ఢాకా, ఫిబ్రవరి 22: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్ వేటు పడింది. దీనితో అతను శ్రీలంకతో శనివారం జరిగిన చివరిదైన మూడో వనే్డలో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. అంతేగాక, ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగే మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ అతను ఆడే అవకాశం లేదు. లంకతో జరిగిన రెండో మ్యాచ్‌లో షకీబ్ 24 పరుగులకే అవుటయ్యాడు. టీవీ కెమెరీ తనపైనే ఫోకస్ చేయడాన్ని గుర్తించిన అతను అసహ్య సంకేతాలిచ్చాడు. ఈ దృశ్యం లైవ్‌లో కనిపించడంతో అతను తప్పించుకునే అవకాశం లేకపోయింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) క్రమశిక్షణ కమిటీ సమావేశమై, షకీబ్‌పై చర్య తీసుకోవాలని నిర్ణయించింది. అతనికి 3,00,000 బంగ్లా టాకాలు (సుమారు 3,860 డాలర్లు) జరిమానాగా విధించింది. అంతేగాక, మూడు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేసింది. షకీబ్‌కు జరిమానా విధించి, అతనిపై సస్పెన్షన్ వేటు వేశామని, ఇలాంటి సంఘటనపు పునరావృతమైతే మరింత కఠిన చర్య తీసుకుంటామని స్పష్టం చేశామని బిసిబి తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి ప్రకటించాడు. కాగా, మూడో వనే్డ ఆరంభానికి ముందే శ్రీలంక చేతిలో సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయిన కారణంగా షకీబ్ ఆ మ్యాచ్‌లో లేకపోయినా బంగ్లాదేశ్‌కు ఎలాంటి నష్టం లేకపోయింది. అయితే, ఆసియా కప్ పోటీల్లో మొదటి రెండు మ్యాచ్‌లకు అతను దూరంకావడం జట్టును సమస్యల్లోకి నెట్టే అవకాశం ఉంది. షకీబ్ కెరీర్‌లో ఇప్పటివరకూ 34 టెస్టలు, 131 వనే్డలు, 28 టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుత ప్రపంచ మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా ఎదిగిన అతను క్రీడాస్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించడం పట్ల బంగ్లాదేశ్ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూడు మ్యాచ్‌ల నుంచి సస్పెన్షన్
english title:
suspension
Date:
Sunday, February 23, 2014