విజయనగరం, ఫిబ్రవరి 24:తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు. సోమవారం అశోక్‌బంగ్లాలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మీసాల గీత, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు గోగుల రమేష్‌లతోపాటు సుమారు రెండు వేల మంది ఆమె అభిమానులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు అశోక్‌గజపతిరాజు కండువా వేసి సాదరపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ పార్టీకి పనిచేసే కార్యకర్తలు, ఆలోచించే ప్రజలు అవసరమన్నారు. తెలుగుదేశం పార్టీకి పౌరుషత్వం ఉందని దానికి విలువ ఉంటుందని, మూర్ఖత్వానికి తల, తోక ఉండదని పరోక్షంగా మంత్రి బొత్స సత్యనారాయణను విమర్శించారు. జిల్లాలో ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం పడేకశాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి 23 జిల్లాల్లో అబ్కారీ ఆదాయం 3600 కోట్ల రూపాయలు ఉండగా, మంత్రి బొత్స జిల్లాలో ఏడాదికి రూ.3600 కోట్ల రూపాయలు అమ్మకాలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో టీ బిల్లు, మోజువాణి ఓటు అంటూ అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మీసాల గీత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పూడ్చలేని లోటును తెచ్చిపెట్టిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శోభ హైమవతి, డాక్టర్ వి.ఎస్.ప్రసాద్, కె.వి.నరసింగరావు, ఎస్‌ఎన్‌ఎం రాజు, మన్యాల కృష్ణ, ప్రసాదుల రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మీసాల గీత టిడిపిలో చేరుతున్న సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎల్‌ఐసి భవనం నుంచి ప్రారంభమై ఆర్టీసీ కాంప్లెక్స్, ఎత్తుబ్రిడ్జి మీదుగా అశోక్‌బంగ్లా చేరుకుంది. ఈ ర్యాలీలో ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు గోగుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
‘వినతుల స్వీకరణకు ప్రత్యేక విభాగం’
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 24: పట్టణంలో వినతుల స్వీకరణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడమేకాకుండా, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ఆర్ సోమన్నారాయణ తెలిపారు. డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణ ప్రజల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు వచ్చాయి. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ బాగోలేదని, మున్సిపల్ స్థలాలు ఆక్రమణలు తదితర సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ సోమన్నారాయణ మాట్లాడుతూ పట్టణంలో సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించేందుకు కాల్‌సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల నుంచి నేరుగా వచ్చిన వినతులతోపాటు డయల్ యువర్ కమిషనర్, వార్డు సందర్శనలో వచ్చిన ఫిర్యాదులను కూడా కాల్‌సెంటర్ రికార్డుల్లో నమోదు చేసి, వాటిని కంప్యూటర్‌లో పొందుపర్చుతామన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఫణిరామ్, మున్సిపల్ ఇంజనీర్ ఎం.బాబు, పాల్గొన్నారు.
అశోక్
english title:
p
Date:
Tuesday, February 25, 2014