Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఇటలీ ముందు మోకరిల్లి...

$
0
0

ఇద్దరు హంతకులను నిర్దోషులుగా నిరూపించడానికి ఇటలీ ప్రభుత్వం జరుపుతున్న దౌత్య బీభత్సం ముందు మన ప్రభుత్వం మరోసారి మోకరిల్లింది. ఇటలీకి చెందిన ఈ హంతక నావికులను మరణశిక్ష నుండి విముక్తి చేస్తున్నట్టు మన ప్రభుత్వం న్యాయ విచారణకు పూర్వమే నిర్ధారించింది. ఇందుకు వీలుగా హంతక నావికులకు వ్యతిరేకంగా కేరళ పోలీసులు, కేంద్ర దర్యాప్తు బృందాలు రూపొందించిన అభియోగాలను కేంద్ర ప్రభుత్వం నీరుగార్చివేసింది. కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులను నిష్కారణంగా హత్య చేసిన ఇటలీ నావిక హంతకులను విచారించి శిక్షించే వ్యవహారంలో మన ప్రభుత్వం గత రెండేళ్ళుగా అనుసరిస్తున్న దేశ వ్యతిరేక విధానానికి ఇలా అభియోగాల తీవ్రతను తగ్గించడం మరో సాక్ష్యం. ఇలా తమ హంతక నావికులకు మరణశిక్ష నుంచి అక్రమ పద్ధతుల ద్వారా తప్పించడానికి ఇటలీ ప్రభుత్వం రెండేళ్ళుగా ప్రయత్నిస్తూనే ఉంది. ప్రతి దశలోనూ మన ప్రభుత్వం నోట ఇటలీ మాట ప్రతిధ్వనిస్తుండడం దిగ్భ్రాంతిని కలిగిస్తున్న విపరిణామ ప్రక్రియ. ఒత్తడి పెంచడంలో భాగంగా ఇటలీ ప్రభుత్వం గత పద్ధెనిమిదవ తేదీన మన దేశంలోని తన రాయబారిని ఉపసంహరించుకొంది, వెనక్కి పిలిపించింది. ఒత్తడి పెంచడంలో భాగంగానే ఐరోపా దేశాల సమాఖ్య వారు మన ప్రభుత్వాన్ని అనేక నెలలుగా ప్రయత్నిస్తున్నారు. రోమ్ నగరంలోని భారతీయ రాయబారి కార్యాలయాన్ని మూసివేయాలని ఇటలీ అంతటా ప్రదర్శనలు జరుగుతుండటం ఈ ఒత్తడి పెంచడంలో భాగం. రోమ్‌లోని భారతీయ దౌత్యకార్యాలయంపై దాడులు చేస్తామంటూ శే్వతజాతీయ దురహంకారులు రోజూ హెచ్చరికలు చేస్తున్నారట. ఈ బెదిరింపులలో భాగం ‘బుల్లెట్ల’ను ఇతర పేలుడు పదార్ధాలను గుర్తు తెలియని దుండగులు మన రాయబార కార్యాలయానికి పంపించారట! హత్యలు చేసిన నావికుల దేశానికి చెందిన ప్రభుత్వం, దౌర్జన్యకారులు ఇలా బాధితుల, హతుల దేశాన్ని బెదిరించడం విచిత్రమైన పరిణామం. నిజానికి ఈ నావిక హంతకులను సత్వర విచారణ జరిపి వారికి మరణదండన విధించాలని ఆందోళనలు జరగవలసిన మనదేశంలో...తమ దౌత్య దౌర్జన్యకాండకు ప్రతిక్రియగా మనదేశం కూడ ఇటలీ నుండి మన రాయబారిని దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాలి. అలా జరిగినట్టయితే ఇటలీ ప్రభుత్వం న్యాయ విచారణ పూర్తయ్యే వరకు నోరు మూసుకొని పడి ఉండేది. మన ప్రభుత్వం అలాంటి సాహసానికి పూనుకోవడం లేదు. ఇటలీ ప్రభుత్వ అభీష్టం మేరకు నేర అభియోగాల ప్రక్రియను తగ్గించివేసింది. ఇప్పుడు మన న్యాయస్థానాలలో ఇటలీ హంతకుల నేరం ధ్రువపడినట్టయితే వారికి కేవలం ఐదేళ్ళ జైలుశిక్షను విధించేందుకు మాత్రమే వీలుంది. తమ హంతకుల ప్రాణాలు ఇటలీ ప్రభుత్వానికి ఇంత విలువైనవి. భారతీయ హతుల ప్రాణాలకు ఇటలీ దృష్టిలో విలువ లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం దృష్టిలో నిష్కారణంగా హత్యలకు గురైన మన జాలర్ల ప్రాణాలకు విలువ లేదని ధ్రువపడింది.
ఇలా నేరస్థులను విడిపించుకొని పోవడానికి లేదా నిర్దోషులుగా నిర్ధారించడానికి అనేక దేశాలు మన దేశానికి వ్యతిరేకంగా మాత్రమే ఒత్తడి చేస్తుండడం చులకనైపోయిన మన సార్వభౌమ అధికారానికి నిదర్శనం. మన దేశానికి చెందిన నిర్దోషులు వివిధ దేశాలలో ప్రభుత్వ దమనకాండకు, నేరస్థుల దౌర్జన్య కాండకు గురవుతున్న సందర్భాలలో సైతం మన ప్రభుత్వం ఆయా దేశాలకు వ్యతిరేకంగా దౌత్య చర్యలను సాగించడంలో విఫలమైంది. ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్ధులు హత్యలకు, వేధింపులకు గురి అయినప్పుడు మన ప్రభుత్వం మన రాయబారిని వెనక్కి పిలిపించలేదు. అమెరికా ఏళ్ళ తరబడి భారతీయ అధికారులు, రాజకీయ వేత్తలు తమ దేశానికి వచ్చినప్పుడు అవమానకరమైన రీతిలో వారిని ఒళ్ళంతా తడిమి తనిఖీ చేస్తోంది. చివరికి మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాంను సైతం అమెరికా ఇలా అవమానించి నప్పుడు మన ప్రభుత్వ దౌత్య ప్రక్రియకు సాహసించలేదు. మన దౌత్య అధికారిణి దేవయానిని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు సైతం మన ప్రభుత్వం రాయబారిని వెనక్కు రప్పించలేదు. నాలుగేళ్ళ క్రితం అమెరికాలోని భారతీయ విద్యార్ధుల కాళ్ళకు ధ్వని శృంఖలాలను తగిలించి అవమానించినప్పుడు సైతం మన ప్రభుత్వం దౌత్యపరమైన ప్రతీకారానికి పూనుకొనలేదు. చైనాలో మన వ్యాపారులపై భయంకరంగా దాడులు జరిగాయి. మన వ్యాపారులలో అనేకమందిని చైనా ఏళ్ళ తరబడి నిర్బంధించింది. ప్రస్తుతం కూడ కొందరు మన వ్యాపారులు చైనా జైళ్ళలో మగ్గుతున్నారు. అయినప్పటికీ రాయబారిని వెనక్కు రప్పించడం వంటి తీవ్ర చర్యలకు మనం పూనుకోలేదు.
నిర్దోషి అయిన మన సర్వజిత్ సింగ్‌ను పాకిస్తాన్ జైల్లో చంపివేసినప్పుడు సైతం మన ప్రభుత్వం రాయబారిని వెనక్కి రప్పించడానకి పూనుకోలేదు. కానీ చట్టం ప్రకారం అంతర్జాతీయ దౌత్య నిబంధనల ప్రకారం మన దేశంలోని న్యాయస్థానాలలో విచారణకు గురి కావలసిన తమ హంతకులకు మద్దతుగా ఇటలీ ప్రభుత్వం మాత్రం తీవ్రమైన ఒత్తడికి మన ప్రభుత్వాన్ని గురి చేస్తోంది..తమ రాయబారిని వెనక్కి రప్పించుకొంది. ప్రతిచర్యగా మన ప్రభుత్వం కూడ ఇటలీ రాజధాని రోమ్ నగరంలోని మన దౌత్య కార్యాలయాన్ని మూసివేయాలి. కానీ మన ప్రభుత్వం ఇటలీ ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించి తదనుగుణంగా, ప్రవర్తిస్తోంది. సముద్రతీర నౌకాయాన భద్రతా విఘాత కలాపాల నిరోధక చట్టం కింద ఇటలీకి చెందిన హంతక నావికులపై అభియోగాలు నమోదయ్యా యి. మసిలానో లాతోరే, సాల్వటోరే గిరానే అన్న ఈ ఇద్దరు హంతకులు 2012 పిబ్రవరి 12వ తేదీన కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులను కాల్చి చంపారు. ఈ హత్యలు జరిగినప్పుడు, హంతకులెక్కి ఉన్న ఎండ్రికాయెలెక్సీ అనే నౌక కేరళ తీరానికి దాదాపు పదిమైళ్ల దూరంలో ఉంది. హంతక నౌకను పసికట్టిన జాలర్లు అ నౌక వెళ్ళిన తరువాత తమ పడవను ముందుకు నడిపించాలన్న తలంపుతో ఆగిపోయారు. కానీ తమ నౌక సమీపంలో ఆగి ఉన్న పడవలోని నిరాయుధులపై ఈ ఇటలీ నావికులు నిష్కారణంగా కాల్పులు జరిపారు. కేవలం చేతుల దురద తీర్చుకోవాలన్న పైశాచిక వాంఛ హంతకులను ఈ బీభత్స చర్యకు ప్రేరేపించింది. కానీ ఆ తరువాత హంతకులు పదేపదే మాట మార్చారు. నిరాయుధులైన ఇద్దరు జాలర్లు ఓడ దొంగలని తాము పొరబడినట్టు మొదట వాదించారు. ఓడ దొంగలు పగలు ఆయుధాలు లేకుండా చిన్న పడవపై వచ్చి దాడి చేయరు. ఓడ దొంగలు చిన్న ఓడలో కాని పెద్ద పడవలోకాని వస్తారు. ఒకరిద్దరుగా రారు. పదిహేను మందికి పైబడిన సంఖ్యలో సాయుధలై జట్లు జట్లుగా వస్తారు. అందువల్ల ఈ వాదం వీగిపోవడంతో నేరం జరిగినప్పుడు తమ నౌక భారతీయ జలాలలో లేదని, అంతర్జాతీయ సముద్రజలాల్లో ఉందని మళ్ళీ మాట మార్చారు..
నిందితులు నేరస్థులా నిర్దోషులా? దుర్బుద్ధితో దుర్మార్గం జరిపారా? పొరపాటున హత్యలు చేశారా? హత్యలు జరిగిన సమయంలో ఓడ భారతీయ జలాలలో ఉందా? అంతర్జాతీయ జలాలలో ఉందా? ఎంత శిక్ష విధించాలి? ఇవన్నీ నిర్ధారించవలసింది మన దేశంలోని న్యాయస్థానాలు. కేంద్ర ప్రభుత్వం కాదు. కానీ ప్రభుత్వం ఇటలీ వారి దౌత్య బీభత్సం ముందు లొంగిపోయింది. అందువల్లనే నిందితులకు వ్యతిరేకంగా నమోదైన అభియోగాలను నీరు కార్చుతోంది...హతులైన జాలర్ల తరపున మాట్లాడే దిక్కు లేదు.

ఇద్దరు హంతకులను నిర్దోషులుగా నిరూపించడానికి
english title: 
i

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>