
లండన్, ఫిబ్రవరి 22: ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ స్టార్ వేన్ రూనీ తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేసుకున్నాడు. పారితో షికం విషయంలో తనను అధిగమించడం అతి తక్కువ మంది కే సాధ్యమని నిరూపించాడు. అతనితో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ భారీ మొత్తంతో కాంట్రాక్టు కుదుర్చుకోవడం ఈ విష యాన్ని స్పష్టం చేస్తున్నది. రూనీకి ఎవరూ సాటిరాని నిరూపిం చింది. 28 ఏళ్ల రూరీనికి వారానికి 3,00,000 పౌండ్లు (సుమారు 4,98,840 డాలర్లు) చెల్లించనుంది. తాజా ఒప్పందాన్ని అనుసరించి రూనీ 2019 వరకూ మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడు. ఇంతకు ముందు కుదుర్చుకున్న ఒప్పందం ముగియడానికి మరో 18 నెలల వ్యవధి ఉండగా, చెల్సియాకు అతను ట్రాన్స్‌ఫర్‌పై వెళతాడన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఒకానొక దశలో మాంచెస్టర్ యునైటెడ్ నుంచి చెల్సియాకు తరలి వెళతాడని, ఆ క్లబ్‌తోనే కాంట్రాక్టు కుదుర్చుకుంటాడని వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలకు తెరదించే రీతిలో మాంచెస్టర్ యునైటెడ్ కొత్త కాంట్రాక్టును కుదుర్చుకుంది. మరో నాలుగేళ్లపాటు అతను తమ క్లబ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడని మాంచెస్టర్ యునైటెడ్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలావుంటే,మాంచెస్టర్ యునైటెడ్‌లో కీలక ఆటగాడిగా ఎదిగిన రూనీ 200 గోల్స్ మైలురాయిని గత ఏడాది సెప్టెంబర్‌లో చేరాడు. గత ఏడాది రూనీ అరుదైన మైలురాయిని చేరాడు. ఈ జట్టు తరపున 200 లేదా అంతకు మించి గోల్స్ సాధించిన నాలుగో క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. మాంచెస్టర్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ 249 గోల్స్ చేసిన బాబీ చార్ల్‌టన్ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. డెనిస్ లా 237, జాక్ రోలీ 211 గోల్స్‌తో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాడు. చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా బయెర్ లెవెర్‌కసెన్‌తో జరిగిన మ్యాచ్‌లో రూనీ ఓ గోల్ చేసి, మాంచెస్టర్ 4-2 విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇది అతనికి మాంచెస్టర్ తరపున 200వ గోల్ కావడం విశేషం. మ్యాచ్ అనంతరం రూనీ మాట్లాడుతూ తన జట్టు గెలిచిన ప్రతిసారీ తాను ఎంతో ఆనందిస్తానని అన్నాడు. గోల్ చేయడాన్ని బోనస్‌గా అభివర్ణించాడు. మైదానంలోకి దిగిన ప్రతిసారీ అత్యుత్తమ ఆటతో రాణించడానికి కృషి చేస్తానని, రికార్డులను గురించి పట్టించుకోనని చెప్పాడు. కాగా, మాంచెస్టర్ యునైటెడ్ తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో బాబీ చార్ల్‌టన్ (249 గోల్స్), డెనినస్ లా (237 గోల్స్), జాక్ రాలే (211 గోల్స్) తర్వాత నాలుగో స్థానం రూనీకి దక్కుతుంది.