డు పనులు చేయిస్తున్నారు, లారీలు కూడా రెటిమిక్స్‌తో వచ్చాయని, వీటిపై కేసులు నమోదు చేస్తామంటూ అడ్డు తగిలారు. దీంతో అటవీశాఖ సిబ్బంది, పోలీసుల మధ్య గంట సేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దయచేసి రోడ్డు పనులు అడ్డుకోవద్దంటూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోడ్డు పనులు చేయిస్తున్నామని చర్ల ఎస్‌ఐ సంతోష్ అటవీశాఖాధికారులకు తెలిపారు. అయినప్పటికీ వారు కేసులు నమోదు చేస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. ఒకానొక సందర్భంలో ఇరువురు వర్గాలు కొట్టుకునేంత వరకు వెళ్ళింది. దీంతో విలేఖరులు వారిని సముదాయించారు. అనంతరం గొడవ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఉంజుపల్లి వాసులు రోడ్డు పనులను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ అటవీశాఖ సిబ్బందిపై విరుచుకపడ్డారు. అడవిలో ఉన్నటువంటి కలపను అక్రమంగా అమ్ముకుంటున్నారు. రోడ్డు పనులు చేస్తే తప్పా అంటూ వారిపై తిరగబడ్డారు. దీంతో వారు చేసేదేమి మిన్నకుండిపోయారు. దీంతో రెటిమిక్స్‌తో వచ్చిన లారీలను రెటిమిక్స్‌ను దించి వెళ్ళిపోతున్నాయి. ఈ సందర్భంలో వారిని పట్టుకొని వారిపై కేసులు నమోదు చేసేందుకు అటవీశాఖాధికారి సునీత ప్రయత్నించారు. అయినప్పటికీ వారు అక్కడ నుంచి వచ్చేయటంతో లారీలను పట్టుకొని డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంలో వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ ఎస్‌ఐ వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అటవీశాఖాధికారులకు, ఎస్‌ఐ సంతోష్‌కు మధ్య తోపులాట జరిగింది. అనంతరం అటవీశాఖాధికారులు చర్ల రేంజ్ కార్యాలయానికి తరలించారు.

మార్కెట్ తరలింపుపై కుట్రలు మానుకోవాలి
ఖమ్మం(గాంధీచౌక్), ఫిబ్రవరి 22: మార్కెట్ తరలింపులో ఖమ్మం ఎమ్మెల్యే, కొ న్ని పార్టీల నేతలు చేస్తున్న కుట్రలు మానుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పో తినేని సుదర్శన్ సూచించారు. శనివారం స్థానిక గ్రెయిన్ మార్కెట్‌లో మార్కెట్ తరలింపును ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కొంతమంది అధికార పార్టీ నేతలు తమ స్వార్థం కోసం మార్కెట్‌ను తరలించాలని ప్రయత్నాలు చేస్తుంటే తమ పార్టీ అడ్డుకుంటూ వస్తుందన్నారు. తమ పార్టీ త్రీటౌన్ ప్రాంతంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. తమ ఉద్యమాల ఫలితంగా గత ఆరు సంవత్సరాల నుంచి మార్కెట్ తరలింపు అగిందన్నారు.మార్కెట్‌ను అందరికీ అనుకూలంగా ఉండే ప్రాంతంలో నిర్మించాలని పేర్కొన్నారు. త్రీటౌన్ ప్రాంతంలో అన్ని రంగాల వ్యాపారాలు ఉండటానికి కారణం మార్కెటేనన్నారు. ఎవరితోనూ చర్చలు జరపకుండా స్వంత నిర్ణయాలు తీసుకొని మార్కెట్‌ను తరలించాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. బాలప్పేట, మంచుకొండ ప్రాంతాల్లో ఉన్న వారి భూముల ధరలను పెంచుకునేందుకే ఆ ప్రాంతానికి మార్కెట్‌ను తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. మార్కెట్‌ను ఆ ప్రాంతానికి తరలిస్తే కార్మికులకు, వ్యాపారులకు దూరం కావటంతో పాటు ఆ ప్రాంతంలో కనీసం నివాసం ఉండేందుకు ఇంటి స్థలం కొనుగోలు చేయలేని విధంగా ధరలు ఉన్నాయన్నారు. మార్కెట్ తరలింపు జీవోను తమ పార్టీ ఆధ్వర్యంలో రద్దు చేయిస్తే, ఖమ్మం ఎమ్మెల్యే తనకున్న పలుకుబడితో రాత్రికి రాత్రే జీవోను తెప్పించాలని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. ఖమ్మం నగరాన్ని ఎమ్మెల్యే అభివృద్ధి చేయాలనుకుంటే ఎయిర్‌పోర్టు లాంటి సౌకర్యాలను కల్పించి రాష్టస్థ్రాయిలో పేరు తెప్పించాలన్నారు. నగరంలో సెంట్రల్ లైటింగ్ కల్పించామని చెప్తున్న తుమ్మల త్రీటౌన్ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయటం లేదని ప్రశ్నించారు. ఖమ్మం నగరం మొత్తం వైరా రోడ్డుకే పరిమితం అవుతుందని, త్రీటౌన్ ప్రాంతం ఏ రాజకీయ నాయకులకు గుర్తుకు రావటం లేదని ఏద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చేసిన ఉద్యమం ఒక వంతైతే అంతకు రెట్టింపు స్థాయిలో ఖమ్మం మార్కెట్ తరలింపు నగరానికి పెద్ద సమస్యగా మారిందన్నారు. అనంతరం మార్కెట్ తరలింపును అడ్డుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ పాదయాత్ర స్థానిక మార్కెట్ నుంచి గాంధీచౌక్, కాల్వఒడ్డు, మయూరి సెంటర్, బస్టాండ్, మున్సిపల్ రోడ్డు, చర్చికాంపౌండ్, ప్రకాష్‌నగర్ రోడ్డు మీదుగా మార్కెట్ వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో నున్నా నాగేశ్వరరావు, సిద్ధినేని కోటయ్య, యర్రా శ్రీకాంత్, దేవులపల్లి వెంకన్న, యర్రా శ్రీనివాసరావు, ఉదయ్‌ప్రతాప్, విక్రమ్, అఫ్రోజ్ సమీన, ఆర్‌జెసి కృష్ణ, తోట రామారావు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు
పెనుబల్లి, ఫిబ్రవరి 22: మండల పరిధిలోని తాళ్ళపెంట గ్రామంలో శనివారం పలు అభివృద్ధి పనులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శంకుస్థాపనలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన నిధులతో తాళ్ళపెంటలోని ఎస్సీ కాలనీలో లక్ష రూపాయలతో రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎస్టీ కాలనీలో 2లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక ఉన్నత పాఠశాలలో లక్ష రూపాయలతో నిర్మించే కళా నిలయానికి, మంచినీటి బోర్లకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా తాళ్ళపెంట గ్రామంలో ప్రదర్శన నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాలన్నీ అభివృద్ధి బాటలో ముందుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు చెక్కిలాల లక్ష్మణ్‌రావు, నరుకుళ్ళ రాధాకృష్ణ, టిడిపి నాయకులు అప్పారావు, బండి రాఘవులు, సూర్యదేవర రవికుమార్, చీకటి రామారావు, చింతనిప్పు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సీతారాములు, నరోత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల వినూత్న ప్రదర్శనలు
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 22: తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ శనివారం జలగంనగర్‌లోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట వి నూత్న నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో భా గంగా వారు కళ్లు మూసుకొని వెనుకకు నడుస్తూ వి నూత్న శైలిలో నిరసన తెలియజేశారు. ఈసందర్భం గా జరిగిన సిఐటియు పాలేరు డివిజన్ కార్యదర్శి పె రుమాళ్ళపల్లి మోహన్‌రావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈనెల 24న జరుపతలపెట్టి న చలో హైద్రాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వివి ధ సంఘాల నేతలు వి వీరభద్రాచారి, జ్యోతి, దేవ్‌సింగ్, వెంకట్రావ మ్మ, లక్ష్మి, గాయిత్రి, శ్రీనివాసరా వు సంఘీభావాన్ని తెలిపారు. కార్యక్రమంలో సిఐటి యు మండల అధ్య క్ష, కార్యదర్శులు ఎం నాగేశ్వరరావు, సాంబశివరావు, సంఘం మండల అధ్యక్ష, కా ర్యదర్శులు రత్నకుమారి, రేవతి, అక్తర్‌బేగం, భాగ్య మ్మ, లక్ష్మి, రజిత, మల్లీశ్వరి పాల్గొన్నారు.
గార్లలో..
గార్ల : సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ లు శనివారం కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన వ్య క్తం చేశారు. స్థానిక మంగపతిరావు భవన్ నుంచి బ యల్దేరి పురవీధుల్లో కలియ తిరిగారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి గిరిప్రసాద్ మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకు లు తాళ్ళూరి పద్మ, భుక్యా లీలాదేవి, విక్టోరియా, చుక్కమ్మ, సుజాత పాల్గొన్నారు.
ముదిగొండలో..
ముదిగొండ : మండల కేంద్రమైన ముదిగొండ లో శనివారం అంగన్‌వాడీ కార్యకర్తలు భిక్షాటన కా ర్యక్రమాన్ని చేశారు. అంగన్‌వాడీల న్యాయమైన స మస్యలు పరిష్కరించాలని కోరుతూ 8 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించ లేదని అంగన్‌వాడీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరీ అన్నారు. ముదిగొండలో అంగన్‌వాడీలు చేపడుతు న్న దీక్షా శిబిరాన్ని ఆమె సందర్శించి మాట్లాడారు. కార్యక్రమంలో ఐద్వ నాయకురాలు పయ్యవుల ప్ర భావతి, మందరపు పద్మ, అంగన్‌వాడీ కార్యకర్తలు పద్మ, ఉమ, చంద్రకళ, నాగేంద్ర, అరుణ, వినోద, సి ఐటియు మండల కార్యదర్శి కళ్యణ్‌లు పాల్గొన్నారు.

మార్కెట్‌లో ఈ బిడ్డింగ్ పరిశీలించిన జెసి
ఖమ్మం(గాంధీచౌక్), ఫిబ్రవరి 22: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తియార్డ్‌లో ఏర్పాటు చేసిన ఈ బిడ్డింగ్ విధానాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పరిశీలించారు. శనివారం ఆకస్మికంగా వ్యవసాయమార్కెట్‌ను జెసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఈ బిడ్డింగ్ పని చేసే విధానాన్ని పరిశీలించి అధికారులను అడిగి వివరాను తెలుసుకున్నారు. ఈ బిడ్డింగ్ విధానం ద్వారా రైతులకు, వ్యాపారులకు ఏ విధంగా సహకరిస్తుందో, వారికి లాభం ఏ విధంగా చేకూరుతుందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ బిడ్డింగ్ మిగిలిన పనులను త్వరతగతిన పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, సెక్రటరీ జావీద్, ఖాదర్‌బాబా తదితరులు పాల్గొన్నారు.

పోరుగర్జన సభను విజయవంతం చేయాలి
ఖమ్మం(ఖిల్లా), ఫిబ్రవరి 22: తెలంగాణ రాష్ట్ర ఏ ర్పాటు విజయోత్సవం, ఖమ్మం జిల్లాలోని ప్రజా స మస్యల పరిష్కారం కోసం ఈనెల 26న ఖమ్మం పె విలియల్‌గ్రౌండ్‌లో జరిగే పోరుగర్జన సభను విజయవంతం చేయాలని కోరుతూ సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో భా రీ మోటార్ సైకిల్ ర్యాలీ, ప్రదర్శనలు నిర్వహించా రు. ఈ ర్యాలీ పార్టీ కార్యాలయం నుంచి ఎన్‌ఎస్‌టి రోడ్, సరిత క్లినిక్ సెంటర్, ఆర్డీవో కార్యాలయం, మ యూరి సెంటర్, కాలువ ఒడ్డు, బోస్ సెంటర్ మీ దుగా జడ్పీ వరకు చేరుకుంది. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భద్రాచలం డివిజన్‌లోని గిరిజన మండలాలను పో లవరం ముంపులో ముంచేందుకు తీసుకున్న నిర్ణ యం ఆదివాసీ, గిరిజనులకు వ్యతిరేకమైన చర్యని అన్నారు. భద్రాచలం డివిజన్ మొత్తాన్ని ఖమ్మం జి ల్లాలోనే కొనసాగించే వరకు ఉద్యమం నిర్వహించాలన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రా జెక్ట్‌లను నిర్ణక్ష్యం చేసి ఖమ్మం జిల్లాకు నష్టం జరిగేలా దుమ్ముగూడెం, టెయిల్‌పాండ్ లింక్ కెనాల్‌ను చేపట్టడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో నా యకులు జి రామయ్య, నాగేశ్వరరావు, అశోక్‌కుమా ర్, కెఎస్ ప్రధీప్, కె శ్రీనివాస్, మంగతాయి, శిరోమ ణి, లక్ష్మణ్, కె పాపారావు, రామ్మూర్తి, విప్లవకుమార్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
గార్లలో..
గార్ల : జిల్లాలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ న్యూడెమోక్రసీ ఈనెల 26వ నిర్వహించే పోరుగర్జన సభను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం మం డల పరిధిలోని పలు గిరిజన గ్రామాల్లో ప్రదర్శనలు జరిగాయి. ప్రభుత్వ వైఖరిని తెలుపుతూ గోపాలపురం, పుల్లూరు, నగరం, శేరిపురం తదితర గ్రామాలతో పాటు గిరిజన గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలపురం గ్రామంలో జ రిగిన సభలో న్యూడెమోక్రసీ డివిజన్ నాయకుడు సక్రు మాట్లాడుతూ పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులపై మోపిన కేసులను ఉపసంహరించుకోవాలని, ఐకెపి బుక్‌కీపర్లను ఈజిఎస్ మే ట్లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతుకూలీ సంఘం మండలాధ్యక్ష, కార్యదర్శులు నర్సయ్య, వీ రభద్రం, కొండ య్య, నాగాచారి, కాంతారావు పాల్గొన్నారు.
కామేపల్లిలో..
కామేపల్లి : ఈనెల 26 జరిగే పోరు గర్జనను విజయవంతం చేయాలని కోరుతూ సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జీపుజాతాను నిర్వహించారు. కామేపల్లి, ఊట్కూర్ , కెప్టెన్‌బంజర, హ రిచంద్రాపురం, తాళ్ళగూడెం, జాస్తిపల్లి తదితర గ్రా మాల్లో జీపుజాతాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డి నాయకులు యాదన్న, లక్ష్మినారాయ ణ, చుక్కయ్య, రాంసింగ్, వెంకన్న పాల్గొన్నారు.

విద్యతోనే జీవితంలో రాణించాలి
వైరా, ఫిబ్రవరి 22: విద్య మానవునికి ముఖ్యమైన అవసరం అని విద్యతోనే ప్రతి వ్యక్తీ జీవితంలో రాణించగలర ని, ప్రతి వ్యక్తి విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.శ్రీనివాస్ అ న్నారు. శనివారం స్థానిక ఇందిరమ్మ కాలనీ ప్రాథమిక పాఠశాలలో 18మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 3వేలు చొప్పున ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌ను పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా మండల విద్యాశాఖాధికారి సలాది రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైరా ఉపాధ్యాయుడు నాగబత్తిన భాస్కరావు కృషితో ఇక్కడ పాఠశాల ప్రారంభ మై 26మంది పిల్లలతో నడుస్తుందని వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ పూర్తి పాఠశాలగా నడుస్తుందని, పక్క్భావ నం కూడా ప్రభుత్వం నిర్మించనున్నదని ఇక్కడ పాఠశాల పిల్లలతో శాశ్వతంగా కళకళలాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామారావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు గురుతర బాధ్యతను ఈ పిల్లలకు విద్యనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉ పసర్పంచ్ బ్రహ్మం, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జి ల్లా అధ్యక్షుడు జివి సూర్యప్రకాశరావు, ఆర్వీఎం అధికారు లు పొన్నం నర్సింహారావు, వెంకటరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చింతనిప్పు విజయకుమారి, ఉపాధ్యాయు లు పద్మ, ప్రగతి, రామలక్ష్మి, గ్రామస్థులు నర్సింహరావు, వీరబాబు పాల్గొన్నారు.

పేదలకు కష్టాలున్నంతకాలం కమ్యూనిజం
నేలకొండపల్లి, ఫిబ్రవరి 22: దేశంలో, రాష్ట్రంలో పేదలకు కన్నీళ్ళు, కష్టాలు ఉన్నంత కాలం కమ్యూనిజం అజయం గా ఉంటుందని సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరా వు అన్నారు. శనివారం స్థానిక కర్నాటి కృష్ణయ్య ప్రాంగణం లో (జగన్నాథఫంక్షన్)లో సిపిఐ పాలేరు నియోజకవర్గ స మావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న పువ్వాడ నా గేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సిపిఐ పెద్దఎత్తున ఉద్యమించిందన్నారు. తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్య క్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దా దాపు 400మంది సిపిఐ నాయకులు అసువులు బాశారన్నా రు. త్వరలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కా ర్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారన్నారు.సమావేశంలో రాష్టన్రాయకులు సిద్ధి వెంకటేశ్వ ర్లు, జిల్లా నాయకులు వౌలానా, మండల నాయకులు భా నుప్రసాద్, హేమంతరావు, ఖాన్, వెంకటేష్ పాల్గొన్నారు.

ఎటువంటి వ్య త్యాసం లేకుండా సోదరభావంతో పనిచేసేది పో లీస్ శాఖేనని, అందుకే ఎన్ని
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>